BigTV English

Dwarakadhish : శ్రీకృష్ణుని మనవడు నిర్మించిన ‘ద్వారకాధీష్’.. ఎక్కడుందంటే..

Dwarakadhish : శ్రీకృష్ణుని మనవడు నిర్మించిన ‘ద్వారకాధీష్’.. ఎక్కడుందంటే..

Dwarakadhish : ఛార్‌ధామ్ యాత్రలో భాగమైన ఈ ‘ద్వారకాధీశ్’ ఆలయం గుజరాత్‌లోని ద్వారక నగరంలో ఉన్న హిందూ దేవాలయం. ఇక్కడ ఉత్తరం వైపున ఉన్న ద్వారాన్ని మోక్షద్వారం అని..దక్షిణ దిశలో ఉన్న ద్వారాన్ని స్వర్గ ద్వారం అని అంటారు. భక్తులు స్వర్గ ద్వారం గుండా వెళ్లి మోక్షద్వారం గుండా వస్తారు. అందువల్లే ఈ ద్వారక నగరానికి మోక్షనగరమని పేరు.


ఒక్కరాత్రిలో నిర్మాణం..

ఈ విగ్రహంలో భగవానుడు నాలుగు చేతులతో ఉంటాడు. ఒక చేతిలో శంఖం, మరొక చేతిలో సుదర్శన చక్రం ఇంకో చేతిలో గద ఉండగా, నాల్గవ చేతిలో తామర పుష్పం ఉంటుంది. పురాణాలను అనుసరించి ఈ దేవాలయాన్ని విశ్వకర్మ ఒక్క రాత్రిలో నిర్మించాడని, అదే సమయంలో విగ్రహాన్ని కూడా ఆయనే చెక్కి ఇక్కడ ప్రతిష్టించాడని చెబుతారు. ఈ ఆలయాన్ని 2500 ఏళ్ల క్రితం సున్నపురాయితో నిర్మించినా.. ఇప్పటికీ చెక్కుచెదరలేదు.


రోజుకు ఐదు సార్లు జెండాలు మార్పు..

ఈ ద్వారకాధీశ్ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. సూర్యచంద్రులు కలిగిన జెండాలు ఆలయ గోపురం మీద నిత్యం ఎగురుతూ ఉంటాయి. అయితే.. ఈ జెండాలను రోజుకు ఐదు సార్లు మారుస్తారట. ఇక్కడి మూల విరాట్టు వైష్ణవుడైనా ఆలయ నిర్మాణం మాత్రం శైవ సంప్రదాయంలో చోటు చేసుకొంది. ఈ ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×