BigTV English

Meditate:- భగవంతుడి కోసం ధ్యానం ఎందుకు చేయాలి?

Meditate:- భగవంతుడి కోసం ధ్యానం ఎందుకు చేయాలి?

Meditate:- ఒకే రోగం వచ్చినా అందరికీ డాక్టర్ ఒకే మందు ఇవ్వకుండా వారి యొక్క శరీర ధర్మాన్ని అనుసరించి ఇస్తాడు. అలాగే ఆహారం తినేటపుడు కూడా శరీరానికి పుష్టి, తృప్తి, ఆకలి తీరడం అనే మూడు ప్రయోజనాలు ఉంటాయి. కానీ దానికోసం అందరికీ ఒకే ఆహారం తృప్తిని, ఆరోగ్యాన్ని ఇవ్వదు. కానీ భగవత్ ప్రాప్తికి మాత్రం శాస్త్రం సర్వమానవాళిని ఉద్దేశించి ఇచ్చిన మహా ఔషధం.


భగవన్నామ కీర్తన, నామకీర్తనకు ఏ విశేష ప్రక్రియ కూడా అవసరం లేదు. ఏ దశలో ఉన్నా ఎక్కడ ఉన్నా, ఏ సమయంలోనైనా భగవన్నామాన్ని కీర్తించుకోవచ్చు. మనకు అత్యంత ఇష్టం కలిగిన భగవానుని ఏ మూర్తినైనా ధ్యానం చేస్తూ, నామాన్ని కీర్తిస్తూ, భగవానుని గుణాలను గానం చేస్తూ భగవంతుని లీలలు వింటూ…ఏ విధంగానైనా సరే శరీరం, ప్రాణం ఇంద్రియాలు, మనస్సు అన్నీ భగవంతుని పారాయణం కావాలి.

ఎప్పుడైనా భగవంతుని విస్మరించినట్లు అనిపిస్తే వెంటనే ఒకసారి ఊర్వదృష్టితో భగవానుని తలచుకుని, అతని మన్మోహన మూర్తిని ధ్యానం చేసుకుని మరల అతనితో అనుబంధం కొనసాగించే ప్రయత్నం చెయ్యాలి. అలా మాటిమాటికీ చేస్తే అది అభ్యాసంగా మారి యోగమవుతుంది. ఎవరికైనా ఒకరియందు అత్యంత ప్రేమ కలిగితే ఆ నాటి నుండి ఆ వ్యక్తేప్రాణంగా అంతవరకు ఉన్న చాలావాటిని మర్చిపోయి జీవిస్తాడు. అది ఎలాగంటే ఈ జన్మలోకి వచ్చాక గతజన్మలోవి మర్చిపోయి కొత్త జీవితం ఎలా ప్రారంభం అవుతుందో అలా ఉంటుంది. అదే విధంగా భగవంతునిపై భక్తి కలిగితే అలాగే ఉండాలి. నిరంతరం భగవత్‌ ధ్యానంలో ఉంటూ బాహ్య విషయాలను మరచిపోవడం అభ్యాసం చేయడం మంచిది.


భద్రాద్రికి ఏపీ తలంబ్రాలు

for more updates follow this link:-Bigtv

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×