BigTV English

A Cancer patient last dream: దేవర సినిమా చూసి చనిపోతా.. బతికించండి ప్లీజ్..

A Cancer patient last dream: దేవర సినిమా చూసి చనిపోతా.. బతికించండి ప్లీజ్..

A Cancer patient last dream: ఓ క్యాన్సర్ పేషెంట్ తన చివరి కోరిక బయటపెట్టాడు. జీవితంపై తనకు విరక్తి కలిగిందని, తన చివరి కోరిక తీర్చాలంటూ వేడుకుంటున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ చూసి చనిపోతానని, అప్పటివరకు బతికించాలని వేడుకుంటున్నారు. ఇంతకీ ఎక్కడ?


హీరోలకు హార్డ్‌కోర్ ఫ్యాన్స్ ఉంటారు. తమ అభిమాన హీరో సినిమా రిలీజైతే చాలు.. వారి హంగామా అంతా ఇంతా కాదు. బెనిఫిట్ షో చూసే వరకు వారి మనస్సు శాంతించదు.  అలాంటివారిలో 19 ఏళ్ల కౌశిక్ ఒకడు. జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని.

తన హీరో సినిమా వచ్చిందంటే చాలు.. ఎలాగైనా చూసేవాడు. కొడుకు కోరికను ఆ తల్లిదండ్రులు కాదనలేకపోయేవారు. స్వయంగా తల్లిదండ్రులు తమ కొడుకుని థియేటర్ తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే తమ కొడుకును ఎలాగైనా బతికించుకోవాలని ఆరాటపడుతున్నారు. ఇంతకీ అసలేమైంది?


ALSO READ: వీడి కంట పడితే నీడకైనా చెమటలే.. ఎన్టీఆర్ కు ట్రిబ్యూట్ ఇచ్చిన కెజిఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్

ఆ యువకుడి పేరు కౌశిక్. వయస్సు 19 ఏళ్లు.. ప్రస్తుతం బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. కౌశిక్ తండ్రి శ్రీనివాసులు టీటీడీలో కాంట్రాక్ట్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. తిరుపతిలో శ్రీనివాసు ఫ్యామిలీ ఉంటోంది. కొడుకు బతికించుకోవాలని ఆ తల్లిదండ్రుల తపన అంతాఇంతా కాదు.

అందుకోసం నానాకష్టాలు పడ్డారు.. పడుతున్నారు ఆ దంపతులు. సంపాదించినదంతా కొడుకు ఆరోగ్యం కోసం ఖర్చు చేశారు. చివరకు కూడ బెట్టుకున్న ఆస్తులను సైతం అమ్మేశారు. దేవర సినిమా విడుదలైన వరకు తన కొడుకును బతికించమని ఆ తల్లి కోరుతోంది. ట్రీట్‌మెంట్ చేయాలంటే ఒక్కో ఇంజెక్షన్ మూడు లక్షల రూపాయలని, అలాంటివి 12 ఇంజెక్షన్లు చేయాలని డాక్టర్లు అన్నట్లు చెప్పుకొచ్చారు.

దేవర సినిమా ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చనిపోయే ముందు తన అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా చూడాలన్నది కౌశిక్ కోరిక. అప్పటివరకు తన కొడుకును బతికించాలంటూ ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ట్రీట్‌మెంట్‌కు 60 లక్షలు అవుతుందని, దాతలు ఎవరైనా ఉంటే సాయం చేయాలని వేడుకుంటున్నారు.

 

Related News

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Kissik Talks Promo : మహేష్ విట్టా లవ్ స్టోరిలో ఇన్ని ట్విస్టులా..ఆ ఒక్క కోరిక తీరలేదు..

Ritu Chaudhary : చెప్పు రీతు నువ్వు నన్ను మోసం చేయలేదా? రీతుకి కళ్యాణ్ తో బంధం తెగిపోయిందా?

Bigg boss emmanuel : నా బాధ మీకు తెలియదు, రోజు దుప్పటి కప్పుకుని ఏడుస్తాను

Big Stories

×