Navaratri 2024: నవరాత్రులు అక్టోబర్ 3 గురువారం నుండి ప్రారంభమవుతాయి. నవమి రోజున అక్టోబర్ 11వ తేదీ శుక్రవారంతో ముగుస్తాయి. సనాతన ధర్మంలో నవరాత్రులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ రోజుల్లో, దుర్గా దేవి యొక్క తొమ్మిది వేర్వేరు రూపాలను పూజిస్తారు. ఆశ్విన్ మాసం శుక్ల పక్షం నుండి ప్రారంభమయ్యే నవరాత్రి శరదృతువులో వస్తుంది. కాబట్టి శారదియ నవరాత్రి అని పిలుస్తారు. నవరాత్రులు జరుపుకోవడం వెనుక అనేక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి.
నవరాత్రులు జరుపుకోవడానికి శాస్త్రీయ కారణం:
వాస్తవానికి, రుతువుల మార్పు కారణంగా ఒక వ్యక్తి యొక్క రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అందుచేత ఈ 9 రోజులు ఎవరైతే ఉపవాసం ఉంటూ, సాత్విక ఆహారం తీసుకుంటారో వారి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
నవరాత్రులలో సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థకు ఉపశమనం లభిస్తుంది. వాస్తవానికి, సాత్విక ఆహారం తేలికగా ఉంటుంది. ఉపవాసం శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది. అంతే కాకుండా ప్రేగులను శుభ్రపరుస్తుంది. ఇది పేగు పొరలను బలపరుస్తుంది.
నవరాత్రుల సమయంలో మనం మన ఇళ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మతపరమైన కారణాల వల్ల కూడా పరిశుభ్రత చాలా ముఖ్యమైనది. నవరాత్రుల రోజుల్లో హవనాన్ని నిర్వహిస్తారు. ఇది పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది. అనేక వ్యాధులను కూడా నివారిస్తుంది. అంతే కాకుండా శరీరాన్ని, మనస్సును కూడా శుద్ధి చేస్తుంది.
పూజా సమయంలో కలశ స్థాపనకు ఎంతో ప్రాధాన్యత:
మత విశ్వాసాల ప్రకారం, కలశ స్థాపన అంటే ఘట్ స్థాపన నవరాత్రి మొదటి రోజున జరుగుతుంది. దీంతో పాటు, దుర్గా దేవి యొక్క తొమ్మిది రూపాలను నవరాత్రుల్లో పూజిస్తారు. నవరాత్రుల తొమ్మిది రోజులు కూడా ఉపవాసం పాటిస్తారు. నవరాత్రులలో 9 రోజులు ఉపవాసం ఉన్నవారు దుర్గామాత అనుగ్రహాన్ని పొందుతారని నమ్ముతారు.
నవరాత్రుల మొదటి రోజున కలశాన్ని ఏర్పాటు చేస్తారు. కలశాన్ని ఏర్పాటు చేసే సమయంలో పూజ సామాగ్రి, ఇతర విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. నవరాత్రికి ముందు ఘటస్థాపన చేయడానికి శుభ సమయం ఏమిటి, ఏ పూజా సామగ్రిని వాడాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కలశ స్థాపనకు అనుకూలమైన సమయం:
వేద క్యాలెండర్ ప్రకారం, నవరాత్రులు అక్టోబర్ 3వ తేదీ గురువారం నుండి ప్రారంభమవుతాయి. ఈ రోజున ఉదయం 6.19 నుండి 7.23 వరకు కలశ స్థాపనకు అనుకూల సమయం. మీరు ఈ శుభ సమయంలో కలశ స్థాపన చేయవచ్చు.