BigTV English

Nivin Pauly : లైంగిక వేధింపుల కేసులో సిట్ విచారణ… నివిన్ ఏం చెప్పాడంటే?

Nivin Pauly : లైంగిక వేధింపుల కేసులో సిట్ విచారణ… నివిన్ ఏం చెప్పాడంటే?

Nivin Pauly : మలయాళ ఇండస్ట్రీని గత కొన్ని రోజుల నుంచి హేమ కమిటీ ఇరుకున పడేసిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రముఖ నటులపై లైంగిక ఆరోపణలు రావడం ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇప్పటికే కొంతమంది అరెస్ట్ కాగా, దొరికిపోయిన మరికొందరు తప్పించుకునే ప్రయత్నాలలు మొదలు పెట్టారు. పలు ఆసక్తికర పరిణామాల మధ్య ‘ప్రేమమ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన హీరో నివిన్ పౌలిపై కూడా ఓ నటి లైంగిక ఆరోపణలు చేస్తూ కేసు పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసును సిట్ విచారించడం మొదలు పెట్టింది. మరి విచారణలో నివిన్ పౌలి ఏం చెప్పాడో చూద్దాం పదండి.


ఆరోపణలన్నీ కల్పితమేనా?

నివిల్ పౌలి తన సహచరులతో కలిసి లైంగిక దాడికి పాల్పడ్డాడు అంటూ ఎదుర్కొంటున్న ఆరోపణలపై ప్రత్యేక విచారణ బృందం సిట్ విచారించింది. నివిన్ పౌలి విచారణలో భాగంగా అధికారులు అడిగిన ప్రశ్నలకు స్పందించగా, అతని స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. అందులో నివిన్ పౌలి తనపై వచ్చిన ఆరోపణలన్నీ కల్పితం అని పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. దుబాయ్ లో తనపై దాడి జరిగిందని బాధితురాలు పేర్కొన్న రోజుల్లో తాను అసలు అక్కడ లేనని, కేరళలో తన సినిమాకు సంబంధించిన షూటింగ్లో బిజీగా ఉన్నానని నివిన్ సిట్ కి తెలిపినట్టు సమాచారం. అంతేకాకుండా ఆయన నిజంగానే ఆరోజు సినిమా సెట్స్ లో ఉన్నారని అతనితో పాటు అక్కడ షూటింగ్లో పాల్గొన్న మరికొందరు కూడా చెప్పారని తెలుస్తోంది. ఇక తనపై ఆరోపణలు వచ్చిన వెంటనే నివిన్ మీడియాతో మాట్లాడుతూ తనపై వచ్చిన వార్తలు కుట్రలో భాగమని ఆరోపించారు. ‘కొంతమంది వ్యక్తులు కావాలని పన్నిన కుట్ర కావచ్చు ఇది. దాని గురించి నాకు కచ్చితంగా తెలియదు. కానీ పోలీసులు నా దగ్గరకు వచ్చి నాపై కంప్లైంట్ వచ్చిందని చెప్పినప్పుడు నేను ఏం జరిగిందో నా వైపు నుంచి వివరించాను. ఇలాంటి ఆరోపణలు నేను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి. మీడియా నా పేరును ప్రస్తావించడం అనేది నాతో పాటు నా కుటుంబ సభ్యులను కూడా ప్రభావితం చేసింది’ అంటూ చెప్పుకొచ్చాడు.


వివాదం ఏంటంటే?

మలయాళ ఇండస్ట్రీని లైంగిక వేధింపుల కేసులు ఊపేస్తున్న నేపథ్యంలోనే నివిన్ పౌలిపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఒక నటి సినిమాలో తనకు అవకాశం ఇప్పిస్తానని చెప్పి, నవంబర్లో తనను దుబాయ్ కి తీసుకెళ్లారని, అక్కడే లైంగికంగా వేధించారని ‘ప్రేమమ్’ హీరో పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ప్రాథమిక విచారణ జరిపిన అనంతరం పోలీసులు నివిన్ పౌలితో సహా మరో ఆరుగురి పై నాన్ బెయిలబుల్ కేసును నమోదు చేశారు. నిందితుల్లో ఒకరు నిర్మాత కూడా ఉండడం గమనార్హం. ఇక ఈ విషయంపై వెంటనే సోషల్ మీడియా వేదికగా స్పందించిన నివిన్ అవన్నీ నిరాధారణమైన ఆరోపణలు అని కొట్టి పారేశారు. తాజాగా ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ విచారణకు హాజరయ్యారు నివిన్. మరి విచారణ తర్వాత సిట్ నెక్స్ట్ స్టెప్ ఏంటో చూడాలి.

 

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×