BigTV English

Coconut: ఏదైనా వ్యాపారం లేదా పని ప్రారంభించే ముందు కొబ్బరికాయ ఎందుకు కొడతారు?

Coconut: ఏదైనా వ్యాపారం లేదా పని ప్రారంభించే ముందు కొబ్బరికాయ ఎందుకు కొడతారు?

భారతీయులకు ఎన్నో సంప్రదాయాలు, ఆచారాలు ఉన్నాయి. ఏదైనా కొత్త ఆరంభానికి సూచికగా కొబ్బరికాయను కొడతారు. కొత్త వ్యాపారమైన, కొత్త ఇంటి ప్రవేశమైనా కూడా అక్కడ కొబ్బరికాయ పగిలిన తర్వాతే పనులు ప్రారంభమవుతాయి. ఏదైనా కొత్త పని ప్రారంభించే ముందు ఇలా కొబ్బరికాయ కొట్టడం అనేది ఆచారంగా ఎందుకు మొదలైంది?


కొత్త కారు కొన్నా, కొత్త దుకాణం తెరిచినా, కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తున్నా ఇలాంటి శుభసందర్బాల్లో కొబ్బరికాయ కొట్టే హిందూ సాంప్రదాయం భారతదేశం అంతటా ఉంది. ఇది కేవలం ఒక ఆచారమే కాదు.. భావోద్వేగాలతో ముడిపడిన నమ్మకం ఇలా కొబ్బరికాయని కొట్టి పనులు ప్రారంభిస్తే అంత మంచే జరుగుతుందని ప్రజల నమ్మకం.

కొబ్బరి ప్రత్యేకత
కొబ్బరికాయ ఇసుక నేలలో పెరిగే చెట్టుకు కాస్తుంది. ఇది పెరగడానికి చాలా తక్కువ నీరు అవసరం. దీన్ని దేవుని ఫలం అని పిలుస్తారు. సంస్కృతంలో దీన్ని సిర్ఫాల్ అంటారు. శుభ సందర్భం ఏదైనా అక్కడ కొబ్బరికాయ కచ్చితంగా కొడతారు. ఇలా చేయడం వల్ల అడ్డంకులన్నీ తొలగిపోతాయని, చేపట్టే పనుల్లో విజయ విజయం అందుతుందని చెబుతారు.


అహంకారాన్ని విడిచి
కొబ్బరికాయ అనేది పూజా కార్యక్రమం సమయంలో దేవతలకు సమర్పించే ఒక నైవేద్యం. దీన్ని రెండు భాగాలుగా చేసి దేవునికి సమర్పిస్తారు. ఇలా కొబ్బరికాయను రెండు భాగాలుగా చేయడం అనేది మనిషిలోని అహంకారాన్ని విచ్ఛిన్నం చేసి.. దేవుడిని శరణాగతి కోరడమేనని చెబుతారు. కొబ్బరికాయను పగలగొట్టడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుందని కూడా ఎంతోమంది నమ్ముతారు. కొబ్బరికాయ లోపల ఉండే నీరు ఎంతో పవిత్రమైన జలమని, అది ఇంట్లోని చెడు శకునాలను బయటికి పారదోలుతుందని నమ్ముతారు. అలాగే దేవుని అభిషేకానికి ఆ కొబ్బరి నీటినే వినియోగిస్తారు. ఎలాంటి కలుషితం తాకని పవిత్రమైన జలంగా కొబ్బరి నీటిని చెబుతారు.

కొబ్బరికాయ కు మూడు రంధ్రాలు లాంటివి ఉంటాయి. వాటిని కళ్ళు అని అంటారు. కొబ్బరికాయకుండే కళ్ళు బ్రహ్మ, శివ, విష్ణువులను సూచిస్తుందని చెబుతారు. పురాణాలలో కొబ్బరికాయను శివుడికి పెట్టే పవిత్రమైన నైవేద్యంగా కూడా చెబుతారు. ఇది స్వచ్ఛతను, సంతానోత్పత్తిని, జీవనోపాధిని సూచిస్తుందని నమ్ముతారు. అందుకే ఏ మంచి పని చేసిన అక్కడ కొబ్బరికాయ కొట్టడం ద్వారానే పనులు ప్రారంభమవుతాయి.

కొబ్బరితో ఆరోగ్యం
ఆరోగ్యపరంగా చూసినా కూడా కొబ్బరిలో మన శరీరానికి అత్యవసరమైన పోషకాలు ఉన్నాయి. ఫైబర్స్, మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు ఇందులో అధికంగా ఉంటాయి. ఇది శక్తి స్థాయిలను పెంచుతుంది. శరీరంలోని ఇన్ఫ్లమేషన్ తో పోరాడుతుంది. మనకి ప్రతిరోజు కావాల్సిన మాంగనీస్ ను ఇవ్వడంలో ఇది ముందు ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో బరువు పెరగకుండా అడ్డుకోవడంలో కూడా సహాయపడుతుంది. ఈ కొబ్బరికాయలోని నీరు మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా అడ్డుకుంటుంది. కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×