E-Paper
Advertisement

Big tv kissik Talks: ఆర్జీవీతో ఇంటర్వ్యూ.. బాధపడిన క్షణం లేదు..ఆయన వల్లే ఇదంతా!

Big tv kissik Talks: ఆర్జీవీతో ఇంటర్వ్యూ.. బాధపడిన క్షణం లేదు..ఆయన వల్లే ఇదంతా!
Advertisement

Big tv kissik Talks: బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ (Kissik Talks)కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ లభించింది. ప్రతి వారం సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలతో పాటు వృత్తిపరమైన, వ్యక్తిగత విషయాలు గురించి కూడా మాట్లాడుతూ ఎన్నో విషయాలను అభిమానులకు తెలియజేశారు. ఇక ఈ వారం ఈ కార్యక్రమంలో భాగంగా బిగ్ బాస్ బ్యూటీ అరియాన గ్లోరి హాజరయ్యారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ప్రసారమైంది. ఇందులో భాగంగా ఈమె ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

యాంకర్ గా గుర్తింపు..

ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మతో జరిగిన ఇంటర్వ్యూ గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. రాంగోపాల్ వర్మతో అరియాన చేసిన ఇంటర్వ్యూ అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే. ఇలా ఈ బోల్డ్ ఇంటర్వ్యూపై ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. అయితే తాజాగా ఈ ఇంటర్వ్యూ గురించి వర్ష ప్రశ్నలు వేశారు. ఈ సందర్భంగా అరియాన మాట్లాడుతూ మనకు చదువు రాదని అర్థమైన సమయంలోనే ఇండస్ట్రీలోకి రావాలని అనుకున్నాను అదే సమయంలోనే యాంకర్లు కావాలనే యాడ్ చూసి ఆడిషన్ కి వచ్చానని తెలియజేశారు. ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకోవాలి అంటే వర్మ లాంటి గారిని ఇంటర్వ్యూ చేయాలని తెలుసుకున్నాను అయితే ఆయన ఇంటర్వ్యూ కోసం చాలా ప్రయత్నాలు చేశానని అరియాన తెలిపారు.

వర్మ గారితో ఇంటర్వ్యూ..

Advertisement

వర్మ గారితో ఇంటర్వ్యూ చేసే అవకాశం రావడంతో నేను చూడటానికి చాలా చిన్న పిల్లలాగ కనిపించడంతో ఇంత చిన్న అమ్మాయి వర్మతో ఇంటర్వ్యూని మేనేజ్ చేయగలరా అంటూ చివరి క్షణంలో నన్ను తొలగించారని తెలిపారు. రెండోసారి అవకాశం వచ్చినప్పుడు వర్మ గారు అందుబాటులో లేకుండా వెళ్ళిపోయారు. ఇలా మూడోసారి వర్మ గారితో ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చిన కొన్ని కారణాల వల్ల అప్పుడు కూడా నన్ను తప్పించారని, వర్మ గారితో నేను ఇంటర్వ్యూ చేయలేనని ఆ క్షణం ఎంతో బాధపడ్డానని అరియాన తెలియజేశారు.

&nbsphttps://www.youtube.com/watch?v=OsiiW4Sbya0

Advertisement

ఇలా వర్మ గారితో తాను ఇంటర్వ్యూ చేయలేనని ఈ ఇంటర్వ్యూ పై ఆశలు కూడా వదిలిపెట్టుకున్నాను కానీ ఒక రోజు సడన్ గా వర్మ గారితో రెండు గంటల్లో ఇంటర్వ్యూ ఉంది రెడీ కమ్మంటూ నాకు ఫోన్ కాల్ వచ్చింది. అయితే ఆ క్షణం నాకు ఇంటర్వ్యూ చేయాలనిపించలేదు కానీ అయిష్టంగానే ఇంటర్వ్యూ చేశానని తెలిపారు. ఇక ఈ ఇంటర్వ్యూ పై ఎంతో మంది ఎన్నో విధాలుగా స్పందించారు కానీ నాకు మాత్రం ఈ ఇంటర్వ్యూ తర్వాత బిగ్ బాస్ అవకాశం వచ్చిందని, ఇదంతా వర్మ గారి ఇంటర్వ్యూ కారణంగానే అంటూ అరియాన ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: Big tv kissik Talks: అరియానా అసలు పేరు ఇది కాదా… పేరు మార్పుకు ఇదే కారణమా!

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×