BigTV English

Vastu Tips: సాయంత్రం వేళ గుమ్మం మీద కూర్చోవద్దని పెద్దలు ఎందుకు చెబుతారు? ఆ టైమ్‌లో ఏమవుతుంది?

Vastu Tips: సాయంత్రం వేళ గుమ్మం మీద కూర్చోవద్దని పెద్దలు ఎందుకు చెబుతారు? ఆ టైమ్‌లో ఏమవుతుంది?

ఇంట్లో పెద్ద వాళ్ళు ఉంటే చాలు… గుమ్మం మీద ఎవరినీ కూర్చునివ్వరు. గుమ్మాన్ని తొక్కనివ్వరు కూడా. సాయంత్రం అయ్యాక ఇంటి గుమ్మం దగ్గర కూర్చోకూడదని చెబుతూ ఉంటారు. ఇలా ఎందుకు చెబుతారో ఎప్పుడైనా ఆలోచించారా? పెద్ద వాళ్ళు చెప్పారంటే దానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. ఆ కారణం ఏంటో తెలుసుకుందాం.


హిందూ గ్రంధాలు చెబుతున్న ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం అంటే గుమ్మం లక్ష్మీదేవితో అనుబంధాన్ని కలిగి ఉంటుంది. సాయంత్రం వేళలో లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని ఎంతోమంది నమ్ముతారు. అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా గుమ్మం దగ్గర నిలబడడం, కూర్చోవడం వంటివి చేస్తే లక్ష్మీదేవికి అడ్డుగా అనిపిస్తుంది. అప్పుడు ఆమె వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. అందుకే సాయంత్రం పూట గుమ్మం మీద ఎవరిని కూర్చోవద్దని పెద్దవారు చెబుతూ ఉంటారు.

అంతేకాదు సాయంత్రం వేళలో గుమ్మానికి ఎదురుగా చెప్పులు పెట్టడం, చెత్త పోయడం, డస్ట్ బిన్ పెట్టడం వంటి పనులు కూడా చేయకూడదు. ఇవన్నీ కూడా ఇంటి శ్రేయస్సును, సంపదను అడ్డుకుంటాయని పెద్దలు నమ్ముతారు. అలాగే సాయంత్రం అయితే చాలు ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించాలని చెబుతారు. అలా వెలిగించడం వల్ల లక్ష్మీదేవి వస్తుందని అంటారు.


ఇప్పటికీ ఈ నియమాలను పాటిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ప్రధాన ద్వారానికి పసుపు రాసి, ముగ్గులు పెట్టి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు. అక్కడే దీపాన్ని వెలిగిస్తారు. ఇంటి ముందు ముగ్గులు పెడతారు. ఇవన్నీ కూడా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకనే చెబుతారు.

వాస్తు ప్రకారం కూడా ఇంట్లో నివసించే సభ్యులకు ఆనందం దక్కాలంటే ఇంటి ప్రధాన ద్వారం శుభ్రంగా కళకళలాడుతూ ఉండాలి. ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఎరుపు రంగు స్వస్తిక్ గుర్తులను వేస్తే ఆ ఇంటి వాస్తు దోషాలు తొలగిపోతాయని చెబుతారు. అలాగే ఇంటి ప్రధాన ద్వారానికి పూల దండలను కట్టడం వల్ల సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది.

పూలదండలలో అక్కడక్కడ ఆకులను కూడా కలిపి కడితే ఎంతో మంచిది. ఇది లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది. ఆ ఇంట్లో ఐశ్వర్యం వచ్చి పడుతుందని కుటుంబంలో సుఖసంతోషాలు ఉంటాయని ఎంతోమంది నమ్ముతారు. అయితే ఈ దండలను కట్టాక కొన్ని రోజులకు ఎండిపోతాయి. దాన్ని వెంటనే తొలగించాల్సిన అవసరం ఉంది. కానీ ఎంతోమంది అలానే వదిలేస్తారు. ఇలా ఎండిపోయిన పువ్వులు ప్రధాన ద్వారం దగ్గర ఉండడం మంచిది కాదు.

ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా తులసి మొక్కను ఉంచినా కూడా ఎంతో శుభప్రదమని అమ్మమ్మ కాలం నాటి నమ్మకం ఉంది. తులసి మొక్క ఉంటే ఆ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుందని చెబుతారు. ఎందుకంటే తులసి మొక్కను లక్ష్మీదేవితో సమానంగా పూజిస్తారు.

మీ ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా వినాయక విగ్రహాన్ని ఉంచండి. లేదా వినాయక చిత్రపటాన్ని ఉంచినా మంచిదే. ఇంట్లోకి అడుగుపెట్టగానే ఎదురుగా వినాయకుడు కనిపిస్తే ఆ ఇంట్లోని సకల విఘ్నాలు తొలగిపోతాయని చెప్పుకుంటారు. ఇంట్లో సంతోషం ఐశ్వర్యం తీసుకురావాలంటే ఇంటి ప్రధాన ద్వారానికి గణేశుడు ఉండాల్సిందే.

Also Read: పెళ్లి నిశ్చయం కావట్లేదా.. సంతాన భాగ్యంకు నోచుకోలేదా.. ఈనెల 6న ఇలా చేయండి

ఆధునిక యువత ఇలాంటి విషయాలను ఎప్పుడో నమ్మడం మానేసింది. కానీ ఇప్పటికీ పాటిస్తున్న వారి సంఖ్య మాత్రం ఎక్కువే ఉంది. ఇవన్నీ కూడా మన మానసిక ప్రశాంతతకు, ఇంట్లోనే సానుకూలతకు ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. పెద్దగా కష్టపడాల్సిన పనులు కూడా కాదు, చాలా సింపుల్ గానే చేయొచ్చు. కాబట్టి అమ్మమ్మలు చెప్పిన పద్ధతులను పాటించి ఇంట్లో సానుకూల వాతావరణం ఉండేలా చూసుకోండి.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×