E-Paper
Advertisement

Vijay Deverakonda: పబ్లిక్‌లో విజయ్ దేవరకొండ బూతులు.. మధ్యలో నితిన్ ఏం చేశాడు బ్రో..?

Vijay Deverakonda: పబ్లిక్‌లో విజయ్ దేవరకొండ బూతులు.. మధ్యలో నితిన్ ఏం చేశాడు బ్రో..?
Advertisement
Vijay Deverakonda
Vijay Deverakonda

Vijay Deverakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ – మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. ఈ చిత్రం ఏప్రిల్ 5న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. గీతాగోవిందం మూవీ దర్శకుడు పరశురాం ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మూవీ యూనిట్ నిర్వహించింది.

ఈ ఈవెంట్‌లో భాగంగా విజయ్ దేవరకొడ మాట్లాడిన ఓ మాట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. పబ్లిక్‌లో ఏంటా మాటలు అంటూ విజయ్‌పై ఫైర్ అవుతున్నారు. అయితే మరి విజయ్ అంతలా ఏం మాట్లాడాడో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భాగంగా విజయ్.. హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌ని బైక్ ఎక్కుంచుకుని వెళ్లే క్రమంలో ఎదురుగా కొందరు ఉంటారు. ఆ టైంలో ‘ అరేయ్ జరగండి రా నీ యబ్బా’ అని మాట్లాడాడు.

Advertisement

ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేసి.. పబ్లిక్‌లో ఇవే మాటలు బ్రో అంటున్నారు. అయితే కొందరు మాత్రం ‘మా తెలంగాణ వాళ్లకి అది నార్మాలే బ్రో’ అని అంటుండగా.. ఇంకొందరు మాత్రం మండి పడుతున్నారు. మిగతా హీరోస్ ఎందుకు ఆ పదాలు వాడటం లేదని కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇదే క్రమంలో హీరో నితిన్ పేరును ప్రస్తావించారు నెటిజన్లు.

Advertisement

విజయ్ వాడిన పదాలపై మాట్లాడుతూ.. హీరో నితిన్ వైపు వచ్చారు. హీరో నితిన్ కూడా తెలంగాణ వాడే కదా.. ఆ హీరో ఎందుకు అలాంటి పదాలు వాడరు అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా.. నితిన్‌కి తెలంగాణ స్లాంగ్ కూడా రాదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో మరికొందరెమో.. పబ్లిక్‌లో విజయ్ దేవరకొండ బూతులు మాట్లాడితే.. మధ్యలో నితిన్ ఏం చేశాడు బ్రో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏదీ ఏమైనా విజయ్ దేవరకొండ వాడిన పదాలు ప్రస్తుతం సోషల్ మీడిలో దుమారం రేపుతున్నాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×