BigTV English

Jagannath Rath Yatra 2024: మీకు తెలుసా..? జగన్నాథుడి రథయాత్ర కోసం చెక్కలను బంగారు గొడ్డలితో కోస్తారట..!

Jagannath Rath Yatra 2024: మీకు తెలుసా..? జగన్నాథుడి రథయాత్ర కోసం చెక్కలను బంగారు గొడ్డలితో కోస్తారట..!

Interesting Facts about Jagannath Rath Yatra: భారతదేశంలో హిందూ దేవాలయాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా దేవాలయాలు కనిపిస్తాయి. ప్రతీ తెగలు, కులాలు, మతాలకు చెందిన వారు వారి ఆరాధ్యదైవాన్ని పూజించడం తరతరాలుగా దేశంలో వస్తున్న ఆనవాయితీ, ఆచారం. అయితే దేశంలో కొన్ని కేవలం ఆ ప్రాంతానికి మాత్రమే చెందినవి ఉంటాయి. కానీ కొన్ని యాత్రలు, పండుగలు మాత్రం దేశంలోని ప్రతీ ఒక్కరు జరుపుకునేలా ఉంటాయి. అందులో ముఖ్యంగా జగన్నాథుడి రథయాత్ర చాలా ప్రసిద్ధి చెందింది.


ఒడిశాలోని పూరిలో జగన్నాథుని ఆలయం ఉంది. ఇది దేశంలోనే పురాతనమైన దేవాలయంగా చెబుతారు. ఇది హిందువుల చార్ ధమ్ లలో ఒకటి. జగన్నాథుడు అంటే శ్రీ కృష్ణుడు. తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి ఉన్న ఏకైక ఆలయం ఇది. పూరీ జగన్నాథ్జీ అత్త ఇల్లు, ముగ్గురు సోదరులు, సోదరీమణులు తమ అత్తను కలవడానికి ఇక్కడకు వచ్చారు. ఈ సమయంలో, ముగ్గురి ఆరోగ్యం క్షీణిస్తుంది. రాజవైద్యుడు వారికి మందులతో నయం చేస్తాడని పురాణాలు చెబుతాయి. అయితే కోలుకున్న తర్వాత, ముగ్గురూ మళ్లీ నగర పర్యటనకు బయలుదేరారు. జగన్నాథుడు అనారోగ్యం పాలయ్యే ఈ సంప్రదాయాన్ని నేటికీ అదే పద్ధతిలో అనుసరిస్తారు. భగవంతుడు 15 రోజుల పాటు ఏకాంతంలోకి వెళ్తాడు. అంతే కాకుండా జగన్నాథ రథయాత్రకు ఉపయోగించే చెక్కను బంగారు గొడ్డలితో కోసే సంప్రదాయం కూడా ఉందని కూడా పురాణాలు చెబుతున్నాయి.

జగన్నాథ రథయాత్ర


ప్రతి సంవత్సరం జగన్నాథ రథయాత్ర ఆషాఢ మాసం శుక్ల పక్షం రెండవ రోజున ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం జూలై 7న ఉదయం 4:24 గంటలకు ప్రారంభమై జూలై 8న తెల్లవారుజామున 4:59కి ముగుస్తుంది. జగన్నాథ యాత్ర ఆదివారం, జూలై 7 నాడు మొదలుపెడతారు. ఈ సమయంలో, శ్రీ కృష్ణుడు తన సోదరుడు బలభద్ర, సోదరి సుభద్రతో కలిసి నగర పర్యటనకు వెళ్తాడు.

Also Read: Careful Zodiac from Saturday: 12 గంటల్లో గ్రహాల్లో పెను మార్పు.. శని నుంచి ఈ 4 రాశుల వారు జాగ్రత్త

బంగారు గొడ్డలితో రథానికి చెక్కలు

జగన్నాథ రథయాత్ర కోసం సిద్ధం చేసిన రథం చెక్కను సాధారణ గొడ్డలితో కాదు, బంగారు గొడ్డలితో కోస్తారు. ఈ రథాన్ని తయారు చేయడానికి దాదాపు రెండు నెలల సమయం పడుతుంది. ఇది అక్షయ తృతీయ రోజు నుండి ప్రారంభమవుతుంది. ముందుగా రథం తయారీకి కలపను ఎంపిక చేసి రథానికి కలపను కోయాల్సి ఉంటుంది. దీని తరువాత, ఆలయ పూజారి అడవికి వెళ్లి రథానికి ఉపయోగించే కలపను పూజిస్తారు. అప్పుడు మహారాణా ప్రజలు అంటే వడ్రంగి సంఘం వారు బంగారు గొడ్డలితో చెట్లను నరికివేసి.. కోత కోసే ముందు బంగారు గొడ్డలిని జగన్నాథుని విగ్రహానికి తాకి ఆయన ఆశీస్సులు తీసుకుంటారని ప్రతీతీ.

Tags

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×