Tortoise Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం ఒక లోహపు తాబేలు లేదా సజీవ తాబేలును ఇంటికి ఉత్తరాన ఉంచాలి. ఈ దిశలో తాబేలు ఉంచడం వల్ల కుటుంబానికి సంపదలు చేకూరుతాయి. ఇది ఆనందం, శ్రేయస్సు, సానుకూలత , సమృద్ధిని కూడా తెస్తుంది. అంతే కాదు కుటుంబ సభ్యుల జీవితం కాలం కూడా పెరుగుతుంది.
సనాతన ధర్మంలో తాబేలును విష్ణువు రూపంగా చూస్తారు. వాస్తవానికి, సముద్ర మథనం సమయంలో విష్ణువు కర్మావతారం ధరించి విశ్వాన్ని సమతుల్యం చేయడానికి కృషి చేశాడు. హిందూ కుటుంబాలలో తాబేలును పూజ్యమైనదిగా భావించడానికి ఇదే కారణం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో లేదా ఆఫీసుల్లో నిజ, లోహపు తాబేలు ఉంచడం శుభప్రదం. చాలా మందికి తాబేలును ఏ దిశలో ఉంచాలో తెలియదు. ఈ రోజు తాబేలు ఇంట్లో ఉంచితే కలిగే లాభాలు, ఏ దిశలో ఉంచాలనే విషయాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం మెటల్ తాబేలు, జీవించి ఉన్న తాబేలును ఇంటికి ఉత్తరాన ఉంచాలి. ఈ దిశలో తాబేలు ఉంచడం వల్ల వాస్తు ప్రకారం కుటుంబానికి సంపదలు చేకూరుతాయి. అంతే కాకుండా ఆర్థిక లాభాలు కూడా పెరుగుతాయి. విద్యా ఉద్యోగ సంబంధ సమస్యలు కూడా దూరం అవుతాయి.
ఇంట్లో తాబేలు ఉంచడానికి సంబంధించిన వాస్తు నియమాలు:
– తాబేలును ఇంట్లో సౌకర్యవంతమైన ప్రదేశంలో ఉంచాలి. కానీ పొరపాటున కూడా దక్షిణ దిశలో ఉంచకూడదు.లేకుంటే ఆర్థిక నష్టం పెరుగుతుంది.
– కొందరు ఇంటి ప్రధాన ద్వారం వద్ద తాబేలు ఉంచుతారు.వాస్తు ప్రకారం ఇలా చేయడం మంచిది. ఇంటి ముఖ ద్వారం ద్వారం వద్ద తాబేలు ఉంచడం వల్ల ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ రాదు. కానీ ఇంటి ప్రవేశద్వారం వద్ద తాబేలును నేలపై ఉంచకూడదని గుర్తుంచుకోండి. దీని కోసం మీరు స్టూల్ లేదా టేబుల్ ఉపయోగించడం మంచిది.
– బెడ్ రూమ్‌లో తాబేలు ఉంచుకోవడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా పిల్లల స్టడీ రూమ్‌లో తాబేలు ఉంచడం వల్ల చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే వ్యాపార స్థలం, షాపుల్లో తాబేలును ఉంచడం వల్ల డబ్బు ప్రవాహం పెరుగుతుంది.
– రాగి తప్ప ఏదైనా లోహంతో తయారు చేసిన తాబేలును ఇంట్లో ఉంచుకోవచ్చు. మీరు తాబేలు విగ్రహాన్ని ఉంచే పాత్రను ప్రతిరోజు శుభ్రమైన నీటితో నింపండి. అందులో కొన్ని నాణేలు కూడా వేయండి. తాబేలు తోక ‘ఉత్తర దిశ’లో ఉండాలని గుర్తుంచుకోండి.
Also Read: ఈ విషయాలు తెలిస్తే చాలు.. కుంభమేళాకు ఈజీగా వెళ్లి రావొచ్చు
తాబేలు విగ్రహాన్ని ఏ దిశలో ఉంచాలి ?
వాస్తు శాస్త్రం ప్రకారం, తాబేలు విగ్రహాన్ని ఎల్లప్పుడూ ఇంట్లో ఉత్తరం వైపు ఉంచాలి. ఉత్తర దిశలో సంపదకు దేవుడు అయిన కుబేరుడు, గణపతి , తల్లి లక్ష్మి ఉంటారని చెబుతారు. ఇలా చేయడం వల్ల చాలా సానుకూల శక్తి ఇంట్లోకి చేరుకుంటుంది. అంతే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమను కొనసాగిస్తుంది.