BigTV English

Chambal river : చంబల్ నది నీటిని తాగకూడదని శాపం పెట్టింది ఎవరు?

Chambal river : చంబల్ నది నీటిని తాగకూడదని శాపం పెట్టింది ఎవరు?


Chambal river : మన దేశాన్ని నదుల దేశమంటారు. నాగరికత అంతా నదుల వెంబడి సాగిన ఆనవాళ్లు ఉన్నాయి. నదులకి, పురాణాలకి మధ్య విడదీయలేని సంబంధం కూడా ఉంది. మిగతా నదులతో పోల్చితే గంగా నదికే ప్రధమ స్థానం దక్కుతుంది. సముద్రం చేరే నదులను పవిత్రమైనవిగా భావిస్తారు. సాగరానికి చేరని వాటిని అల్ప పుణ్యనదులుగా చెబుతారు. సముద్రంలో కలిసే నదుల్లో చర్మన్వతి నది ఒకటి. అదే నేటి చంబల్‌ నది . యుమునా నదికి ఉపనదికి అయిన చంబల్ రాజస్థా న్, మధ్యప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల గుండా ప్రవహిస్తూ సముద్రుడ్ని చేరుతుంది.


చంబల్ నది ప్రస్తావన మహాభారతంలో కూడా ఉంది. చర్మణ్యవతి ప్రాంతాన్ని పరిపాలించిన నాటి రాజు రంతిదేవుడు తాను చేసిన యాగాలకి జంతువులను బలి ఇవ్వడంతోనే వాటి రక్తమంతా ఈ నదిలోకి ప్రవహించేలా చేశాడు. రంతిదేవుని కీర్తికి ప్రతిరూపంగా ఈ నదిని చెప్పేవారు. మహాభారతంలో కుంతి తన నవజాత శిశువు కర్ణుడిని ఒక బుట్టలో వదిలి చర్మన్వతిలో విడిపెట్టింది. చివరకి అది కాస్తా అశ్వనదిలో తేలుతుంది. చంబల్‌ ప్రాంతం శకుని రాజ్యంలో భాగంగా ఉండేది. పాండవుల ఓటమికి కారణమైన పాచికల ఆట కూడా ఇక్కడే సాగిందని పురాణాలు చెబుతున్నాయి. ఆటలో ఓడిన పాండవులు ద్రౌపదిని పణంగా పెట్టి ఆడి ఓడతారు. ద్రౌపది వస్త్రాపహరణం తర్వాత ఈ నదిని తాగకూడదని ఆమె శపించిందట. ఆ శాపం వల్లే నది నీరు ఎరుపు రంగులో మారిపోయిందని పురాణ కథనం.. అందుకే అప్పట్లో ఈ నది నీటి ఎవరూ వాడే వారు కాదట.

నది నీళ్లు తాగిన వారు తిరుగుబాటు దారులవుతారని అంటారు. ఒకప్పుడు ఈ ప్రాంతం దొపీడీ దొంగల ముఠాలతో నిండిపోయింది. ఆ ప్రాంతానికి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఉండేది. ఇదంతా గతం. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. నది నీటి జనం చక్కగా వినియోగించకుంటున్నారు. జనం ప్రశాంతంగానే జీవనం సాగిస్తున్నారు.

Related News

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ ఉంచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Big Stories

×