Ponnam Prabhakar: మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ ఆ దిశగా తొలి ఏడాదిలోనే మార్పు చూపించింది. సంక్షేమంతో పాటే అభివృద్ధి పనులు చేపట్టింది. ఎన్నెన్నో రికార్డులు సృష్టించింది. హిస్టరీ క్రియేట్ చేసింది. ఫ్యూచర్ సిటీ అయినా, మూసీ పునరుజ్జీవమైనా, మెట్రో సెకెండ్ ఫేజ్ అయినా, రాష్ట్రవ్యాప్తంగా చిన్ననీటి పారుదల ప్రాజెక్టులైనా ఇలా అభివృద్ధి దిశలో తొలి ఏడాది కొత్త అడుగు పడింది. మొత్తం 24 కొత్త పాలసీలను సీఎం తొలి ఏడాదిలోనే టేకప్ చేశారంటే వచ్చే నాలుగేళ్లలో దశదిశ ఎలా మారుతుందో అర్థం చేసుకోవచ్చు.
చేసే పనిలో నిజాయితీ, నిబద్ధత, తీసుకునే నిర్ణయాల్లో జాగ్రత్త ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలి ఏడాది గడిచింది. సాహసోపేత నిర్ణయాలు, సంక్షోభాలను పటిష్ట వ్యూహాలతో పరిష్కరించుకోవడం, ఏదైనా నిర్ణయం తీసుకుంటే అందరి అభిప్రాయాలను తీసుకోవడం, అందరికీ నచ్చే.. అందరూ మెచ్చే నిర్ణయాలను అమలు చేయడం ఏడాది పాలనలో హైలెట్. ఎందుకంటే తెలంగాణ తొలి రెండు టర్మ్ లలో ఏదైతే మిస్ అయిందో.. వాటికి ప్రాధాన్యం ఇస్తూ పాలన సాగింది. ప్రజా సంక్షేమం, హామీల అమలు దిశగా అడుగులు పడ్డాయి.
Also Read: మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత.. కోటి మందిని కోటీశ్వరులను చేస్తా.. సీఎం రేవంత్ రెడ్డి
ఈ తరుణంలో రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు అంతా సిద్ధమైంది. ప్రజాపాలన విజయోత్సవ వేడుకల చివరి రోజైన డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకలకు మాజీ ముఖ్మమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లను ఆహానిస్తున్నామని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. 9న జరిగే తెలంగాణ విగ్రహావిష్కరణకు ఇన్వైట్ చేసేందుకు వారి సిబ్బంది ఇచ్చి సమయం ఇవ్వాల్సిందిగా అడుగుతున్నట్లు చెప్పారు. వాళ్లు ఇచ్చిన టైం ప్రకారం.. ప్రభుత్వం తరఫున ఆహ్వానిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.