E-Paper
Advertisement

Tulsi Plant: తులసి మొక్క ముందు రోజూ దీపం ఎందుకు పెట్టాలి?

Tulsi Plant: తులసి మొక్క ముందు రోజూ దీపం ఎందుకు పెట్టాలి?
Advertisement

మన ఇళ్లలో తులసి మొక్కకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రతి ఇంట్లో దాదాపు తులసి మొక్కను పెంచడం ఒక సంప్రదాయంగా మారిపోయింది. ముఖ్యంగా సాయంత్రం సమయంలో తులసి ముందు దీపం పెట్టడం ఆచారంగా పెద్దవాళ్లు చెబుతుంటారు. ఇలా దీపం పెట్టడం వల్ల ఎలాంటి శుభాలు కలుగుతాయి? హిందూ ధర్మంలో తులసిని దేవతగా భావిస్తారు. తులసి మొక్క ఇంట్లో ఉంటే శుభం కలుగుతుందనే నమ్మకం ఉంది. అలాగే తులసి ఇంటి వాతావరణాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుందని పెద్దవాళ్లు చెబుతారు. అందుకే ఈ మొక్క ముందు దీపం వెలిగిస్తే ఆ పవిత్రత ఇంకా పెరుగుతుందని నమ్మకం.

వాస్తు శాస్త్రం ఏమంటుంది?
వాస్తు ప్రకారం సాయంత్రం సమయాల్లో నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందని అంటారు. ఆ సమయంలో తులసి మొక్క దగ్గర దీపం పెడితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. చెడు శక్తి తొలగిపోతుంది. ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారుతుంది. ఇంట్లోని కుటుంబసభ్యుల మనసుకు శాంతిగా ఉంటుంది. రోజంతా పని, ఒత్తిడితో మనసు అలసిపోతుంది. సాయంత్రం తులసి ముందు దీపం పెట్టి కొన్ని నిమిషాలు కూర్చుంటే మనసు ప్రశాంతంగా మారుతుంది.మానసిక ఆందోళన తగ్గుతుంది.

Advertisement

పురాణాల ప్రకారం తులసి దేవి లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనది. అందుకే తులసి ముందు దీపం వెలిగిస్తే ఇంట్లో సంపద పెరుగుతుందని, కుటుంబానికి శుభం కలుగుతుందని, అనారోగ్యాలు దూరమవుతాయనే నమ్మకం ఉంది. అందుకే ఈ ఆచారం చాలా ఇళ్లలో ఇప్పటికీ కొనసాగుతోంది. నూనె లేదా నెయ్యితో దీపం వెలిగిస్తే కొంచెం వేడి, చిన్న సువాసన వస్తుంది. ఇది తులసి మొక్కతో కలసి ఇంట్లో శుభ్రమైన వాతావరణాన్న, ప్రశాంతతను అందిస్తుందని పెద్దవాళ్లు చెబుతారు.

ప్రతిరోజూ తులసి మొక్క ముందు దీపం వెలిగించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇంట్లో గొడవలు తగ్గుతాయి. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యత పెరుగుతుంది. ఇల్లు ఆనందంగా ఉంటుంది. అందుకే తులసి ముందు దీపం పెట్టే అలవాటు ఉన్న ఇళ్లలో వాతావరణం ఆనందంగా ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. దీపం పెట్టేటప్పుడు తులసి ఆకులకు ఆ వేడి తగలకుండా జాగ్రత్త పడండి.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×