Dirtiest Railway Stations In India: ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ లలో ఒకటైన భారతీయ రైల్వే సంస్థ.. దేశ వ్యాప్తంగా 7,300 పైగా రైల్వే స్టేషన్లను కలిగి ఉంది. వీటన్నింటి మెంటెనెన్స్ అనేది మామూలు విషయం కాదు. గత 10 సంవత్సరాలుగా దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లను అత్యాధునికంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. సెమీ హైస్పీడ్ రైళ్లను తీసుకురావడంతో పాటు కోట్ల రూపాయలను వెచ్చించి ఆయా రైల్వే స్టేషన్లను పునర్నిర్మిస్తున్నది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ పలు రైల్వే స్టేషన్లలో రెన్నొవేషన్ పనులు కొనసాగుతున్నాయి.
భారతీయ రైల్వే సంస్థ ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ దేశంలో పలు రైల్వే స్టేషన్ల పరిస్థితి అధ్వాహ్నంగా ఉన్నది. పరిశుభ్రత విషయంలో టాప్ 10 రైల్వే స్టేషన్లలో 7 స్టేషన్లు రాజస్థాన్ లోనే ఉన్నాయి. ఇక అత్యంత అపరిశుభ్రంగా ఉన్న టాప్ 10 స్టేషన్లలో 6 రైల్వే స్టేషన్లు తమిళనాడులోనే ఉండటం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఇంతకీ దేశంలో టాప్ 10 డర్టీ రైల్వే స్టేషన్లు ఏవి? ఎందుకు అలా మారాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. భారతీయ రైల్వేకు సంబంధించిన అధికారిక వెబ్ సైట్ రైల్ స్వచ్ఛ్ పోర్టల్ ఆధారంగా వీటిని గుర్తించడం జరిగింది.
దేశంలో టాప్ 10 చెత్త రైల్వే స్టేషన్లు
1.పెరుంగళత్తూరు రైల్వే స్టేషన్
దేశంలోని టాప్ 10 చెత్త రైల్వే స్టేషన్లలో తమిళనాడులోని పెరుంగళత్తూరు రైల్వే స్టేషన్ తొలి స్థానాన్ని సంపాదించింది. రైల్ స్వచ్ఛ్ పోర్టల్ ప్రకారం అత్యంత మురికి రైల్వే స్టేషన్లలో అగ్ర స్థానాన్ని దక్కించుకున్నది.
2.గిండి రైల్వే స్టేషన్
అపరిశుభ్రత విషయంలో తమిళనాడులోని గిండి రైల్వే స్టేషన్ రెండో స్థానాన్ని దక్కించుకున్నది.
3.సదర్ బజార్ రైల్వే స్టేషన్
అత్యంత చెత్త రైల్వే స్టేషన్లలో దేశ రాజధాని ఢిల్లీలోని స్టేషన్లు కూడా ఉండటం విశేషం. సదర బజార్ రైల్వే స్టేషన్ మురికి రైల్వే స్టేషన్లలో మూడో స్థానంలో నిలిచింది. ప్రజలు స్టేషన్ సమీపంలోనే చెత్త పడేయడం, డ్రైనేజీ సమస్యల కారణంగా మురికి రైల్వే స్టేషన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
4.వేలచ్చేరి రైల్వే స్టేషన్
తమిళనాడులోని వేలచ్చేరి స్టేషన్ చెత్త రైల్వే స్టేషన్లలో 4వ స్థానంలో నిలిచింది.
5.గుడువాంచెరి రైల్వే స్టేషన్
తమిళనాడులోని గుడువాంచెరి స్టేషన్ అపరిశుభ్రతలో ఐదవ స్థానం దక్కించుకుంది.
6.సింగపెరుమాల్కోయిల్ రైల్వే స్టేషన్
తమిళనాడుకు చెందిన సింగపెరుమాల్కోయిల్ స్టేషన్ మురికి స్టేషన్లలో ఆరవ స్థానంలో నిలిచింది.
7.ఒట్టపాలెం రైల్వే స్టేషన్
కేరళలోని ఈ రైల్వే స్టేషన్ మురికి స్టేషన్లలో 7వ స్థానంలో ఉంది.
8.పజవంతంగల్ రైల్వే స్టేషన్
దేశంలోని మురికి రైల్వే స్టేషన్లలో తమిళనాడులోని పజవంతంగల్ రైల్వే స్టేషన్ ఎనిమిదో స్థానంలో నిలిచింది.
9.అరారియా కోర్ట్ రైల్వే స్టేషన్
డర్టీ రైల్వే స్టేషన్ల లిస్టులో బీహార్‌కు చెందిన అరారియా కోర్ట్ రైల్వే స్టేషన్ 9వ స్థానంలో నిలిచింది.
10.ఖుర్జా స్టేషన్ రైల్వే స్టేషన్
అత్యంత చెత్త రైల్వే స్టేషన్లలో 10వ స్థానాన్ని ఉత్తర ప్రదేశ్ లోని ఖుర్జా స్టేషన్ నిలిచింది.
Read Also: దేశంలో అత్యంత చెత్త రైళ్లు ఇవే.. ముక్కు మూసుకుని జర్నీ చేయక తప్పదు!