BigTV English

Anchor Soumya Rao: వాళ్లు దరిద్రంగా మాట్లాడేవారు, సాయి ధరమ్ తేజ్ ఎవరో తెలీదు.. అందుకే ‘జబర్దస్త్’ను వదిలేశా: సౌమ్య రావు

Anchor Soumya Rao: వాళ్లు దరిద్రంగా మాట్లాడేవారు, సాయి ధరమ్ తేజ్ ఎవరో తెలీదు.. అందుకే ‘జబర్దస్త్’ను వదిలేశా: సౌమ్య రావు

Anchor Soumya Rao: జబర్దస్త్ కామెడీ షో అంటే తెలియనివారుండరు. కడుపుబ్బా నవ్వించే ఆర్టిస్టులంతా ఇందులోనే ఉంటారు. ఈ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చిందనడంలో ఎలాంటి అతిసయోక్తి లేదు. అంతేకాకుండా ఈ షో ద్వారా వెండితెరపై సత్తా చాటుతున్న సెలబ్రిటీలెందరో ఉన్నారు. సుధీర్, అనసూయ, రష్మి, గెటప్ శ్రీను, వేణు, చమ్మక్ చంద్రతో సహా ఇంకెందరో కమెడియన్స్ తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. అయితే ఈ జబర్దస్త్ షో ద్వారా ఫుల్ పాపులర్ అయిన అనసూయ.. పలు సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది.


దీంతో ఆమె ప్లేస్‌లోకి కన్నడ సీరియల్ నటి, బుల్లితెర యాక్టర్ సౌమ్యరావు వచ్చింది. ఆమె వచ్చి రానీ తెలుగుతో పంచులు వేస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఆమె ఈ షో నుంచి వైదొలగింది. దీంతో ఆమె ప్లేస్‌లోకి బిగ్‌బాస్ బ్యూటీ సిరి హనువంతు వచ్చింది. ఇక ఈ షో నుంచి వైదొలగడానికి గల కారణాలను తాజాగా సౌమ్యరావు ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చింది. ఇందులో భాగంగానే ఆమె మాట్లాడుతూ..

తెలుగు భాషలో మాట్లాడటం పై స్పందన


తెలుగు పదాలు మర్చిపోతాను అందువల్లనే తెలుగు మంచిగా మాట్లాడటం కోసం ఇంట్లో పని మనిషి, వంట మనిషిలను కూడా తెలుగు వారినే పెట్టుకున్నా. వారిని అన్నీ అడిగి తెలుసుకుంటా అని తెలిపింది. వారితో కమ్యూనికేషన్‌ కోసమే తెలుగు వారిని ఏరికోరి పెట్టుకున్నా అని చెప్పుకొచ్చింది.

డబుల్ మీనింగ్ డైలగ్స్‌పై స్పందన

డబుల్ మీనింగ్ డైలాగ్స్ వేరే వాళ్లు వేసేటప్పుడు కొన్ని కొన్ని అర్థం అవుతాయి. కానీ ఓల్డ్ డైలాగ్స్, స్లోగాన్స్ లాంటివి అర్థం కావు. గతంలో కంటే ఇప్పుడు తెలుగు బాగానే అర్థం అవుతుంది. కానీ ఫాస్ట్‌గా మాట్లాడితే అర్థం కాదు. మొత్తంగా ఇక్కడికి వచ్చినంకనే తెలుగు నేర్చుకున్నాను అని తెలిపింది.

ఈ ఫీల్డ్‌కి ఎలా వచ్చారు

Also Read: ఒక్క రాత్రికి రూ.4 కోట్లు, విటులంతా వాళ్లే.. ‘బాహుబలి’ నటిపై దారుణమైన ప్రచారం..!

మొదటిగా నేను న్యూస్ రీడర్‌గా చేశాను. కాలేజీలో చదువుతున్నప్పుడే పార్ట్ టైంగా న్యూస్ రీడింగ్ జాబ్ చేశాను. అలా జాబ్ చేస్తున్న క్రమంలో సీరియల్స్‌లో నటించే అవకాశాలు వచ్చాయి. కన్నడలో కొన్ని సీరియల్స్ చేశాను. తర్వాత తమిళ్‌లో కూడా కొన్ని సీరియల్స్ చేశాను. దాని తర్వాత తెలుగులో జర్నీ స్టార్ట్ అయింది.

