Allu Aravindh:శ్రీ తేజ్ (Sri Tej).. హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన గురించి తెలిసిన వారికి ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar ) దర్శకత్వంలో ‘పుష్ప’ సీక్వెల్ గా వచ్చిన చిత్రం ‘పుష్ప 2’. ఈ సినిమా బెనిఫిట్ షో 2024 డిసెంబర్ 4వ తేదీన సంధ్యా థియేటర్లో వెయ్యగా.. అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ అక్కడికక్కడే మరణించగా.. ఆమె కొడుకు శ్రీ తేజ్ నాటినుండి ఇప్పటివరకు ప్రాణాలతో పోరాడుతున్నారు. ప్రాణం నిలబెట్టుకోవడానికి శాయశక్తులా పోరాడుతున్న ఆ చిన్నారి ఆరోగ్యంగా కోలుకోవాలని ఎంతో మంది భగవంతుడిని ప్రార్థిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ బాలుడు పూర్తిగా రికవరీ అయ్యే వరకు పూర్తి బాధ్యత తమదేనని అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ (Allu Aravindh) మాట ఇచ్చిన విషయం తెలిసిందే. మాట ఇవ్వడమే కాదు ఆ హామీలన్నీ కూడా ఆయన నిలబెట్టుకుంటున్నారు
శ్రీ తేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్..
శ్రీతేజ్ ను హాస్పిటల్లో చేర్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఖర్చయినా ప్రతి రూపాయిని కూడా అల్లు అరవింద్, అల్లు అర్జున్ టీం స్వయంగా భరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నోసార్లు శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిని దగ్గరుండి మరీ తెలుసుకున్న అల్లు అరవింద్.. మధ్యలో కొంతకాలం సైలెంట్ అయ్యారు. మళ్లీ ఇప్పుడు మరొకసారి శ్రీ తేజ్ ను పరామర్శించారు. శ్రీ తేజ్ ను పరామర్శించడమే కాకుండా అతడి ఆరోగ్యం గురించి వైద్యులను అడిగిమరీ తెలుసుకున్నారు అల్లు అరవింద్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీ తేజ్ ఆరోగ్యం పై వైద్యులు మాట్లాడుతూ..”పెద్దల బ్రెయిన్ అయితే ఏదోలాగా రికవరీ చేయవచ్చు. కానీ శ్రీ తేజ్ ది ఎదిగే బ్రెయిన్ కాబట్టి కాస్త సమయం పడుతుంది. ఆయనను అబ్జర్వేషన్ లో ఉంచాము.. పూర్తిగా కోలుకోవడానికి ఇంకా చాలా సమయం పడుతుంది”. అంటూ డాక్టర్లు అల్లు అరవింద్ తో చెప్పిన విషయాలు వైరల్ గా మారాయి. ఇక ప్రస్తుతం అల్లు అరవింద్ శ్రీ తేజ్ ను పరామర్శించిన ఫోటోలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ALSO READ:Samantha: ఆ సీన్స్ కి తెగ ఎంజాయ్ చేశా.. ఇంత కక్ష ఎందుకు సమంత..!
అసలేం జరిగిందంటే..?
అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా పుష్ప 2 సినిమాను తెరకెక్కించడం జరిగింది. డిసెంబర్ 5న సినిమా విడుదలవ్వాల్సి ఉండగా.. డిసెంబర్ 4వ తేదీనే అభిమానుల కోసం ప్రీమియర్ షో వేశారు. ఇక ఈ షో చూడడానికి అభిమానులు పెద్ద ఎత్తున హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న సంధ్య థియేటర్ కి వచ్చారు. అయితే అదే థియేటర్ కి అల్లు అర్జున్ ఎటువంటి పర్మిషన్ లేకుండా ర్యాలీ నిర్వహించుకుంటూ సెక్యూరిటీతో థియేటర్ కి రావడం జరిగింది. అయితే అల్లు అర్జున్ ని నేరుగా చూడాలని అభిమానులు ఎగబడ్డారు. ఆ సమయంలో అల్లు అర్జున్ బౌన్సర్స్ కొంతమంది ఆడియన్స్ పై దాడి చేయగా.. తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో భాగంగా రేవతి అనే మహిళ అక్కడికక్కడే మరణించగా.. ఆమె కొడుకు శ్రీ తేజ్ గాయపడ్డారు. ఇక హుటాహుటిన హాస్పిటల్ లో చేర్పించిన శ్రీ తేజ్.. హాస్పిటల్ పాలై ఇప్పటికీ ఐదు నెలల అవుతున్నా ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంపై అటు ప్రజలు ఇటు నెటిజన్స్ అందరూ విచారణ వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే శ్రీతేజ్ కోలుకోవాలని కోరుకుంటున్నారు. పోతే శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి బాధ్యతను అల్లు అర్జున్ కుటుంబం తీసుకున్న విషయం తెలిసిందే.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్ pic.twitter.com/pr1tD71PHL
— BIG TV Breaking News (@bigtvtelugu) May 5, 2025