BigTV English

Bharateeyudu 3 : శంకర్ తో గొడవపడ్డ కమల్ హాసన్.. భారతీయుడు 3 క్యాన్సిల్?

Bharateeyudu 3 : శంకర్ తో గొడవపడ్డ కమల్ హాసన్.. భారతీయుడు 3 క్యాన్సిల్?

Bharateeyudu 3 : తెలుగు చిత్రపరిశ్రమలో విలక్షణ నటుడుగా ఎన్నో వందల సినిమాలను చేసి అభిమానుల మనసు దోచుకున్న నటుడు ఎవరంటే టక్కున కమల్ హాసన్ పేరు గుర్తుకు వస్తుంది. ఈయన సినిమాలు ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తాయా అని ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు.. కమల్ హాసన్ రీసెంట్ గా భారతీయుడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా అనుకున్న టాక్ ను అందుకోలేదు. బాక్సాఫీస్ వద్ద ఢీలా పడింది. ఇప్పుడు భారతీయుడు 3 రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా మొదలు పెట్టేశారనే వార్తలు ఇటీవల వినిపించాయి. ఇక తాజాగా శంకర్, కమల్ హాసన్ మధ్య గొడవలు జరిగాయని ఓ వార్త ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. అసలు విషయం ఏంటో ఒకసారి తెలుసుకుందాం..


గతంలో వచ్చిన భారతీయుడు సీక్వెల్ గా భారతీయుడు 2 సినిమాను శంకర్ తెరకెక్కించారు. ఆ సినిమా అనుకున్న ఫలితాన్ని అందుకోలేక పోయింది. యావరేజ్ టాక్ ను అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా భారతీయిదు 3 సినిమాను తెరకేక్కించే పనిలో ఉన్నాడు శంకర్.. అయితే ప్రస్తుతం శంకర్ రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అటు కమల్ కూడా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో విక్రమ్ 2 చేస్తున్నాడు.. ఈ సినిమాలు అవ్వడానికి కాస్త టైం పడుతుంది.. అయితే ఈ సినిమా వచ్చే సంవత్సరం సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే ‘భారతీయుడు 3’ సినిమా ఉంటుందా? లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అందుకు కారణం కూడా లేకపోలేదు.. భారతీయుడు 2 సినిమా రిజల్ట్..

Kamal Haasan who had a fight with Shankar.. Bharatiyadu 3 cancelled?
Kamal Haasan who had a fight with Shankar.. Bharatiyadu 3 cancelled?

శంకర్, కమల్ హాసన్ మధ్య గొడవలు..


కమల్, డైరెక్టర్ శంకర్ మధ్య మొన్నటివరకు గొడవలు ఉన్నాయి. అందుకే భారతీయుడు 2 సినిమా ఆలస్యంగా వచ్చింది. ఇక ఇప్పుడు మరోసారి గొడవలు జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కమల్ హాసన్ శంకర్ మీద కొంచెం కోపంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. కమల్ హాసన్ చెప్పిన కొన్ని చేంజెస్ ని భారతీయుడు 2 సినిమాలో శంకర్ పాటించలేదట. అవి కనక పాటించి ఉంటే సినిమా సక్సెస్ అయ్యేదని దానివల్లే సినిమా డిజాస్టర్ అయిందని కమల్ హాసన్ తన దగ్గర చెబుతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. సస్పెన్స్ లతో భారతీయుడు త్రీ ని తెరకెక్కించాలని ఆలోచించాలని చూస్తున్నట్లు ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. మొన్న వచ్చిన సినిమా దెబ్బేయ్యడంతో మరో సినిమా అంటే జనాలు చూస్తారా అని ఆలోచనలో ఉన్నారట మేకర్స్.. మరి ప్రొడ్యూసర్ ‘భారతీయుడు 2’ సినిమా ద్వారా భారీగా నష్టపోయాడు. కాబట్టి భారతీయుడు 3 సినిమా చేసి అతని నష్టాలను తీర్చాలని శంకర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి శంకర్ తో కమల్ సినిమాలు చేస్తాడా? లేదా? అన్నది తెలియాలంటీ కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×