Big Stories

Happiness: వస్తువులు తెచ్చే ఆనందం శాశ్వతంగా ఎందుకు ఉండదు.

Happiness: మనిషి ఆనందాన్నే కోరుకోవడం సహజ స్వభావం. అందుకే సుఖ సంతోషాల కోసం అనుక్షణం పరతపిస్తుంటాడు ఆరెండూశాశ్వతం కావని తెలియక. నిజానికి మాన వుడి సుఖ, సంతోష, ఆనందాలు వ్యక్తిగతం మాత్రమే కావు. వ్యక్తి నుండి సమాజానికి; సమాజం నుం డీ సర్వప్రపంచానికి సంబంధించిన విషయాలివి. ఒక వ్యక్తి సమాజం కాలేడు. ఒక యిల్లు గ్రా మం కాలేదు. ఒక వృక్షం వనం కాదు. ఒకడి ఆనందం అందరి ఆనందం కాదు. అందరి ఆనందం ఒకరి ఆనందమై నిలుస్తుంది.

- Advertisement -

మనిషి తన కోసమే జీవిస్తాడు. ఇదే వాస్తవం. అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు ఇది ఆదర్శం. ఆచరణలో మనిషి వెనుకబడిపోతూనే ఉండటానికి కారణం స్వార్ధం, సంకుచి తత్వం. మనిషి కోరుకునే సుఖానికి చాలా అర్ధాలు ఉన్నాయి. ఏదైనా ఒక వస్తువో ,వాహనమో ఇంకోటే, ఒక అనుకూలాన్ని కలిగిస్తే అది సుఖం. అటువంటి సుఖం, వస్తువుతో ముడి పడి ఉంది. వస్తువు తన నుండీ దూరమైనా, తాను వస్తువు నుండి దూరమైనా సుఖమూ దూరమవుతుంది. అంటే దుఃఖం కలుగుతుంది. పోతున్న సుఖానికి, వస్తున్న దుఃఖానికి కారణం వస్తువే . సుఖదుఃఖాలు రెండూ స్థితులే. మారుతూ ఉంటయ్ కనుక అవి అశాశ్వతాలు. .

- Advertisement -

పొందాలనుకున్న దానిని పొందినపుడు పొందే భావోద్వేగమే సంతోషం. ఇదీ వస్తు మూలకమే. ఒక వస్తువు నాకే చెందాలన్న అహంకారం, నాదే కావాలన్న మమకారం, ఆ వస్తువును పొందటంతో అహం శాంతించి, మమకారం పెరిగినపుడు ఇంద్రియ పరమైన తృప్తే సంతోషం. ఇది కూడా శాశ్వతంగా ఉండదు. సంతోషంలో ఎన్నో స్థాయిలు, పరిమితులు ఉంటాయి. వస్తువుతో ముడిపడి ఉండటం వల్ల వస్తువు పోతుందేమోనన్న భయం, అభద్రత, పోతే మనుగడేమై పోతుందోనన్న బాధ, అశాంతిని కలిగిస్తాయి. కనుక సంతోషం మనోమూలకమై, క్షణికంగానే ఉంటుంది.

సుఖమనేది దేహపరం. సంతోషం మనోపరం! ఈ రెండింటినీ ఒకటే అనుకుని, అవే శాశ్వతమని భావించి మనిషి ఎన్నో సార్లు మోసపోతుంటాడు. ఓడిపోతుంటాడు. శరీరం – మనసుల మధ్య, నిత్య సంఘర్షణ ప్రారంభమై, భరింపరాని దుఃఖంగా మారుతుంది. నిజానికి, కష్టమే కర్మనిష్ట. . కర్మానుష్ఠానం వలన జీవితం స్పష్టంగా అర్థమై, మనసు నెమ్మదిం చి, ఆనందం వైపు మరలుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News