జబర్దస్త్ షోలో ఛాన్స్

జబర్దస్త్ షోలో ఛాన్స్ ఎలా వచ్చింది అనే దానిపై మాట్లాడుతూ.. తెలుగులో ఒక షోకి వెళ్లాను. అక్కడ చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు. అలాంటి సమయంలో అక్కడున్న వారు ఎవేవో జోక్స్ వేస్తే.. నేను దానికి కౌంటర్ ఇవ్వడం వల్ల నాకు జబర్దస్త్‌లో ఛాన్స్ వచ్చింది.

సడన్‌గా వెళ్లిపోవడానికి కారణం

అగ్రిమెంట్ ప్రకారమే బయటకొచ్చేశాను. ముందుగా 1 సంవత్సరానికి అగ్రిమెంట్ జరిగింది. నెక్ట్స్ ఇయర్ కొత్త వాళ్లని తీసుకుంటామని చెప్పారు. దానికి నేను కూడా ఓకే చెప్పాను. అంతకు మించి ఇంకేమి లేదు. అక్కడ నేను ఉన్నంత వరకు బాగానే చూసుకున్నారు.

పాన్ ఇండియా మూవీలో రోల్, గ్లామర్ పాత్రలు

పాన్ ఇండియా మూవీలో రోల్, గ్లామర్ పాత్రలు వచ్చాయని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. టాలీవుడ్‌లోనే ఎలాంటి ఆఫర్లు రాలేదు. అలాంటి పాన్‌ఇండియా మూవీస్ అంటే. కానీ అందరూ హాట్ హాట్ రోల్‌కే అడుగుతున్నారు. అయితే అలాంటి పాత్రలంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అని తెలిపింది.

సాయి ధరమ్ తేజ్ నిజంగానే తెలీదు. వాడు కూడా తెలీదంటూ కామెంట్

సాయి ధరమ్ తేజ్ కూడా నాకు తెలీదు. వాడు కూడా పెద్ద యాక్టర్ అని కొద్ది రోజుల తర్వాత తెలుసుకున్నాను. ఆయనకి యాక్సిడెంట్ అయినప్పుడు తెలుసుకున్నాను. ఆయన పేరు చెప్పడానికి కూడా నాకు రావట్లేదు అని చెప్పుకొచ్చింది.

Also Read: మరోసారి జంటగా సందడి చేయనున్న లయ శివాజీ, వైరల్ ఫొటోస్‌

మదర్ గురించి

మా మదర్ చాలా కష్టపడి మమ్మల్ని పెంచింది. తినడానికి కూడా కష్టంగా ఉండేది. వేసుకోవడానికి నాలుగు జతల బట్టలు మాత్రమే ఉండేవి. ఒక పెన్ను, ఒక బుక్కు, జత చెప్పులు అన్నింటికి స్ట్రగుల్ అయ్యాం. ఫుడ్ కోసం చాలా ఎదురుచూసే వాళ్ళం. ఎవరైనా మిగిలింది ఇస్తారా అని నేను మా మదర్ వెయిట్ చేసేవాళ్లం. ఆ తర్వాత అమ్మకు బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది.

కన్నడ ఇండస్ట్రీ గురించి

కన్నడలో ఫేమ్ ఉంది కానీ అక్కడ అక్కడ అవకాశాలు ఇవ్వరు. అక్కడ కొంతమంది ఉన్నారు. వాళ్లే ఉంటారు. ఎవరికీ రానివ్వరు. అయితే తెలుగులో మంచిగా చూసుకున్నారు. తెలుగులో గివ్ అంటే టేక్ పాలసీగాళ్లు ఎవరూ కనిపించలేదు.

కన్నడ ప్రొడ్యూసర్ తిట్టేవారు, అగౌరవంగా మాట్లాడేవారు

అయితే ఒక రోజు కన్నడ ప్రొడ్యూసర్ తిట్టేవారు అగౌరవంగా మాట్లాడేవారు. సెట్స్ దగ్గరికి నటీమణుల కోసం తెచ్చిన ఫుడ్ తింటే ఓ రోజు తిట్టారు. ఏ దరిద్ర వాళ్లరా అంటూ అగౌరంగా మాట్లాడారు. అది హీరోయిన్స్ తినేది నువ్వు ఎందుకు తీసుకున్నావ్ అని తిట్టారు.

 

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×