BigTV English

Mahakumbh 2025: జాక్ పాట్ కొట్టేసిన మోనాలిసా.. బాలీవుడ్ మూవీలో అవకాశం..!

Mahakumbh 2025: జాక్ పాట్ కొట్టేసిన మోనాలిసా.. బాలీవుడ్ మూవీలో అవకాశం..!

Mahakumbh 2025: మోనాలిసా(Monalisa)..ప్రస్తుతం సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ పేరు.. ఎక్కడ చూసినా మోనాలిసాకి సంబంధించిన అందమైన ఫోటోలే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఈమెకు సంబంధించిన వీడియోలే కనిపిస్తున్నాయి. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ యూపీలోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళలో రుద్రాక్ష దండలు అమ్ముతూ తన క్యూట్ స్మైల్ తో తేనె కళ్ళతో అందర్నీ మత్తెక్కించింది. అయితే ఈమె చాలా అందంగా నవ్వుతున్న ఫోటోని ఎవరో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఈ ఫోటో చూసిన క్షణాల్లోనే చాలా మంది ఈ ఫొటో ని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో టాప్ ప్లేస్ లోకి తీసుకు వచ్చారు. ఆ తర్వాత ఈమె సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయింది.అలా ఒక్కసారిగా ఈమె వైరల్ అవ్వడంతో మహా కుంభమేళకు వెళ్ళిన చాలా మంది భక్తులు మోనాలిసాని చూడడానికి పరుగులు పెట్టారు.అలా మోనాలిసాతో ఫోటోలు, వీడియోలు తీయించుకుంటూ ఆమెని తెగ వైరల్ చేశారు. అయితే అందమే ఈమెకు శాపం అయినట్టు అంత అందమైన అమ్మాయిని చూడడానికి వచ్చిన జనాల వల్ల మోనాలిసా తెగ ఇబ్బందులు పడుతోంది.చాలామంది ఆమెతో ఫోటో దిగడానికి వచ్చి ఆమె వ్యాపారాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు.


నటన నేర్పించి మరీ తీసుకుంటాను.. డైరెక్టర్

ఈ విషయం పక్కన పెడితే.. ఈ తేనెకళ్ళ సుందరికి తాజాగా బాలీవుడ్లో స్టార్ డైరెక్టర్ అవకాశం ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ విషయాన్ని ఆ దర్శకుడు తాజాగా బయటపెట్టారు. ఆయన ఎవరో కాదు సనోజ్ మిశ్రా (Sanoj mishra)..ప్రస్తుతం ఈయన ‘డైరీ ఆఫ్ మణిపూర్’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో రైతు కూతురి పాత్రలో మోనాలిసా చాలా బాగా సెట్ అవుతుంది అని, ఆ డైరెక్టర్ అనుకుంటున్నారు. మోనాలిసా క్యూట్ ఫొటోస్ ని చూసి ఫిక్స్ చేశారట.అయితే ఈ విషయాన్ని మీడియా వేదికగా బయట పెట్టిన సనోజ్ మిశ్రా.. “ఆమె అమాయకత్వపు చూపుకు నేను ఫిదా అయిపోయాను. వెంటనే ఆమెకు నా డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాలో ఛాన్స్ ఇస్తున్నట్టు” తెలియజేశారు.అలాగే ఈ సినిమా కోసం మోనాలిసాకు నటన నేర్పించి మరీ తీసుకుంటామని డైరెక్టర్ తెలియజేశారు. ఇక డైరెక్టర్ మాటలకు ఫిదా అయినా చాలామంది నెటిజన్స్ ఒక్క ఫోటోతో మోనాలిసా బంపర్ ఆఫర్ పట్టేసింది. ఏకంగా బాలీవుడ్ లో ఛాన్స్ కొట్టేసింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.


రామ్ చరణ్ మూవీలో మోనాలిసాకి అవకాశం..

అయితే మోనాలిసా కి కేవలం బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా స్టార్ హీరో సినిమాలో అవకాశం వచ్చినట్టు టాలీవుడ్ సినీ సర్కిల్స్ నుండి వార్తలు వినిపిస్తున్నాయి. మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ramcharan) ప్రస్తుతం బుచ్చిబాబు(Bucchibabu) దర్శకత్వంలో ఆర్సి 16 సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ (Janhvi kapoor) చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ సినిమాలో ఓ పాత్ర కోసం మోనాలిసాని తీసుకోబోతున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్ నుండి వార్తలు రావడంతో ఒక్క దెబ్బతో అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ రెండు ఇండస్ట్రీలలో ఛాన్స్ కొట్టేసింది మోనాలిసా అంటూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈమె అదృష్టాన్ని చూసి ఎప్పుడు ఎవరు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం కష్టంగా మారిపోయింది అని సోషల్ మీడియా జనాలు మాట్లాడుకుంటున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×