Bollywood Movies : ఈరోజు తో 2024 ఎండ్ అవుతుంది. రేపటితో 2025 వ ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాము. ఈ ఏడాదిలో సినీ ఇండస్ట్రీలో జరిగిన అద్భుతాలను ఒకసారి గుర్తు చేసుకున్నారు. ఈ ఏడాది తెలుగు ఇండస్ట్రీ తో పాటుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుసగా హిట్ సినిమాలు ఉన్నాయి… ఈ ఏడాది బాలీవుడ్ కలెక్షన్స్ తో షేక్ చేసిన మూవీస్ ఏంటో ఒకసారి లుక్ వేద్దాం పదండి..
స్త్రీ-2..
బాలీవుడ్ ను ఈ ఏడాది శాసించిన మూవీలలో ప్రముఖంగా వినిపించే పేరు స్త్రీ 2.. ఈ మూవీలో రాజ్‌కుమార్, శ్రద్ధాకపూర్ నటించిన ఈ హారర్ కామెడీ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లతో బ్లాక్ బస్టర్ అయ్యింది. వరల్డ్ వైడ్ గా రూ.837 కోట్లు వసూలు చేసి బాలీవుడ్‌లో ఈ ఏడాది తొలి స్థానంలో నిలిచింది.. ఈ మూవీ రికార్డ్ లను మరే మూవీ బీట్ చెయ్యలేక పోయింది.
భూల్ భులయ్యా-3..
ఈ మూవీ కూడా హారర్ కామెడీ చిత్రమే. గ్లోబల్‌గా రూ.371 కోట్ల వసూళ్లతో రెండో స్థానంలో నిలిచింది. అనీస్ బాజ్మీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్, విద్యాబాలన్, మాధురి దీక్షిత్, త్రిప్తీ డిమ్రీ తదితరులు నటించారు.. రీసేంట్ గా ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మూవీ వ్యూస్ తో దూసుకుపోతుంది.
సింగం ఎగైన్..
స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అజయ్ దేవగణ్, రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే, అర్జున్ కపూర్, టైగర్ ష్రాఫ్, కరీనాకపూర్, అక్షయ్ కుమార్ వంటి భారీ తారాగణం నటించారు. అయినప్పటికీ ఇదే సమయంలో విడుదలైన భూల్ భులయ్యా-3ని ఏమ్రాతం అధిగమించలేదు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.367 కోట్లు వసూలు చేసి మూడో స్థానంలో నిలిచింది..
షైతాన్..
ఇది ఒక సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ చిత్రం. వికాస్ దర్శకత్వంలో అజయ్ దేవగణ్, మాధవన్, జ్యోతిక తదితరులు నటించారు. గుజరాతి చిత్రం ‘వశ్’ ఆధారంగా నిర్మించిన ఈ సినిమా రూ. 210 కోట్ల కలెక్షన్లు సాధించింది.. ఇప్పటికి ఈ మూవీ క్రేజ్ తగ్గలేదు..
ముంజ్యా..
ఆదిత్య సర్వోథ్థర్ దర్శకత్వం లో వచ్చిన సూపర్ నేచురల్ యూనివర్సల్ చిత్రం. శర్వరీ, అభయ్ వర్మ, సత్యరాజ్, మోనా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. విమర్శకుల నుంచి సానుకూల సమీక్షలు పొందినప్పటికీ ఎక్కువగా వసూళ్లు రాబట్టలేకపోయింది. గ్లోబల్ వైడ్‌గా రూ. 128 కోట్లు సాధించగలిగింది.
బ్యాడ్ న్యూజ్..
గుడ్ న్యూజ్‌కి ఆధ్యాత్మిక సీక్వెల్ గా వాస్తవాధారిత ఘటనల ఆధారంగా నిర్మించిన హాస్య భరిత చిత్రం. విక్కీ కౌశల్, ట్రిప్తీ డిమ్రీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆనంద్ తివారీ దర్శకుడు. బాక్సాఫీసు వద్ద రూ.109 కోట్లను వసూలు చేసింది…
ఇక వీటితో పాటుగా చాలా సినిమాలు హిట్ టాక్ అందుకున్నాయి. ఇక తెలుగు సినిమాల లెక్క వేరే ఉందని చెప్పాలి. ఈ ఏడాది ఎన్నో సినిమాలు హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి.