BigTV English
Advertisement

Nagarjuna Meets Specially-Abled Fan: ‘సారీ ఎందుకు.. అందులో నీ తప్పేమీ లేదు’: అక్కినేని నాగార్జున

Nagarjuna Meets Specially-Abled Fan: ‘సారీ ఎందుకు.. అందులో నీ తప్పేమీ లేదు’: అక్కినేని నాగార్జున

Nagarjuna meets Specially-abled Fan who was Pushed away: టాలీవుడ్ హీరో కింగ్ నాగార్జున ఇటీవలే ఓ అభిమానికి క్షణాపణ చెప్పిన విషయం తెలిసిందే. ముంబై ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తున్న సమయంలో నాగార్జునను చూసిన ఓ అభిమాని.. ఆయనను కలిసేందుకు ముందుకు దూసుకువచ్చాడు. దీంతో సెక్యూరిటీ సిబ్బందిలో ఒకతను అతడిని పక్కకు లాగేశాడు.


ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తి సోషల్ మీడియా(X)లో పోస్ట్ చేశాడు. ఆ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. పలువురు నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్ట్ లు కూడా పెట్టారు. చివరకు ఆ వీడియో నాగార్జున వరకు చేరింది. ఆ వీడియో చూసిన నాగార్జున తన X వేదికగా స్పందించారు. ఆ అభిమానికి క్షమాపణలు చెప్పారు. ఇక తాజాగా నాగార్జున ఆ అభిమానిని గుర్తుపట్టి మరీ అదే ఎయిర్ పోర్ట్ లో అతడిని కలిసి ఫొటో దిగారు.

ప్రస్తుతం ‘కుబేర’ సినిమా షూటింగ్ తో నాగార్జున బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. ఈ క్రమంలోనే ముంబై ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ కు వస్తుండగా ఆ అభిమానిని కలుసుకున్నారు. దీంతో ఆ అభిమాని హ్యాపీగా ఫీలయ్యాడు.


Also Read: రేపే ‘కల్కి’ మూవీ విడుదల.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మ్యూజిక్ డైరెక్టర్

నాగార్జునను కలిసిన ఆనందంలో ఆ అభిమాని బొకే గిఫ్ట్ గా ఇచ్చాడు. బొకే ఇస్తూ సారీ చెప్పబోయాడు ఆ అభిమాని.. దీనికి వెంటనే రియాక్ట్ అయిన నాగార్జున ‘సారీ ఎందుకు.. అందులో నీ తప్పేమీ లేదు’ అంటూ అతడిని దగ్గరకు తీసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్స్ నాగార్జున మరో మెట్టు ఎక్కేశారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ‘కుబేర’ మూవీలో ధనుష్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. సున్నితమైన అంశాలతోపాటు మనుసుల్ని హత్తుకునేలా కథలు చెప్పడం డైరెక్టర్ శేఖర్ కమ్ముల శైలి. ఈ సినిమాతో తనదైన శైలిలో ఓ ఫిలాసఫీని చెప్పబోతున్నారు. వాణిజ్య హంగుల్ని మేళవించి ఆయన తన మార్క్ కథ, కథనాల్ని తెరపై ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో పాత్రలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. కొత్త కాన్సెప్ట్ తో రానున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా కనిపించనుంది.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×