Unified Pension Scheme: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి యూపీఎస్ పథకం అమల్లోకి రానుంది. దీనికి సంబంధించి శనివారం రాత్రి ఆర్థికశాఖ గెజిట్‌ను విడుదల చేసింది. జాతీయ పెన్షన్ వ్యవస్థ (యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్-యూపీఎస్) పరిధిలోకి వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది వర్తించనుంది.
దీని ప్రకారం ఉద్యోగులు రిటైర్మెంట్‌కు ముందు 12 నెలల్లో పొందిన బేసిక్ పే సగటులో 50 శాతాన్ని పింఛనుగా పొందేందుకు వీలు కలుగుతుంది. కనీసం 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని యూపీఎస్‌ను ఎంచుకున్న వారిని మాత్రమే ఇది వర్తించనుంది. పాత పెన్షన్ పథకం-ఓపీఎస్-ఎన్‌పీఎస్ కలిపి గతేదాడి యూపీఎస్‌ను ప్రవేశపెట్టింది.
ఓపీఎస్ తరహాలో యూపీఎస్ కూడా పదవీ విరమణ అనంతరం గ్యారెంటీ పెన్షన్ ఆఫర్ చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ విధానంపై చాన్నాళ్లుగా సందిగ్ధత సాగుతూ వస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కొత్త పన్ను విధానం అమలు ఉంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతోపాటు కొన్నిచోట్ల పాత పన్ను విధానం సాగించాలని కొన్ని ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాయి. అనేక రకాలుగా ఆలోచించిన కేంద్రం, సరికొత్త ఆలోచనలో ముందుకొచ్చింది.
సర్వీస్ నుంచి తొలగించబడినవారు, రాజీనామా చేసిన ఉద్యోగులకు అందుబాటులో ఉండబోదని సమాచారం. కనీస నెలవారీ పెన్షన్ రూ.10,000 ఉంటుంది. ఒకవేళ 25 ఏళ్ల సర్వీస్ పదవీ విరమణను తీసుకుంటే పరిస్థితి ఏంటి? సర్వీస్ ప్రకారం ఎప్పుడు పదవీ విరమణ ఉంటుందో అప్పటి నుంచి పెన్షన్ చెల్లించబడుతుందన్న మాట.
ALSO READ: బడ్జెట్ 2025-26.. ప్రజల వినియోగశక్తి పెంచడమే కీలకం
పెన్షన్ పొందుతున్న వ్యక్తి అనుకోకుండా మరణిస్తే.. చనిపోవడానికి ముందు, చెల్లింపుదారునికి అనుమతించబడే చెల్లింపులో 60 శాతం కుటుంబం చెల్లింపుకు అర్హత పొందుతుంది. చట్టబద్ధంగా వివాహం చేసుకున్న జీవిత భాగస్వామికి మాత్రమే అందించబడుతుంది.