E-Paper
Advertisement

Bhagvad Gita: మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? భగవద్గీత ఏం చెప్పిందంటే

Bhagvad Gita: మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? భగవద్గీత ఏం చెప్పిందంటే
Advertisement

మనిషి జీవితంలో ఒక పెద్ద ప్రశ్న ఎప్పుడూ ఉంటుంది. మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతుంది? ఆత్మ ఎక్కడికి వెళుతుంది? ఈ ప్రశ్నలకు వేల సంవత్సరాల క్రితమే సమాధానం చెప్పిన గ్రంథం భగవద్గీత. హిందూ తత్వశాస్త్రంలో భగవద్గీతకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇందులో శ్రీకృష్ణుడు అర్జునుడికి జీవితం, మరణం, ఆత్మ గురించి ఎన్నో గొప్ప సత్యాలను వివరించాడు. అవి కేవలం అర్జునుడు మాత్రమే కాదు అందరూ తెలుసుకోవాల్సిన జీవిత సూత్రాలు.

ఆత్మ ఎలాంటిదంటే…
భగవద్గీత ప్రకారం మనిషి చనిపోవడం అంటే అంతం కాదు. శరీరం మాత్రమే నశిస్తుంది. ఆత్మ మాత్రం ఎప్పటికీ చనిపోదు. గీతలో చెప్పినట్లు ఆత్మ శాశ్వతం. అది జననం లేకుండా, మరణం లేకుండా ఉంటుంది. కత్తి దాన్ని కోయలేదు. అగ్ని దాన్ని కాల్చలేదు. నీరు దాన్ని తడపలేదు. గాలి దాన్ని తాకలేదు. అంటే ఆత్మను ఎవరూ నాశనం చేయలేరు. మరణం ఒక మార్పు మాత్రమే. మనిషి పాత బట్టలు వదిలి కొత్త బట్టలు వేసుకున్నట్లే, ఆత్మ కూడా పాత శరీరాన్ని వదిలి మరో కొత్త శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ భావనను భగవద్గీత చాలా సులభంగా వివరించింది. అందుకే హిందూ సంప్రదాయంలో మరణాన్ని ఒక ముగింపు కాకుండా కొత్త ప్రయాణం ప్రారంభంగా భావిస్తారు.

Advertisement

Also read: Bald Head: మనదేశంలోని మగవారిలో సగం మందికి బట్టతల సమస్య, అసలు కారణం ఏమిటో తెలుసా?

మీరు చేసే కర్మ ఫలితాలే…
భగవద్గీతలో చెప్పిన మరొక ముఖ్యమైన విషయం కర్మ. మనిషి జీవితంలో చేసే మంచి పనులు, చెడు పనులు అన్నీ కలిసి అతని కర్మగా మారతాయి. ఈ కర్మల ప్రభావం ఆత్మపై ఉంటుంది. మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ తరువాతి జన్మను తీసుకునేటప్పుడు ఈ కర్మలతే ముఖ్య పాత్ర. మంచి పనులు చేసినవారికి మంచి జీవితం లభిస్తుంది. చెడు పనులు చేసినవారికి కష్టాలు ఎదురవుతాయి అని గీతలో చెప్పారు.

Advertisement

మరణం సమయంలో మనసులో ఉండే చివరి ఆలోచన కూడా చాలా ముఖ్యమని భగవద్గీత చెబుతుంది. జీవితమంతా మనిషి ఏ విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాడో అదే చివరి క్షణంలో కూడా గుర్తుకు వస్తుంది. ఆ చివరి ఆలోచన ఆత్మకు వచ్చే తరువాతి జన్మను ప్రభావితం చేస్తుంది. అందుకే జీవితంలో మంచి ఆలోచనలు, ధార్మిక జీవనం చాలా అవసరం అని పెద్దలు చెబుతుంటారు. భగవద్గీత ప్రకారం చాలా మంది ఆత్మలు జననం, మరణం అనే చక్రంలో తిరుగుతూనే ఉంటాయి. దీనిని సంసారం అని అంటారు. మనిషి తన కర్మల కారణంగా మళ్లీ మళ్లీ జన్మలు తీసుకుంటూ ఉంటాడు. ఇది ఒక నిరంతర చక్రంలా కొనసాగుతుంది. అయితే ఈ చక్రం నుంచి బయటపడే మార్గం కూడా భగవద్గీతలో చెప్పారు

ఆ మార్గమే మోక్షం. మోక్షం అంటే జనన మరణాల చక్రం నుంచి పూర్తిగా విముక్తి పొందడం. భక్తి, జ్ఞానం, ధర్మం పాటిస్తూ జీవించే వ్యక్తి మోక్షాన్ని పొందగలడని గీత చెబుతుంది. అప్పుడు ఆత్మ పరమాత్మతో ఏకమవుతుంది. ఇక మళ్లీ జన్మలు ఉండవు. ఈ విధంగా చూస్తే భగవద్గీత మనిషి జీవితానికి ఒక గొప్ప తత్వాన్ని అందిస్తుంది. జీవితం తాత్కాలికం అయినా ఆత్మ శాశ్వతం అని చెప్పడం ద్వారా మనిషి భయాన్ని తగ్గిస్తుంది. మంచి పనులు చేయాలని, ధార్మికంగా జీవించాలని సూచిస్తుంది. మరణం గురించి భయపడకుండా జీవితం విలువైనదిగా భావించాలని గీత సందేశం ఇస్తుంది.

అందుకే వేల సంవత్సరాలు గడిచినా కూడా భగవద్గీతలో చెప్పిన జీవన సత్యాలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని ప్రభావితం చేస్తున్నాయి.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×