E-Paper
Advertisement

Bhadra Raja Yoga: భద్ర రాజయోగం.. వీరి వ్యాపారంలో పురోగతి

Bhadra Raja Yoga: భద్ర రాజయోగం.. వీరి వ్యాపారంలో పురోగతి
Advertisement

Bhadra Raja Yoga: గ్రహాల రాకుమారుడు బుధుడు సింహ రాశిలో ప్రస్తుతం తిరోగమన దిశలో కదులుతున్నాడు. ఆగస్ట్ 29 వరకు బుధుడు తిరోగమనం స్థితిలోనే సంచరిస్తాడు. దృక్ పంచాంగం ప్రకారం సెప్టెంబర్ నెలలో తెలివితేటలు, వివేకాన్నిచ్చే బుధుడు సొంత రాశి అయిన కన్య రాశిలో ప్రవేశించనున్నాడు. దీని వల్ల భద్ర మహా పురుష రాజ యోగం ఏర్పడనుంది.

ఏడాది తర్వాత కన్య రాశిలో బుధుడి వల్ల ఈ రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగాన్ని జ్యోతిష్య శాస్త్ర పరంగా చాలా పవిత్రమైన యోగంగా చెబుతారు. బుధుడు భద్ర రాజ యోగాన్ని సృష్టించడం ద్వారా కొన్ని రాశుల వారు ప్రతి పనిలో విజయం సాధిస్తారని చెబుతారు. అంతే కాకుండా ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా పురోగతి అందుకుంటారని అంటారు. భద్ర రాజ యోగంతో తెలివి తేటలు, చాతుర్యం, ధనవంతుడు కూడా అవుతారు. బుధుడి సంచారం వల్ల ఈ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

సింహ రాశి:

భద్ర రాజయోగం వల్ల సింహ రాశి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పిల్లల వైపు నుంచి మీరు శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి కూడా బలంగా ఉంటుంది. వ్యాపారంలో లాభం కూడా పెరుగుతుంది. కొత్త ఆదాయ వనరు ఏర్పడతాయి. భౌతిక సుఖాలతో జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది. ప్రతి రంగంలో విజయాల మెట్లెక్కుతారు. తెలివి తేటలు, వివేకం పెంపొందుతాయి. సమాజంలో మీ కీర్తి, ప్రతిష్టలు కూడా పెరిగుతాయి.

Advertisement

కన్య రాశి:
భద్ర రాజ యోగం వల్ల ఈ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. శుభ యోగం కూడా ఏర్పడుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది. సామాజిక హోదా, ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. గొప్ప విజయావకాశాలు పొందుతారు. మీ జీవితం ఆనందంగా ఉంటుంది. వైవాహిక జీవితం మెరుగుపడుతుంది. భూమి, వాహన ఆనందాన్ని కూడా పొందుతారు.

ధనస్సు రాశి:
సొంత రాశిలో బుధుడు ప్రవేశించడం వల్ల జీవితంలో అనేక అద్భుత మార్పులు కలుగుతాయి. చాలా కాలంగా పెండింగులో ఉన్న పనులు కూడా విజయవంతమవుతాయి . కెరీర్లో అడ్డంకులు తొలగిపోతాయి. ఉద్యోగ, వ్యాపారులకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. బాకీ ఉన్న డబ్బు కూడా తిరిగి వస్తుంది. గతంలో కంటే ఆనందం పెరుగుతుంది.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×