BigTV English

OTT Movie : సూపర్ నేచురల్ పవర్ తో రాజ్యాన్ని కాపాడే అమ్మాయి… ఆమెకేమైందంటే?

OTT Movie : సూపర్ నేచురల్ పవర్ తో రాజ్యాన్ని కాపాడే అమ్మాయి… ఆమెకేమైందంటే?

OTT Movie : సూపర్ నేచురల్ పవర్ తో వచ్చే సినిమాలు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చూసి బాగా ఎంటర్టైన్ అవుతారు. కొంతమంది ఇటువంటి సినిమాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటారు. థియేటర్లలో విజయవంతమైన ఒక సైంటిఫిక్ సూపర్ నేచురల్ పవర్ మూవీ ఓటిటి ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి ఇందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.


డిస్నీ+హాట్ స్టార్ (Disney +hotstar)

ఈ మూవీ పేరు ‘సీక్రెట్ సొసైటీ ఆఫ్ సెకండ్-బోర్న్ రాయల్స్‘ (Secret Society of Second – Born Royals). ఈ మూవీకి అన్నా మాస్ట్రో దర్శకత్వం వహించారు. ఈ మూవీలో పేటన్ ఎలిజబెత్ లీ, నైల్స్ ఫిచ్, ఇసాబెల్లా బ్లేక్-థామస్, ఒలివియా డీబుల్, నోహ్ లోమాక్స్, ఫాలీ రాకోటోహవానా, యాష్లే లియావో నటించారు. ఈ మూవీ విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. ఈ సైంటిఫిక్ మూవీ సెప్టెంబర్ 25, 2020 నుంచి  డిస్నీ+హాట్ స్టార్ (Disney +hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

యూరప్ లో ఒక రాజ్యానికి రాణిగా కేథరిన్ ఉంటుంది. రాజుని అతని తమ్ముడు చంపడంతో జైలులో పెట్టి ఉంటారు. ఈ మూవీలో జైలులో ఉన్న వ్యక్తి విలన్. కేథరిన్ కి ఎలినూర్, సమంత ఇద్దరు కూతుర్లు ఉంటారు. అయితే పెద్ద కూతురును ఆ రాజ్యానికి రాణిని చేయాలనుకుంటా రు. సమంత మాత్రం ఎక్కువ సోషల్ గా ఉంటుంది. పేదరికంలో ఉండే మైక్ తో ఎక్కువగా తిరుగుతుంది. ఈమె చేసే కొన్ని ఆకతాయి పనుల వల్ల పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉంటారు. రాయల్ ఫ్యామిలీ కాబట్టి మళ్ళీ వదిలేస్తారు. ఈ క్రమంలో కేథరిన్ సమంతను ఒక సమ్మర్ స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటుంది. అందులో సమంతతో పాటు మరికొంతమంది రాజవంశంలోని పిల్లలు వస్తారు. వీళ్ళందరికీ కొన్ని సూపర్ నేచురల్ పవర్స్ ఉంటాయి. ఈ సమ్మర్ స్కూల్లో ఆ పవర్స్ ను, వాళ్లు ఎలా యూస్ చేయాలో తెలుసుకుంటారు. సమంతకి కూడా ఒక సూపర్ నేచురల్ పవర్ ఉంటుంది. ప్రమాదాన్ని ముందే పసిగట్టి దానికి తగ్గట్టుగా పరిస్థితిని మార్చుకుంటుంది. ఇలా వీరి విన్యాసం సాగుతుండగా జైలు నుంచి విలన్ తప్పించుకుంటాడు.

విలన్ కూడా రాజ వంశస్థుడు కావడంతో అతనికి కూడా పవర్స్ ఉంటాయి. విలన్ సమంతని ఫాలో చేస్తూ వస్తాడు. అతన్ని అక్కడ ఉన్నవాళ్లు ఎదుర్కొంటారు. మళ్లీ అతనిని బంధిస్తూ ఉండగా, సమంతకి అతను ఎవరో తెలుస్తుంది. అతను తన తండ్రిని చంపిన వ్యక్తి అని తెలుసుకొని బాధపడుతుంది. సమంత చిన్న తండ్రి ఆ రాజ్యానికి రాజు కావాలనుకుంటాడు. ఎందుకంటే రాజ్యంలో కొన్ని మార్పులు తేవాలి అనుకుంటాడు. అందుకు రాజు ఒప్పుకోకపోవడంతో అతనిని చంపేసి ఉంటాడు. ఈ విషయం సమంతకి చెప్తాడు. ఈ క్రమంలో ఆ రాజ్యంలో కొన్ని అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి? చివరికి సమంత ఆ రాజ్యంలోని పరిస్థితులను చక్కబెడుతుందా? కేథరిన్ వల్ల ఆ రాజ్యానికి ఏమైనా సమస్యలు వస్తాయా? విలన్ ఏమైనా సమస్యలు సృష్టిస్తాడా? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ ఎంటర్టైనర్ మూవీని చూడాల్సిందే.

Related News

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

OTT Movie : స్కామర్ తో మిలియనీర్ సయ్యాట… ఒక్క నైట్ కలిశాక థ్రిల్లింగ్ ట్విస్ట్

Big Stories

×