E-Paper
Advertisement

Lord Vishnu Pooja: మీ ఇంట్లో సిరి, సంపదలు పెరగడం కోసం విష్ణువును ఇలా పూజించండి

Lord Vishnu Pooja: మీ ఇంట్లో సిరి, సంపదలు పెరగడం కోసం విష్ణువును ఇలా పూజించండి
Advertisement

Lord Vishnu Pooja: విష్ణువును విశ్వానికి సంరక్షకుడిగా చెబుతారు. ఆయనే మొత్తం విశ్వంలోని ప్రజలను ఆదుకుంటాడని నమ్ముతారు. మత విశ్వాసాల ప్రకారం, విష్ణువును శ్రీ హరి, నారాయణుడు మొదలైన పేర్లతో పిలుస్తారు. ఆచారాల ప్రకారం విష్ణువును పూజించడం ద్వారా లక్ష్మీ దేవి ప్రసన్నం అవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదని చెబుతారు. అలాగే ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.

మత విశ్వాసాల ప్రకారం, మీరు ప్రతిరోజు శ్రీమహావిష్ణువును పూజిస్తే, ఎల్లప్పుడూ విష్ణువు అనుగ్రహం మీపై ఉంటుంది. కానీ, విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి 5 నియమాలు చెప్పబడ్డాయి.ఈ నియమాలను మీరు పాటిస్తే మీ ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి. అంతే కాకుండా సంపద పెరుగుతుంది. విష్ణువును ప్రసన్నం చేసుకునేందుకు 5 అద్భుత నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ప్రతిరోజు విష్ణువును ఆరాధించండి:
మత విశ్వాసాల ప్రకారం, ప్రతిరోజు ఉదయం నిద్రలేచి, స్నానం చేసి విష్ణువును పూజించండి. విష్ణు పారాయణం చేసే ముందు, విష్ణువు విగ్రహం లేదా ప్రతిమ ముందు నెయ్యి దీపం వెలిగించి, ఆవాహన చేయండి. సహృదయంతో అన్ని ఆచారాలతో పూజ చేయండి. విష్ణువును పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు.

పసుపు బట్టలు ధరించండి:
విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి పూజ చేసే సమయంలో పసుపు బట్టలు, ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. పసుపు ఎరుపు బట్టలు ధరించి పూజించే వ్యక్తి విష్ణువును ప్రసన్నం చేసుకుంటాడని నమ్ముతారు. ఎందుకంటే ఎరుపు, పసుపు రంగులు విష్ణువుకు ఇష్టమైన రంగులు. మత గ్రంధాల ప్రకారం, ఎరుపు, పసుపు బట్టలు ధరించి, నుదుటిపై పసుపు తిలకం పెట్టుకుని విష్ణువును పూజించడం ద్వారా విష్ణువు అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది.

Advertisement

అరటి చెట్టును పూజించండి:
విష్ణువు అనుగ్రహం పొందడానికి, అరటి చెట్టు ముందు నెయ్యి దీపం వెలిగించి.. విష్ణువును స్తుతించండి. ఇలా చేయడం వల్ల భగవంతుడి అనుగ్రహం మీపై ఉంటుంది. అంతే కాకుండా ఇంట్లో ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. విష్ణువు అనుగ్రహం కోసం అరటి చెట్టును పూజించడం శుభ ప్రదంగా చెబుతారు. విష్ణువును పూజిస్తే లక్ష్మీ దేవి కృపకు పాత్రులు అవుతారని హిందుూ పురాణాల్లో చెప్పబడింది.

Also Read:  2 గ్రహాల ప్రభావం.. వీరికి ధనలాభం

పసుపు వస్తువులను దానం చేయండి:
విష్ణువు పూజ తర్వాత పసుపు రంగు వస్తువులను దానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. పసుపు రంగులో ఉన్న వస్తువులను దానం చేసిన వ్యక్తిపై స్వామి అనుగ్రహం ఉంటుందని చెబుతారు. అంతేకాకుండా, విష్ణువు ఆశీర్వాదం కూడా లభిస్తుందని అంటారు.

జంతువులకు ఆహారం పెట్టండి:
విష్ణువుకు జంతువులంటే చాలా ఇష్టం. విష్ణువును పూజించిన తర్వాత, ఏదైనా జంతువు, పక్షికి ఆహారం అందించడం చాలా శుభప్రదం అని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుంది. అలాగే, ఇంట్లో ఎల్లప్పుడూ ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×