E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: బాలు ఫోన్ కొట్టేసేందుకు రోహిణి ప్లాన్.. ప్రభాను చూసి సత్యం షాక్.. బాలు, మీనా ఎంత క్యూట్ గా ఉన్నారో..

Gundeninda GudiGantalu Today episode: బాలు ఫోన్ కొట్టేసేందుకు రోహిణి ప్లాన్.. ప్రభాను చూసి సత్యం షాక్.. బాలు, మీనా ఎంత క్యూట్ గా ఉన్నారో..
Advertisement

Gundeninda GudiGantalu Today episode march 17th: నిన్నటి ఎపిసోడ్ లో.. గుడ్ న్యూస్ చెప్పాలి అని అనగానే ప్రభావతి అదేనా అని అడుగుతుంది. అది కాదు అత్తయ్య అని రోహిణి అంటుంది.. మేం కూడా మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని నేను అంటుంది.. ముందుగా మేమే ఇంటికి వచ్చాము కాబట్టి మేమే గుడ్ న్యూస్ చెప్తాము అని బాలు అంటాడు. కానీ ప్రభావతి మాత్రం వాడు గొప్ప బిజినెస్ మెన్ వాడే ఏదో మంచి న్యూస్ చెప్పబోతున్నాడు అన్నమాట. నువ్వు ఆగు నీ తర్వాత చెప్పొచ్చు కదా అనేసి ప్రభావతి అంటుంది.

మేమే చెప్తాము అని బాలు చెప్తాడు.. చిన్న గంప పెళ్లి ఫిక్స్ అయ్యింది.. అదే మీనా చెల్లెలు సుమతికి అని అనగానే అందరు సంతోషంగా ఉంటారు. ఏంటి ఇది ఒక గుడ్ న్యూస్ ఆ అని ప్రభావతి వెటకారంగా మాట్లాడుతుంది.. మీనా వాళ్ళ చెల్లెలు పెళ్లి ఫిక్స్ అయ్యిందంటే అది గుడ్ న్యూస్ ఏ కదా అని అందరూ అంటారు. సత్యం మాత్రం ప్రభావతి మాటకు దిమ్మ తిరిగిపోయేలా కౌంటర్ వేస్తాడు.. నువ్వు ఇలాంటివి పొగడకపోయిన పర్వాలేదు కానీ ఏది అనకు ముందు వెళ్లి మూడు కోతులు బొమ్మలు చూసుకొ అని ప్రభావతితో అంటాడు. సుమతి పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పగానే అందరూ సంతోషపడతారు.. ఇక మనోజు డీలర్స్ కోసం ఏర్పాటు చేసిన ఫంక్షన్ లో అందరు ఎలా ఉండాలని రోహిణి మనోజ్ ప్లాన్ చేసి చెప్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. బాలు రవిలను పైకి తీసుకుని వెళ్లి ఆ బిజినెస్ డీల్ గురించి చెప్తాడు. మొదట వాళ్ళు ఒప్పుకోకపోయినా సరే దానివల్ల వచ్చే లాభాల గురించి చెప్పడంతో మనోజ్ బాగుపడతాడు అని బాలు ఒప్పుకుంటాడు.. అయితే బాలుని ఏకంగా 50 కార్లకు ఓనర్ అని మనోజ్ అబద్ధం చెప్తాడు. అలాగే రవి ఒక పెద్ద రెస్టారెంట్ కి ఓనర్ అని చెప్పినట్లు మనోజ్ చెప్తాడు. ఏదో ఒకటి చేసి బాలు రవిలను మనోజ్ ఒప్పిస్తాడు.. ఇక రోహిణి కూడా మీనా శృతిలను కూడా ఒప్పిస్తుంది. రాత్రి బాలు మీనా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు.. మీరిలా అబద్ధం చెప్పడానికి ఒప్పుకుంటారండి అని అస్సలు ఊహించలేదు అని మీనా అంటుంది.. మా అమ్మ వాడు బాగుపడితే సంతోషపడుతుంది కదా అందుకే  నేను ఒప్పుకున్నాను అని అంటాడు.. ఏది ఏమైనా కూడా వాళ్ళు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం బాగానే ఉంది రేపు ఏం జరుగుతుందో చూద్దాం అనేసి అనుకుంటారు..

