Yatipata Yoga: రేపటి నుంచి యతిపాత యోగం ప్రారంభం కానుంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల జాతకులకు అష్టకష్టాలు రానున్నాయి. ఒక రకంగా చెప్పాలంటో కష్టాల సుడిగుండంలో చుట్టుకుంటారు. సూర్య, చంద్రుల కలయిక కారణంగా ఈ యతిపాత యోగం ఏర్పడనుంది. ఈ యోగం ఏర్పడటంలో కొన్ని రాశుల వారికి గడ్డుకాలం వస్తుంది.
గ్రహాల సంచారం కారణంగా కొన్నిసార్లు కొన్ని యోగాలు ఏర్పడుతుంటాయి. ఇలా ఏర్పడ్డ యోగాలు కొన్ని సందర్భాలలో ఆయా రాశుల జాతకులకు శుభ ఫలితాలు ఇస్తే.. మరికొన్ని సందర్భాలలో కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు ఇస్తుంటాయి. అయితే తాగాజా సూర్య, చంద్రుల కలయిక వల్ల ఏర్పడబోయే యతిపాత యోగం కొన్ని రాశుల వారికి అష్టకష్టాలు తీసుకురానుంది. ఆ రాశుల ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి: ఈ రాశి జాతకులకు యతిపాత యోగం కారణంగా వివిధ సమస్యలు చుట్టుముట్టనున్నాయి. ముఖ్యంగా మానసిక ఒత్తిడి విపరీతంగా ఉండనుంది. ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది. చేస్తున్న వృత్తులలో వివిధ సమస్యలు ఏర్పడతాయి. ఉద్యోగులకు పై అధికారులతో సమన్వయం లోపిస్తుంది. దీంతో వారి అగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. చేయాల్సిన పనులు ఆగిపోతాయి. పాత వ్యాపారాలలో నష్టాలు వస్తాయి. కొత్తగా పెట్టుబడి పెట్టిన వ్యాపారాలలో ఆశించిన లాభాలు రావు. దీంత ఈ రాశి వ్యక్తుల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది.
కర్కాటక రాశి: కర్కాటక రాశి జాతకులను కూడా యతిపాత యోగం ముప్పతిప్పలు పెట్టనుంది. ఈ రాశి వారికి కుటుంబ సమస్యలు తీవ్రంగా బాధిస్తాయి. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది. పెద్ద ప్రాజెక్టులలో పెట్టుబడులు పెడితే తీవ్ర నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగులకు ఆఫీసులో సమస్యలు ఏర్పడతాయి. దీంతో ఉద్యోగులు నిరాశ నిస్పృహలకు లోనవుతారు. ఇక వ్యాపారస్తులకు తీవ్రమైన నష్టాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే భాగస్వాములతో విభేదాలు వస్తాయి. ఇక నిర్ణయాలు తీసుకోవడంలో సందిగ్దంలో పడిపోతారు.
వృశ్చిక రాశి: ఈ రాశి జాతకులకు యతిపాత యోగం వల్ల కెరియర్‌లో అడ్డంకులు వస్తాయి. ఉద్యోగులకు తమ సహ ఉద్యోగులతో కానీ పై అధికారులతో కానీ గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో వీళ్ల కెరియర్ ప్రశ్నార్థకంగా మారుతుంది. వ్యాపారస్తులకు అకస్మాతుగా నష్టాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలపై సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. దీంతో నిర్ణయం తీసుకునే శక్తిని ప్రభావితం చేస్తుంది. దీని వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
మీన రాశి: యతిపాత యోగం కారణంగా మీన రాశి జాతకులు కూడా అష్టకష్టాలు రానున్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన కష్టాలు చుట్టుముడతాయి. జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. ఆశించిన పనులు నెమ్మదిస్తాయి. వ్యాపారాలలో లాభాలు ఆశించి భంగ పడతారు. ఉన్న డబ్బులన్నీ ఖర్చయిపోతాయి. మీకు దగ్గర ఉన్న వ్యక్తి చేతిలోనే మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
ఈ నాలుగు రాశులకు సూర్య, చంద్రుల కలయిక కారణంగా యతిపాత యోగం వల్ల వీరికి కష్టాలు రాబోతున్నాయి.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు పండితులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే కానీ బిగ్ టీవీ సొంతంగా క్రియేట్ చేసింది మాత్రం కాదని గమనించగలరు. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..?అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?