AI Data center Cluster Hyderabad: తెలంగాణకు పెట్టుబడులు రప్పించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది సీఎం రేవంత్ రెడ్డి టీమ్. ప్రస్తుతం దావోస్‌లో పర్యటిస్తున్న ఈ బృందం గ్లోబల్ కంపెనీలతో ఎంవోయూలు కుదుర్చుకుంటోంది. తాజాగా హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్ కంపెనీ.
సీఎం రేవంత్ బృందంతో కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ ప్రతినిధులు వివిధ అంశాలపై చర్చించారు. హైదరాబాద్‌లో ఉన్న అవకాశాలను ఆ కంపెనీ ప్రతినిధులకు వివరించారు. తెలంగాణలో అత్యాధునిక AI డేటా సెంటర్ క్లస్టర్‌ను నెలకొల్పేందుకు ముందుకు రావడం, ఆపై అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై సంతకం చేసింది. దాదాపు రూ. 10 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనుంది.
దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది. అర్టిఫిషియల్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు కానుంది. 400 మెగా వాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ నెలకొల్పుతుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల దాదాపు 3,600 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి.
ఈ సమావేశం అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ తెలంగాణలో డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్దిలో ఈ డేటా సెంటర్ ఏర్పాటు మరో మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఐటీ సేవల సామర్థ్యం పెరుగుతుందని, ఉపాధి అవకాశాలు మెరుగుపడుతుందని వెల్లడించారు.
ALSO READ: రేవంత్ టీమ్ చర్చలు సక్సెస్.. ముందుకొచ్చిన టెక్ కంపెనీ, హైదరాబాద్‌లో సెంటర్
డేటా సెంటర్ల ఏర్పాటులో ఐటీ సేవల ప్రమాణాలు మరింత వృద్ది సాధిస్తాయని కంట్రోల్ ఎస్ సీఈవో శ్రీధర్ పిన్నపురెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకోవటం గర్వంగా ఉందన్నారు.
The Telangana Government has signed an MoU with CtrlS Datacenters to establish a cutting-edge AI Datacenter Cluster in the state.
With an investment of ₹10,000 crores and a 400 MW capacity, the project, unveiled at @wef 2025 in #Davos, will generate 3,600 jobs and contribute… pic.twitter.com/2nKHPwkQDa
— Telangana CMO (@TelanganaCMO) January 22, 2025