ఇక తర్వాత అందరూ కలిసి రెడీ అయ్యి ఫంక్షన్ హాల్ కి వెళ్లాలని అనుకుంటారు.. రోహిణి చాలా అందంగా ఉన్నావు తెలుసా నువ్వు ఇంత బాగున్నావ్ అని నాకు ఇప్పుడే అర్థం అవుతుంది ఈరోజు నువ్వు చాలా రిచ్ గా కూడా కనిపిస్తున్నావు అని విద్య అంటుంది.. మనోజ్ కి ఈ డీల్ గనక ఓకే అయితే కోటీశ్వరులు అవుతాము అని రోహిణి చాలా సంతోషంగా ఉంటుంది. ఇకపోతే మనము ఇవాళ సంతోషంగా ఉండడం కాదు ఇవాళ ఎలాగైనా సరే బాలు దగ్గర ఫోన్ కొట్టేయాలి ఆ వీడియోని గుణకు పంపించాలి. ఇదే లాస్ట్ ఛాన్స్ అసలు మిస్ చేయకూడదు అని అనుకుంటారు. ఇంతకీ మనోజ్ ఎక్కడున్నాడో వెతకాలి కదా అనేసి విద్య రోహిణి ఇద్దరు బయటకు వెళ్తారు.

Advertisement

ఆ తర్వాత మనోజ్ దగ్గరికి వెళ్లగానే మనోజ్ రోహిణి చూసి నువ్వు చాలా అందంగా ఉన్నావు రోహిణి ఇవాళ చాలా స్పెషల్ గా కనిపిస్తున్నావు అని పొగిడేస్తాడు. అయితే మనోజ్ కు రోహిణి పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్తుంది. అలాగే మనోజ్ కూడా హ్యాపీ వెడ్డింగ్ యానివర్స్ డే అని చెప్తాడు. అందరూ ఎలా రెడీ అయ్యారో లోపలికి వెళ్లి చూద్దాం పద అనేసి మనోజ్ లోపలికి తీసుకొని వెళ్తాడు. ప్రభావతిని చూసిన కామాక్షి చాలా అందంగా ఉన్నావు. వదిన ఇలా నిన్ను అన్నయ్య కనుక చూస్తే మళ్ళీ ఎప్పుడు పెళ్లి చేసుకుందామా అని అడుగుతాడు అని అంటుంది. అప్పుడే అక్కడ సత్యం కనిపించడంతో ప్రభావతి ఎలాగైనా సరే ఆడుకోవాలని ఉంటుంది. సత్యంతో కావాలని ఆటపటిస్తుంది.

అది చూసిన సత్యం ప్రభావతితో ఒక ఆట ఆడుకుంటాడు. నేను చాలా అందంగా ఉన్నానని కామాక్షి అంటుంది అంటే అవును నువ్వు చాలా అందంగా ఉన్నావు అని పొగిడేస్తాడు ప్రభావతి అలా వెళ్ళగానే కామాక్షితో ఈ వయసులో ఈ రంగులు అవసరం అంటావా అని అంటాడు.. రవి శృతిలను చూసి ప్రభావతి మీరు చాలా అందంగా ఉన్నారు అని అంటుంది. ఇక శృతి కూడా మీరు చాలా అందంగా ఉన్నారండి అని అంటుంది.. ఆ తర్వాత బాలుమినాలు ఎలా ఉంటారు అని మాట్లాడుకుంటారు అయితే ప్రభావతి మాత్రం వాళ్ళిద్దర్నీ తీసి పడేస్తుంది.. కానీ చివరికి వాళ్ళిద్దర్నీ చూసి ప్రభావతి కూడా ముక్కును వేలేసుకుంటుంది.

Also Read :మహాకు షాకిచ్చిన లాయర్.. మహాను వదిలేసిన చక్రీ..కానిస్టేబుల్ కు నిజం చెప్పిన చక్రీ..

ప్రభావతి నీ కొత్తగా చూపించాలని కామాక్షి అనుకుంటుంది కానీ బాలు మాత్రం ప్రభావతి పరువు ని అడ్డంగా తీసేస్తాడు. ఇక అందరూ కలిసి పార్టీ స్టార్ట్ అవుతుందని చాలా సంతోషంగా ఉంటారు బాలు మీనా ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఫోటోలు దిగుతుంటే ఫోన్ కింద పడిపోతుంది. విద్య రోహిణి అక్కడికి రావడంతో బాలు మాత్రం ఆ ఫోన్ ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో డీలర్ కి బాలు రవి నిజం చెప్పేస్తాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

 

Related News

Illu Illalu Pillalu Today Episodes: అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి.. నర్మదకు భద్రపై అనుమానం.. వేదవతి ఫుల్ హ్యాపీ..

Intinti Ramayanam Today Episode: పాపం మీనాక్షికి కన్నీళ్లు.. పల్లవి, కమల్ రొమాన్స్.. యోగా టీచర్ ఎంట్రీ అదుర్స్..

Brahmamudi Serial Today Episode July 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఇంటికి వచ్చిన రాజు   

Actress Sirisha : నటి శిరీష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Godhavari Janu : ‘గోదావరి ‘ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Telugu Serials : సీరియల్స్ కు పేమెంట్ ఎలా ఇస్తారు..? అర్రె ఇన్నాళ్లు ఇది మిస్ అయ్యామా..?

Tuesday Movies in Tv : మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

బిగ్ బాస్ సీజన్ 10కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×