E-Paper
Advertisement

Crispy Bread Pakoda: కరకరలాడే బ్రెడ్ పకోడీ.. 10 నిమిషాల్లోనే రెడీ చేయండిలా !

Crispy Bread Pakoda: కరకరలాడే బ్రెడ్ పకోడీ.. 10 నిమిషాల్లోనే రెడీ చేయండిలా !
Advertisement

Crispy Bread Pakoda: బ్రెడ్ పకోడీ అంటే ఇష్టపడని వారుడరు. చాలా మంది సాయంత్రం పూట స్నాక్‌గా వీటిని తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు. వీటిని తక్కువ టైంలోనే సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. బయట క్రిస్పీగా, లోపల మెత్తటి మసాలా స్టఫ్ఫింగ్‌తో ఉండే ఈ స్నాక్ టీ టైంలో తినడానికి బెస్ట్. ఇంతకీ ఈ క్రిస్పీ బ్రెడ్ పకోడీని సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా.

Advertisement

కావాల్సిన పదార్థాలు:

ఉడికించిన బంగాళదుంపలు – 3 (పెద్దవి)

Advertisement

శనగ పిండి – 1 కప్పు

బ్రెడ్ స్లైసెస్ – 8-10

ఉల్లిపాయ- 1

బియ్యం పిండి- 2 టేబుల్ స్పూన్స్

నూనె- వేయించడానికి సరిపడా

పచ్చిమిర్చి- 2 (తరిగినవి)

కారం- 1/2

టీస్పూన్ఉప్పు- రుచికి సరిపడా

అల్లం వెల్లుల్లి పేస్ట్- 1 టీస్పూన్

పసుపు- 1/4 టీస్పూన్

కొత్తిమీర- కొద్దిగా (తరిగినది)

వాము- 1/2 టీస్పూన్

జీలకర్ర పొడి – 1/2 టీస్పూన్

ఇంగువ- చిటికెడు

ధనియాల పొడి- 1 టీస్పూన్

నీరు- సరిపడా

ఆమ్చూర్ పౌడర్- 1/2 టీస్పూన్

ఉప్పు- రుచికి సరిపడా

తయారీ విధానం:

ముందుగా ఉడికించిన బంగాళదుంపలను పొట్టు తీసి, మెత్తగా చిదమండి. తర్వాత ఒక చిన్న పాన్‌లో 2 టీస్పూన్ల నూనె వేసి వేడి చేయండి. అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించండి. అనంతరం స్టవ్ ఆఫ్ చేసి, చిదిమిన బంగాళదుంపల మిశ్రమంలో ఈ తాలింపు వేయండి. వెంటనే జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఆమ్చూర్ పౌడర్, ఉప్పు, తరిగిన కొత్తిమీర వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టండి.

ఒక పెద్ద గిన్నెలో శనగ పిండి, బియ్యం పిండి, కారం, పసుపు, వాము, ఇంగువ, ఉప్పు వేయండి. ఈ పకోడీలు క్రిస్పీగా రావడానికి బియ్యం పిండిని తప్పనిసరిగా చేర్చాలి. కొద్ది కొద్దిగా నీరు పోస్తూ.. ఉండలు లేకుండా చిక్కటి, మెత్తటి బేటర్‌ను కలపండి. ఇది పల్చగా ఉండకూడదు, బ్రెడ్‌ను పూర్తిగా కవర్ చేసేంత చిక్కగా ఉండాలి. బ్రెడ్ స్లైస్‌లను తీసుకుని. ఒక స్లైస్‌పై సిద్ధం చేసుకున్న బంగాళదుంపల మిశ్రమాన్ని సమానంగా పరచండి. దానిపై మరొక బ్రెడ్ స్లైస్‌ను పెట్టి, శాండ్‌విచ్‌లా తయారు చేయండి. ఈ శాండ్‌విచ్‌లను త్రికోణాకారంలో లేదా మీకు నచ్చిన ఆకారంలో కట్ చేయండి.

Also Read: రైస్ వాటర్ వాడితే నిజంగానే జుట్టు పెరుగుతుందా ? నిపుణులు చెప్పేది వెంటే నోరెళ్లబెడతారు !

అనంతరం.. ఒక కడాయిలో వేయించడానికి సరిపడా నూనె పోసి.. బాగా వేడి చేయండి. కత్తిరించిన బ్రెడ్ ముక్కను తీసుకుని, దానిని సిద్ధం చేసిన బేటర్‌లో అన్ని వైపులా సమానంగా ముంచండి. బ్రెడ్‌ను జాగ్రత్తగా వేడి నూనెలో వేయండి. ఒకేసారి ఎక్కువగా వేయకుండా, 3-4 ముక్కలు మాత్రమే వేయండి. కాస్త ఎక్కువ మంటపై , పకోడీలు బంగారు రంగులోకి మారి, క్రిస్పీగా అయ్యే వరకు తిప్పుతూ వేయించండి. వేయించిన పకోడీలను టిష్యూ పేపర్‌పైకి తీసుకోండి. వేడి వేడి క్రిస్పీ బ్రెడ్ పకోడీలను టమాటో కెచప్ లేదా పుదీనా చట్నీతో వడ్డించండి.

Related News

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

Big Stories

Advertisement
×