Anirudh Ravichander : టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కింగ్ డమ్’.. ఈనెల 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా సోమవారం రాత్రి గ్రాండ్ గా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో పాటు చిత్ర బృందమంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా కింగ్ డమ్ కు సంగీతం అందించిన అనిరుధ్ రవిచందర్ తెలుగులో మాట్లాడి అందరిని ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
నేను ఎప్పటికీ మీ బక్కోడినే..
కింగ్ డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనిరుధ్ మాట్లాడుతూ.. తెలుగువారు తనపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు తెలిపాడు. అది కూడా తెలుగు నేర్చుకొని మరీ అనిరుధ్.. వారి ప్రేమకు థాంక్స్ చెప్పుకొచ్చాడు. కింగ్ డమ్ సినిమా కోసం అందరూ చాలా కష్టపడ్డాం. ముఖ్యంగా నాగవంశీ.. నా నుంచి వచ్చే ప్రతి సాంగ్ కోసం నాగవంశీ ఎదురుచూస్తూ ఉంటాడు. ఈ సినిమాలో నటించిన భాగ్యశ్రీ, సత్యదేవ్, వెంకటేష్ అందరూ చాలా బాగా చేశారు. విజయ్ దేవరకొండ నాకు చాలా సపోర్ట్ గా ఉన్నారు. ఎవరైన సినిమాను పూర్తి చెయ్యమని అంటారు. ఈయన హెల్త్ కూడా ఇంపార్టెంట్ అని పెద్ద మెసేజ్ ను పెట్టారు. ఇదంతా నాకు బాగా అనిపించింది. ఇది నాకే కాదు అందరికి ఇంపార్టెంట్ అని అనిరుధ్ అన్నారు.
గత పదమూడేళ్ల క్రితం నా మొదటి సినిమా తెలుగులో రిలీజ్ అయ్యింది. 3 సినిమాతో నన్ను ఆదరించారు..అప్పటినుంచి వారు నాపై ప్రేమను చూపిస్తూనే ఉన్నారు. నా తెలుగు ఫ్యామిలీ నన్ను మీ అబ్బాయిగా దత్తత తీసేసుకున్నారు. నన్ను మీ వాడిని చేసుకున్నారు. మీరు నా వాళ్లు అయ్యిపోయారు. ఎప్పటికీ నేను మీ అనిరుధ్ నే.. బక్కోడినే.. అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అనిరుధ్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి…
Also Read : పవన్ కళ్యాణ్ ‘ ఉస్తాద్ భగత్ సింగ్ ‘ అయిపోయిందా..? ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..
కింగ్ డమ్ మూవీ..
శ్రీలంక నేపథ్యంలో భారీ అంచనాల మధ్య జూలై 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యదేవ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే మలయాళ నటుడు వీపీ వెంకటేష్ ఈ సినిమా ద్వారా విలన్ గా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా సినిమా నుంచి “రగిలే రగిలే” అంటూ సాగే ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.. ప్రస్తుతం ఆ సాంగ్ బాగా వైరల్ అవుతుంది. రిలీజ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ట్రెండ్ అవుతుంది. ఇక హై వోల్టేజ్ యాక్షన్ పర్ఫామెన్స్ తో విజయ్ దేవరకొండ ఈసారి అదరగొట్టడానికి సిద్ధమవుతున్నారు. మరి ఎలాంటి సక్సెస్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..
?igsh=aHl6MmdtdnphM2N3