Big Stories

Anakapalli Assembly Constituency: మలసాల భరత్ Vs కొణతాల రామకృష్ణ.. అనకాపల్లిలో హవా ఎవరిది..?

- Advertisement -

విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణకు దక్కింది. గతంలో వైసీపీలోకి చేరిన దాడి వీరభద్రరావు కుటుంబం తిరిగి టీడీపీలో చేరిపోయింది. పొత్తు రాజకీయాలు నడుస్తున్నాయి. శరవేగంగా మారిన రాజకీయాల మధ్య అనకాపల్లిలో గెలిచేదెవరు. ఎవరికి ఎడ్జ్ కనిపిస్తోంది. బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్లు 2 సర్వేలో వెల్లడైన అంచనాలను ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

Also Read: Chandrababu Birthday Celebrations : కుప్పంలో చంద్రబాబు బర్త్ డే వేడుకలు.. తిరుమలలో 750 టెంకాయలు కొట్టిన శ్రీధర్

పందెంకోళ్లు 1 సర్వేకు, పందెంకోళ్లు సర్వే 2 మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది. వైసీపీ, టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జ్ పెరిగిందన్నది ఇప్పుడు చూద్దాం.

అనకాపల్లి సెగ్మెంట్ లో పందెంకోళ్లు 1 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి మలసాల భరత్ కు 41 శాతం ఓట్ షేర్ వచ్చే ఛాన్సెస్ కనిపించగా తాజా సర్వేలో అది 45 శాతానికి పెరిగింది. అదే సమయంలో పందెంకోళ్లు 1 సర్వే టైంలో విపక్షాల పొత్తులు కుదరకపోవడంతో టీడీపీ అభ్యర్థిగా ప్రొజెక్ట్ అయిన పీలాగోవింద్ కు 54 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లు వెల్లడైంది.

తాజా సర్వే చేసే నాటికి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణకు టిక్కెట్ దక్కింది. దీంతో కొణతాలకు 49 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లు వెల్లడైంది. ఇక ఇతరులకు గత సర్వేలో 5 శాతం ఓట్లు, తాజా సర్వేలో 6 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తేలింది. ఓవరాల్ గా చూస్తే ప్రస్తుతానికి అనకాపల్లిలో ఎడ్జ్ జనసేనవైపు కనిపిస్తోంది.

Also Read: స్టార్ క్యాంపెయినర్‌తో స్టార్ తిరిగేనా?

రెండు సర్వేల్లో అనకాపల్లి సెగ్మెంట్ లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం..

– ప్రభుత్వంపై యాంటీ ఇంకుబెన్సీ ఇంపాక్ట్

– టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎఫెక్ట్

– 30శాతంగా ఉన్న గవర కమ్యూనిటీలో ఎక్కువ శాతం విపక్ష కూటమికి సపోర్ట్ ఇచ్చే ఛాన్స్

– కొణతాలకు దాడి వీరభద్రరావు సపోర్ట్ ఇవ్వడం కీలకం

– మలసాల భరత్ కు మంచి ఇమేజ్ ఉండడం

– ప్రభుత్వ స్కీంల నుంచి లబ్దిపొందిన వారి ఓట్లపై వైసీపీ ఆశలు

– అనకాపల్లి పరిధిలో వైద్య సేవలు పెరగడం

– 45 శాతంగా ఉన్న కాపు కమ్యూనిటీ ఓట్లు కీలకం

ఓవరాల్ గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే… అనకాపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీకి స్వల్ప ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News