BigTV English

NTRNeel: వీడి కంట పడితే నీడకైనా చెమటలే.. ఎన్టీఆర్ కు ట్రిబ్యూట్ ఇచ్చిన కెజిఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్

NTRNeel: వీడి కంట పడితే నీడకైనా చెమటలే.. ఎన్టీఆర్ కు ట్రిబ్యూట్ ఇచ్చిన కెజిఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్

NTRNeel: మ్యాన్  ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కు తెలుగులో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో కర్ణాటకలో కూడా అంతే ఫ్యాన్స్ ఉన్నారు. ఇక చెప్పాలంటే.. కర్ణాటకు ఎన్టీఆర్ కు విడదీయలేని బంధం ఉంది. ఎందుకంటే.. ఎన్టీఆర్ తల్లి షాలిని  సొంత ఊరు కర్ణాటకలోనే ఉంది.


ఇక ఈ మధ్యనే తన తల్లి కోరికను నెరవేర్చడానికి ఎన్టీఆర్.. ఉడుపిలోని ప్రసిద్ధ శ్రీకృష్ణుడి ఆలయాన్ని  దర్శించుకున్న విషయం తెల్సిందే. ఆ సమయంలో ఎన్టీఆర్ తో పాటు  కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి, దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఉన్నారు. ఇకపోతే ఆ దర్శనానంతరం .. ఎన్టీఆర్, మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్ స్టూడియోను విజిట్ చేశాడు.

ఎన్టీఆర్ మొదటిసారి.. తన మ్యూజిక్ స్టూడియోకు రావడంతో   ఉబ్బితబ్బిబైపోయిన రవి బసూర్.. ఆ మూమెంట్ ను చిరకాలం గుర్తిండిపోయేలా   ఒక అద్భుతమైన పని చేశాడు. ఎన్టీఆర్ పై ఒక సాంగ్ రాసి.. దాన్ని తారక్ కు ట్రిబ్యూట్ చేశాడు.


ఎన్టీఆర్, స్టూడియో కు రావడం దగ్గర నుంచి వెళ్లేవరకూ  తీసిన వీడియోకు ఆ సాంగ్ ను ఎటాచ్ చేసి అభిమానాలతో షేర్ చేసుకున్నాడు. ఇక ఒక నిమిషం 4 సెకన్ల ఉన్న వీడియోకు ఆ లిరిక్స్  అయితే పర్ఫెక్ట్  గా సెట్ అయ్యాయి. ఎన్టీఆర్ అనే పేరును ఉపయోగిస్తూ లిరిక్స్ లోనే ఎలివేషన్స్ తో అదరగొట్టేశాడు.

” వీడు నడిచే దారి మంట రేపే ఇప్పుడే.. వీడి కంట పడితే నీడకైనా చెమటలే.. వీడు మాకే సొంతం, వీడు మాకే మొత్తం. వీడి పేరు వింటే తుఫానుకే దడ పుట్టే.. వీడు కాలే వజ్రం .. అన్నింటికన్నా విలువ అంతే.. ఎన్టీఆర్” అంటూ సాగిన లిరిక్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.  ఇవే  లిరిక్స్ కనుక ఎన్టీఆర్  నీల్ సినిమాలో ఉంటే  జనాలు థియేటర్ లో పూనకాలతో పోవడం ఖాయమని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరి ఈ సాంగ్ డ్రాగన్ సినిమాలో ఉంటుందో  లేదో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×