BigTV English

డైరెక్ట్ గా ఓటీటీలోకి ఆది థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

డైరెక్ట్ గా ఓటీటీలోకి ఆది థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Thriller Movie In OTT : టాలీవుడ్ నటుడు సాయి కుమార్ కొడుకు ఆది సాయికుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. గతంలో ఆయన కొన్ని సినిమాలు చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ మధ్య సరైన హిట్ సినిమా పడలేదు. దాంతో సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకొని సరికొత్త కథతో క్రైమ్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆది ప్రస్తుతం సబ్ ఇన్‌స్పెక్టర్ యుగంధర్ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అవ్వడం లేదు. డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ స్టోరీ ఏంటి? ఏ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు రాబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం..


ఆది సాయికుమార్ ప్రేమ కావాలి మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత లవ్‌లీ, సుకుమారుడు, ప్యార్ మే పడిపోయానే, నెక్ట్స్ నువ్వే, రఫ్, చుట్టాలబ్బాయ్, తీస్ మార్ ఖాన్, శశి, క్రేజీ ఫెలో, జోడీ, ఆపరేషన్ గోల్డ్ ఫిష్, బుర్రకథ వంటి అనేక సినిమాల్లో నటించాడు ఆది సాయి కుమార్. వాటిలో శశి, లవ్‌లీ మినహా మిగతావన్నీ పెద్ద హిట్ సాధించలేకపోయాయి. కాబట్టి, ఒక మంచి హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు.. ప్రస్తుతం ఈయన హీరోగా రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ రెండు మూవీసే శంభాల, సబ్‌ ఇన్‌స్పెక్టర్ యుగంధర్. వీటిలో సబ్ ఇన్‌స్పెక్టర్ యుగంధర్ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కానుందని తెలుస్తోంది.. ఇటీవలే పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ మూవీ తాజాగా ఓటీటీ లో రానున్నట్లు ప్రకటించారు.

ప్రముఖ ఓటీటీ సంస్థ సాయి కుమార్ బర్త్ డే సందర్భంగా ఓ పోస్టర్‌‍తో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపుతూ సబ్ ఇన్‌స్పెక్టర్ యుగంధర్ మూవీ పోస్టర్‌ను ఈటీవీ ఓటీటీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.. ఈ సబ్ ఇన్‌స్పెక్టర్ యుగంధర్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఇక సబ్ ఇన్‌స్పెక్టర్ యుగంధర్ మూవీ క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కునుందని సమాచారం. ఇంకా షూటింగ్ పూర్తి కానీ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ మూవీ గురించి థియేటర్‌లో రిలీజ్ కాకముందే ఈటీవీ విన్ ప్రకటించడంతో మూవీ నేరుగా ఓటీటీ లోకి రాబోతుందని సమాచారం.. సబ్ ఇన్‌స్పెక్టర్ యుగంధర్ ఓటీటీ రైట్స్‌ను ఈటీవీ విన్ ముందుగానే కొనుగోలు చేసినట్లు అర్థం చేసుకోవచ్చు.. ఇకపోతే ఈ మూవీకి యశ్వంత్ దర్శకత్వం వహించగా.. ప్రణవ్ గిరిధరన్ సంగీతం అందించారు.. శ్రీ పినాక మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రదీప్ జూలురు నిర్మిస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్ యుగంధర్ సినిమాలో ఆది సాయి కుమార్‌కు జోడీగా మేఘా లేఖా హీరోయిన్‌గా నటిస్తోంది.. ఇక రాకేందు మౌళి, లావణ్య సాహుకార తదితరులు నటిస్తున్నారు.. ఇక త్వరలోనే సినిమాను పూర్తి చేసి ఓటీటీ రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారని సమాచారం.. ఇటీవల ఆది కి ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. ఈ మూవీ పై ఆశలు పెట్టుకున్నాడు. మరి మూవీ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×