BigTV English

Vijaya Sai Reddy vs Vemireddy: వేమి సేతురా రెడ్డి?

Vijaya Sai Reddy vs Vemireddy: వేమి సేతురా రెడ్డి?


Nellore Politics Turn Into Centre Of Attraction: నెల్లూరు లోక్‌సభ సెగ్మెంట్ .. ఏపీ పాలిటిక్స్‌లో సెంటర్‌ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. గత ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీకి ప్రాతినిధ్యం లేకుండా చేసింది వైసీపీ.. అప్పుడు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి నెల్లూరు ఎంపీ స్థానం సహా పది అసెంబ్లీ స్థానాల్లో పార్టీ అభ్యర్ధులను గెలిపించుకోవడంలో కీలక పాత్ర పోషించారు. అలాంటి వేమిరెడ్డి ఈ సారి నెల్లూరు ఎంపీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీకి దిగారు.  ఆయనపై వైసీపీ విజయసాయిరెడ్డిని బరిలో దింపింది. తెర వెనుక మంత్రాంగం చేయడంలో దిట్టలైన ఆ ఇద్దరు ప్రత్యక్షరాజకీయాల్లో దిగడం ఇదే మొదటి సారి.. దాంతో వారు చేస్తున్న హడావుడితో సింహపురి ఎన్నికలు ఎక్కడా లేనంత కాస్ట్లీగా మారాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇది పెద్దారెడ్ల రాజకీయ అడ్డా నెల్లూరు జిల్లా.. దివంగత ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి దివంగత నేత నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి వంటి నేతలు నెల్లూరు జిల్లా నుంచి రాష్ట్రస్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పారు. రెడ్డి పాలిటిక్స్‌కి పెట్టింది పేరైన నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది. అప్పట్లో ఆ పార్టీలో ఉన్న కీలక నేతలు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, మాజీ మంత్రి అనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా అప్పట్లో జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న వేమిరెడ్డి అందరి విజయానికి అన్ని రకాలుగా అండగా నిలిచారన్న ప్రచారం ఉంది.


Also Read: పెండింగ్ సీట్లకు ఖరారు.. అభ్యర్థులపై ప్రకటన..!

అయితే తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో ఆ నలుగురు ఇప్పుడు టీడీపీలో చేరిపోయారు. వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి నెల్లూరు ఎంపీ అభ్యర్ధిగా పోటీకి దిగారు. నెల్లూరు సిటీ సీటు విషయంలో వేమిరెడ్డి ప్రతిపాదనల్ని వైసీపీ అధ్యక్షుడు పక్కన పడేయడంతో ఆయన ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి షాక్ ఇచ్చారు. వేమిరెడ్డికి ధీటైన నేత జిల్లాలో దొరక్క.. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని నెల్లూరు ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దింపాల్సి వచ్చింది వైసీపీకి.. అటు వేమిరెడ్డి, ఇటు విజయసాయిరెడ్డి ఇద్దరూ ప్రత్యక్షంగా ఎన్నికల బరిలోకి దిగడం ఇదే మొదటి సారి.

దాంతో పార్టీ ప్రతిష్టతో పాటు వ్యక్తిగతంగా కూడా ఆ ఇద్దరు భిగ్‌షాట్‌లకు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఆ క్రమంలో నెల్లూరు ఎంపీగా ఎవరు గెలుస్తారన్నది ఉత్కంఠభరితంగా తయారైంది. విజయసాయిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు కొత్త అయినా. రాష్ట్రస్థాయిలో వైసీపీ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాల అమలులో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. వైసీపీ అధికారంలోకి రావడంలో తనవంతు పాత్ర పోషించారు. ఊహించని విధంగా నెల్లూరు బరిలో దిగాల్సి రావడంతో.. విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. జగన్‌కి పర్సనల్ ఆడిటర్ అయిన ఆయన.. పక్కా లెక్కలతో అన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారంట.

ఇక తన సతీమణి ప్రశాంతి రెడ్డికి నెల్లూరు సిటీ వైసీపీ టికెట్ ఆశించిన వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి.. అది దక్కకపోవడంతో టీడీపీలో చేరి నెల్లూరు ఎంపీ అభ్యర్ధిగా పోటీకి దిగారు. వేమిరెడ్డి వైసీపీని వీడటంతో జిల్లా పొలిటికల్ ఈక్వేషన్లు ఒక్కసారిగా మారిపోయాయి. వేమిరెడ్డిని టీడీపీలో చేర్చుకోవడానికి చంద్రబాబునాయుడు స్వయంగా నెల్లూరు వచ్చారంటే ఆయనకు జిల్లాలో ఉన్న ప్రాముఖ్యత అర్థమవుతుంది. ల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో వైసీసీని గెలిపించడంలో కీరోల్ పోషించిన ఆయన ఈ సారి కోవూరు టీడీపీ టికెట్ తన భార్య ప్రశాంతిరెడ్డికి దక్కించుకున్నారు.

దంపుతులు ఇద్దరు తమతో పాటు జిల్లాలో టీడీపీ విజయంపై ధీమాతో కనిపిస్తున్నారు. వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ప్రశాంతి రెడ్డి , వేమిరెడ్డి, విజయసాయిల మధ్య పోటీ ఇప్పుడు రెండు పార్టీల్లో ఉత్కంఠ రేపుతోంది. వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్లని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తనతో పాటు జిల్లాలోని పది అసెంబ్లీ సెగ్మెంట్లలో టీడీపీ అభ్యర్ధుల విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పావులు కదుపుతున్నారు. ఆ క్రమంలో టీడీపీతో పాటు జనసేన, బీజేపీ శ్రేణులు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఆయన వెంట నడుస్తున్నాయి. వైసీపీ నేతలు ఆయన పర్సనల్ లైఫ్‌ని టచ్ చేస్తూ కామెంట్ చేస్తుండటం ఆయనకు ప్లస్‌గా మారుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Also Read: వై నాట్ సునీత..? ఆసక్తికరంగా కడప రాజకీయం..

వేమిరెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు ఆయన్ని ఆరాధ్యదైవంలా చూసిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కోవూరులో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రత్యర్ధిగా మారగానే ఆ దంపతులను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు.తనపై ప్రసన్నకుమార్ చేసిన వ్యాఖ్యలకు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వివరణ ఇవ్వడంవేమిరెడ్డి దంపతులపై జనంలో సానుభూతి పెంచినట్లు అయిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రసన్నకుమార్‌రెడ్డి రేపిన రచ్చ తనకు మైనస్‌గా మారుతుందని గ్రహించిన విజయసాయిరెడ్డి ఆయనకు గట్టిగా క్లాస్ పీకారంటున్నారు.

లాగైనా గెలవాలని పట్టుదలగా ఉన్న విజయసాయి ప్రత్యర్ధిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ప్రతి సందర్భంలోనూ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వైసీపీకి నమ్మకద్రోహం చేశారని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మడి జిల్లాలో గత ఎన్నికల ఫలితాల్ని రిపీట్ చేయడానికి తనదైన స్టైల్లో పావులు కదుపుతున్నారు. జేపీతో పొత్తును ఫోకస్ చేస్తూ ముస్లిం ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తమ్మీద అటు వేమిరెడ్డి, ఇటు విజయసాయిలు ప్రత్యక్షంగా చేస్తున్న ప్రచారం కంటే తెరవెనుక మంత్రాంగమే ఎక్కువ నడుస్తోందంట. రి ఈ బిగ్‌షాట్‌లలో ఎవరు సింహపురి పీఠాన్ని అధిరోహిస్తారో చూడాలి.

Tags

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×