E-Paper
Advertisement

Chaitra Month : చైత్ర మాసం అందుకే అంత ప్రత్యేకమా…

Chaitra Month : చైత్ర మాసం అందుకే అంత ప్రత్యేకమా…
Chaitra Month

Chaitra Month : తెలుగు మాసాలలో చైత్రమాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రకృతి కొత్త దనాన్ని సంతరించుకుని, ఆ సంతోషాన్ని మానవాళితో పంచుకునే రోజు చైత్రంతోనే మొదలవుతుంది. ఈ నెలతో చెట్లు చిగురించడం మొదలై పూత , పిందెలు , పండ్లు – ఇలా అంతా లబ్దికరంగా సాగుతుంది. శరీరంలో పైకి కనిపించే మార్పులే కాదు.. మానసికంగా కూడా చైత్రమాసం నుండి ఉల్లాసంగా , ఉత్సాహంగా ఉంటుంది. చలికాలంలో , వర్షాకాలంలో ఉండే మందగోడితనం వసంతఋతువు నుండి ఉండదు. ఒకవిధమైన చురుకుదనం ప్రవేశిస్తుంది. ఈ కారణంగానే చైత్రమాసంలో ఉగాదిని జరుపుకుంటాం.

చైత్రమాసపు తొలిరోజునే ఉగాది పండుగగా జరుపుకోవడం తరతరాల నుంచి వస్తోంది . శాస్త్రం ప్రకారం చూస్తే చైత్ర మాసంలో భూమి సూర్యునికి సమీపంగా ఉంటుంది. అందుకే గ్రీష్మ తాపం ఎక్కువగా ఉంటుంది. ఈ వేడివల్ల కొన్ని రకాల వ్యాధులు రావడానికి , ప్రబలడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ఉపద్రవాన్ని నివారించడానికి వేపపూత , బెల్లం తోడ్పడతాయి. చాంద్రమానం ప్రకారం నూతన సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి, చంద్రుడిపట్ల కృతజ్ఞతా పూర్వకంగా చైత్ర శుద్ధ విదియ రోజున బాలచంద్రుడిని పూజిస్తుంటారు. దీనినే బాలేందు వ్రతం అని పిలుస్తుంటారు.

బ్రహ్మదేవుడు సృష్టి రచనను ఈ రోజునే ప్రారంభించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున ప్రతిఒక్కరూ బ్రహ్మదేవుడిని అంకితభావంతో ఆరాధించి కృతజ్ఞతలు చెప్పుకోవాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.శ్రీవిష్ణువు ధరించిన దశావతారాలలో ‘మత్స్యావతారం’ మొదటిది. చైత్ర శుద్ధ తదియ రోజున ఆయన ఈ అవతారాన్ని ధరించి లోకాలకు వెలుగును చూపే వేదాలను రక్షించాడు. అందువలన ఈ రోజున ‘మత్స్య జయంతి’ ని జరుపుకుంటూ ఉంటారు

చైత్ర శుద్ధ చవితి రోజున వినాయకుడినీ … పంచమి రోజున లక్ష్మీదేవిని … అష్టమి రోజున శివుడిని ఆరాధించడం వలన సకల శుభాలు చేకూరతాయని శాస్త్రం చెబుతోంది. శ్రీరామచంద్రుడి జీవితంలో ‘నవమి రోజు’ ప్రత్యేక పాత్రను పోషిస్తూ వచ్చింది. శ్రీరాముడు జన్మించినదీ … వివాహం చేసుకున్నదీ … వనవాసం నుంచి తిరిగి వచ్చినది నవమి రోజునే. చైత్రశుద్ధ నవమి రోజున వైష్ణవ క్షేత్రాల్లో సీతారాములకు అంగరంగవైభవంగా కళ్యాణోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఇలా సృష్టి రచన మొదలు అనేక పురాణపరమైన ఘట్టాలకు … త్రిమూర్తుల – త్రిశక్తి మాతల ఆరాధనకు చైత్రమాసం వేదికగా నిలుస్తోంది.

Tags

Related News

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

అక్కడ పై కుండలోని అన్నం ముందెందుకు ఉడుకుతుంది? పూరీ జగన్నాథుడి వంటగది మిస్టరీ!

గురువారం ఈ చిన్న వస్తువులను దానం చేస్తే.. మీ ఇంట్లో డబ్బుకు కొరతే ఉండదు!

ప్రపంచ ప్రసిద్ధ.. పూరీ జగన్నాథ రథయాత్ర ప్రాముఖ్యత

సోమవారం శివలింగానికి ఇవి సమర్పిస్తే చాలు.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి!

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

×