BigTV English

Bigg Boss 8 Promo: బొక్కబోర్లా పడ్డ సోనియా.. నిఖిల్ హర్ట్, తొక్కలో సెంటిమెంట్స్ అంటూ యష్మీ ఫైర్

Bigg Boss 8 Promo: బొక్కబోర్లా పడ్డ సోనియా.. నిఖిల్ హర్ట్, తొక్కలో సెంటిమెంట్స్ అంటూ యష్మీ ఫైర్

Bigg Boss 8 Latest Promo: సీజన్ 8లో రెండోవారమే లిమిట్‌లెస్ ఎంటర్‌టైన్మెంట్ అందించాలని బిగ్ బాస్ ఫిక్స్ అయ్యారు. అందుకే కంటెస్టెంట్స్ మధ్య బ్యాక్ టు బ్యాక్ పోటీలు పెడుతున్నారు. ఈ పోటీల వల్ల కంటెస్టెంట్స్ మధ్య మనస్పర్థలతో పాటు గొడవలు కూడా పెరుగుతున్నాయి. దీంతో ఆడియన్స్‌కు ఎంటర్‌టైన్మెంట్ అందుతోంది. తాజాగా ప్రసారమయిన ఎపిసోడ్‌లో రేషన్ గురించి హౌజ్‌మేట్స్ మధ్య గొడవ జరిగింది. చివరికి నిఖిల్, నాగ మణికంఠ ఎలాంటి రేషన్ లేకుండా పచ్చి కూరగాయలు తింటూ బ్రతకాల్సి వచ్చింది. నిఖిల్ ఆటతీరు మారి, సెంటిమెంటల్ అవ్వడం వల్ల మిగతా కంటెస్టెంట్స్‌కు కూడా నష్టం జరుగుతోంది. దానివల్లే యష్మీకి కూడా కోపం వచ్చింది.


పూల్‌లో దూకాలి

‘‘మునుపటి సీజన్స్‌లో లేనివిధంగా ఈ సీజన్‌లో లిమిట్ లేని డబ్బును ప్రైజ్ మనీగా దక్కించుకునే అవకాశాన్ని బిగ్ బాస్ మీకు కల్పించారు. సమయానుసారం బిగ్ బాస్ ఇచ్చే మొదటి అవకాశం కోసం సిద్ధంగా ఉండండి’’ అంటూ ప్రోమో మొదట్లోనే ప్రైజ్ మనీ కోసం ఎదుర్కోవాల్సిన ఛాలెంజ్‌ల గురించి బిగ్ బాస్ వివరించారు. ముందుగా స్విమ్మింగ్ పూల్‌లో దూకాల్సిందిగా నాగ మణికంఠ, సోనియా, విష్ణుప్రియాను ఆదేశించారు. దీంతో ఒక్కసారిగా కంటెస్టెంట్స్ అంతా పరిగెత్తడం మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే సోనియా బొక్కబోర్లా పడింది. విష్ణుప్రియా ముందుగా స్విమ్మింగ్ పూల్‌లో దూకి గెలిచింది. సోనియాకు దెబ్బలు తగిలాయేమోనని తనను దగ్గరకు తీసుకున్నాడు పృథ్వి.


Also Read: నిఖిల్‌ను ఎమోషనల్ ఫూల్ చేసిన సోనియా.. మధ్యలో మణికంఠ బలి, వారమంతా అదే తిని బ్రతకాలా?

మనం ఆర్టిస్టులం

టాస్కుల్లో దెబ్బలు తగిలించుకోవడంపై అందరితో చర్చలు మొదలుపెట్టాడు నిఖిల్. ‘‘మణికంఠ ప్లేస్‌లో నేను ఉండుంటే చాలా రఫ్‌గా ఆడుతాను కాబట్టి నీకైనా తగలొచ్చు, నాకైనా తగలొచ్చు. మనం ఆర్టిస్టులం. తల పగిలితే ఎవరిది బాధ్యత. అర్థం చేసుకో’’ అంటూ పృథ్వికి నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. ఆ మాటలు యష్మీకి నచ్చలేదు. ‘‘సెంటిమెంటల్‌గా మాట్లాడితే మా గేమ్‌ను పక్కన పెట్టి మీ ఇష్టాలకు అడ్జస్ట్ అయిపోవాలి’’ అని సీరియస్ అయ్యింది. ‘‘ఫిజికల్‌గా దెబ్బలు తగలకూడదు అని చెప్తున్నాను’’ అని నిఖిల్ అంటున్న వినకుండా తనపై అరుస్తూనే ఉంది యష్మీ.

రూల్స్ మర్చిపోయారు

‘‘బిగ్ బాస్ మీకు ఇస్తున్న రెండో అవకాశం విలువ రూ.50 వేలు’’ అంటూ ప్రైజ్ మనీ కోసం రెండో పోటీని పెట్టారు బిగ్ బాస్. ఇందులో పృథ్వి, నబీల్, నిఖిల్ కలిసి తాడును మూడు వైపులా పట్టుకొని తమకు ఇచ్చిన కలర్ బాల్స్‌ను బాస్కెట్‌లో వేయాలి. అలా ముగ్గురి మధ్య పోటీ మొదలయ్యింది. మొదట్లో నబీల్ బాగానే ఆడినా.. మధ్యలో తాడును పట్టుకోలేక వదిలేశాడు. దీంతో పృథ్వి, నిఖిల్ మాత్రమే పోటీలో మిగిలారు. కోపంతో నిఖిల్ బాస్కెట్‌ను తన్ని బాల్స్‌ను కింద పడేశాడు పృథ్వి. దీంతో గేమ్ రూల్స్‌ను పక్కన పెట్టి.. ఇద్దరూ ఒకరి చేతిలో నుండి మరొకరు తాడును లాక్కోవడానికి ప్రయత్నించారు. అలా బిగ్ బాస్ ప్రోమో ఆసక్తికరంగా ముగిసింది.

Related News

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Divvela Madhuri: నా రాజాను వదిలి ఉండలేను.. కానీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీ పై మాధురి క్లారిటీ!

Bigg Boss 9 wildcard : వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ వీళ్లే.. ఇక హౌస్‌లో రచ్చ రచ్చే!

Bigg Boss 9 Promo: నామినేషన్స్‌లో రచ్చ రచ్చ.. కోడిగుడ్డుపై ఈకలు పీకుతా.. శ్రీజపై మాస్క్ మ్యాన్ ఫైర్

Bigg Boss 9: ఎన్టీఆర్ షోలో మర్యాద మనీష్.. గుండు సీక్రెట్ రివీల్ చేస్తూ!

Bigg Boss Telugu 9: సంజన సీక్రెట్ బయటపెట్టి షాకిచ్చిన మనీష్.. వరస్ట్ ప్లేయర్ శ్రీజ, ప్రియకు బిగ్ బాంబ్!

Big Stories

×