BigTV English

Liver Virus: మన కాలేయాన్ని కుళ్లిపోయేలా చేసే ప్రాణాంతక వైరస్ 30 సెకన్లకు ఒకరిని చంపేస్తోంది

Liver Virus: మన కాలేయాన్ని కుళ్లిపోయేలా చేసే ప్రాణాంతక వైరస్ 30 సెకన్లకు ఒకరిని చంపేస్తోంది

కాలేయ ఆరోగ్యం మందగిస్తే శరీరం మొత్తం ఏ పని చేయలేక ఇబ్బంది పడుతుంది. అందుకే కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కాలేయానికి వచ్చే ఒక ప్రాణాంతక సమస్యల్లో హెపటైటిస్ వ్యాధి కూడా ఒకటి. 2022లో ప్రపంచవ్యాప్తంగా 1.3 మిలియన్ల మరణాలకు ఈ హెపటైటిస్ కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. హెపటైటిస్ బారిన పడుతున్న రోగులు భారతదేశం, చైనాలోనే అధికంగా ఉన్నట్టు ఆరోగ్య సంస్థ వివరిస్తుంది. హెపటైటిస్ కారణంగా ప్రతి 30 సెకన్లకు ఒకరు ప్రాణాన్ని కోల్పోతున్నారు. కాబట్టి దీన్ని తక్కువ అంచనా వేయకూడదు.


హెపటైటిస్ అంటే ఏమిటి?
హెపటైటిస్ అనేది నిశ్శబ్ద వైరస్ సంక్రమణ అని చెప్పుకోవాలి. ఇది కాలేయంలో విపరీతమైన వాపుకు కారణం అవుతుంది. చికిత్స చేయకుండా వదిలేస్తే సిర్రోసిస్, కాలేయ క్యాన్సర్ కు దారితీస్తుంది. హెప్టైటిస్లో ఐదు రకాల వైరస్ లు ఉంటాయి, హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెపటైటిస్ డి, హెపటైటిస్ ఈ. వీటిలో హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ వైరస్ లు మురికి నీరు, చెడిపోయిన ఆహారం ద్వారా వ్యాపిస్తాయి.

ఇక హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెపటైటిస్ డి వంటి వైరస్ లు… రక్తం, ఇతరులకు వాడిన సూదులు, అసురక్షిత లైంగిక కార్యకలాపాలు వంటి వాటి వల్ల వ్యాపిస్తాయి. ఈ వైరస్ తల్లికి ఉంటే పుట్టబోయే బిడ్డకు కూడా వచ్చే అవకాశం ఎక్కువ. అయితే వీటిలో హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అత్యంత ప్రమాదకరమైనవిగా చెబుతారు. ఎందుకంటే ఇవి ఎటువంటి లక్షణాలు లేకుండా సంవత్సరాల తరబడి కాలేయంలోనే దాగి ఉంటాయి. అవి వాటిని గుర్తించే సమయానికి కాలేయం తీవ్రంగా కుళ్ళిపోతుంది.


మన భారతదేశంలో రెండున్నర కోట్ల మంది హెపటైటిస్ బి బారిన పడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం ప్రపంచంలోని హెపటైటిస్ కేసుల్లో 11.6 శాతం మంది భారతదేశంలోనే ఉన్నారు. కనీసం వీరిలో 90 శాతం మందికి తాము ఈ వ్యాధి బారిన పడ్డామని కూడా తెలియదు. ఇక హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఇ.. వంటి కేసులు మురికివాడలు, గ్రామాలు, పట్టణాలలోనే అధికంగా వస్తున్నాయి. ముఖ్యంగా అపరిశుభ్రంగా ఉన్న వాతావరణం లో జీవించే వారికే ఈ వ్యాధులు అధికంగా వస్తున్నట్టు గుర్తించారు.

లక్షణాలు ఇలా ఉంటాయి
హెపటైటిస్ వైరస్ శరీరంలో చేరితే అది కొన్ని లక్షణాలను చూపిస్తుంది. తీవ్రంగా అలసటగా అనిపిస్తుంది. అలాగే జ్వరం కూడా వస్తుంది. ఆకలి వేయదు. ఆహారం తింటే వికారం, వాంతులు వచ్చినట్టు అనిపిస్తుంది. తరచూ కడుపునొప్పి వస్తుంది. మూత్రం ముదురు రంగులో వస్తుంది. కీళ్ళు తీవ్రంగా నొప్పి పెడతాయి. కళ్ళు, చర్మం వంటివి పసుపు రంగులోకి మారుతాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ఇక తల్లులకు ప్రసవం అయ్యాక నవజాత శిశువుకు హెపటైటిస్ బి వ్యాక్సిన్ కచ్చితంగా ఇవ్వాలి. హెపటైటిస్ వంటి ప్రాణాంతక వైరస్లు రాకుండా ముందుగానే జాగ్రత్తపడాలి. పరిశుభ్రమైన వాతావరణంలో తాజాగా ఉండిన ఆహారాన్ని తినాలి.

Related News

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

White Foods: ఆరోగ్యాన్ని దెబ్బతీసే.. 3 తెల్లటి ఆహార పదార్థాలు, వీటితో.. ఇంత డేంజరా ?

Dengue Fever: వర్షాకాలంలో జ్వరమా ? డెంగ్యూ కావొచ్చు !

Big Stories

×