Yash: ఒక సినిమా ప్రీమియర్ చూడడానికి ఒక హీరో రావడం, హీరోను చూడడానికి ప్రేక్షకులు ఎగబడడం, ఆ సందర్భంలో తొక్కిసలాట జరిగి ఒక ఫ్యాన్ మృతిచెందడం అనేది వినడానికి ఇక ట్రాజిడీ సినిమా స్టోరీలాగా అనిపించినా ఇలాంటిది నిజంగా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. అలా జరగడం చాలా దురదృష్టకరం. ఇప్పటికే ‘పుష్ప 2’ ప్రీమియర్స్‌లో ఇలా జరిగినందుకు పర్మిషన్ లేకుండా అల్లు అర్జున్ రోడ్ షో చేయడమే కారణమని పోలీసులు అంటున్నారు. దీంతో ఒక్కసారిగా స్టార్ హీరోలు అందరికీ జ్ఞానోదయం అయినట్టు అనిపిస్తోంది. అందులో ముందుగా యశ్.. ఈ విషయంపై ఇన్‌డైరెక్ట్‌గా స్పందించాడు.
అదంతా వద్దు
మామూలుగా స్టార్ హీరోల పుట్టినరోజు తమ అభిమానులు పెద్ద పండగలాగా సెలబ్రేట్ చేస్తారు. కటౌట్స్ పెడతారు, కేక్ కటింగ్ చేస్తారు.. ఇంతే కాదు.. ఇంకా చాలా ఉంటాయి. అలాంటి సందర్భాల్లో కూడా పలుమార్లు దురదృష్టకర ఘటనలు జరిగి ఫ్యాన్స్ మరణించారు. దీంతో స్టార్ హీరోలు సైతం తమ పుట్టినరోజును ఇలా సెలబ్రేట్ చేయొద్దని ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. ఇక యశ్ కూడా గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని, ఇటీవల జరిగిన సంధ్య థియేటర్ ఘటనను దృష్టిలో పెట్టుకొని అసలు తన పుట్టినరోజు ఫ్యాన్స్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలని అనుకోవద్దని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.
Also Read: కళ్యాణ్ కనిపించలేదు అన్నారు, కానీ ఈ రోజు కరెక్ట్ గా మాట్లాడాడు
అదే గిఫ్ట్
‘నా ప్రియమైన శ్రేయోభిలాషులకు.. న్యూ ఇయర్ అంటే కొత్త మార్పుకు శ్రీకారం. ఇన్నాళ్లకు మీరు నాపై చూపిస్తున్న ప్రేమ సాధారణమైనది కాదు. అలాగే మధ్యలో కొన్ని దురదృష్టకర ఘటనలు జరిగాయి. అందుకే మన ప్రేమను చూపించే విధానం మార్చే సమయం వచ్చేసింది. ముఖ్యంగా నా పుట్టినరోజు వేడకుల విషయానికి వచ్చేసరికి అన్ని మారాలి. నాపై మీరు చూపించే ప్రేమ ఒకే దగ్గర చేరి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయడంలో ఉండకూడదు. మీరు జాగ్రత్తగా ఉండి, అందరికీ మంచి ఉదాహరణగా నిలిచి, మీ లక్ష్యాలను సాధిస్తూ అందరికీ ఆనందాన్ని పంచుతూ ఉంటే.. అదే మీరు నాకు ఇచ్చే అతిపెద్ద గిఫ్ట్’ అని చెప్పుకొచ్చాడు యశ్ (Yash).
ఊరిలో ఉండను
‘నేను నా పుట్టినరోజుకు షూటింగ్‌లో బిజీగా ఉంటూ అసలు ఊరిలోనే ఉండను. కానీ మీ బర్త్ డే విషెస్ నాకు అందుతాయి. నాకెప్పుడూ తోడుగా ఉంటాయి. నన్ను ముందుకు నడిపిస్తాయి. అందరూ జాగ్రత్తగా ఉండండి. అందరికీ 2025 న్యూ ఇయర్ శుభాకాంక్షలు’ అన్నాడు యశ్. ఈ కన్నడ స్టార్ జనవరి 8న తన పుట్టినరోజును సెలబ్రేట్ చేయొద్దని చెప్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా.. అది చూసిన నెటిజన్లు మాత్రం సంధ్య థియేటర్ ఘటనను దృష్టిలో ఉంచుకునే యశ్ ఇలా చేశాడని ఫీలవుతున్నారు. మొత్తానికి ఇదొక మంచి నిర్ణయమని, ఇతర స్టార్ హీరోలు కూడా ఇదే ఫార్ములాను ఫాలో అయితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ స్టార్ హీరోల పుట్టినరోజు సెలబ్రేషన్స్ కోసం ఫ్యాన్స్ ఏదైనా చేయడానికి సిద్ధపడతారు.
— Yash (@TheNameIsYash) December 30, 2024