Jr. NTR: ఈ మధ్యకాలంలో హీరోల అభిమానులు ఏం చేయడానికైనా సిద్ధం అవుతున్నారు. ముఖ్యంగా హీరోలను ఆకాశానికి ఎత్తేయడంలో ముందుంటున్నారు. మరొకవైపు కష్టం వస్తే ఆదుకుంటారని, తమ అభిమాన హీరో వస్తాడని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు కూడా.. అయితే తమకు కష్టం వస్తే.. అభిమాన హీరో సహాయం చేస్తాడా? లేదా? అనే విషయం పక్కన పెడితే.. ఒకవేళ హీరో మరిచిపోయి.. సహాయం చేయకపోతే అభిమానులు పెద్దగా పట్టించుకోరు కానీ పక్క వారు మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తారు. ముఖ్యంగా యాంటీ ఫ్యాన్స్ ఆ హీరో సహాయం చేయలేదని, సహాయం చేస్తానని మాట ఇచ్చి తప్పాడు అని రకరకాల కామెంట్లు చేస్తారు. ఇప్పుడు ఇదే విషయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.NTR)విమర్శలు ఎదుర్కొంటున్నారు. కౌశిక్ అనే క్యాన్సర్ బారిన పడిన యువకుడికి సహాయం చేస్తానని చెప్పి, ఇప్పుడు మాట తప్పాడని బాధిత యువకుడి తల్లి సరస్వతి ఆరోపణలు చేసింది. దీంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది. అయితే పెద్ద ఎత్తున ఈ విషయాలు వైరల్ గా మారడంతో ప్రముఖ తెలుగు హీరోయిన్ మాధవి లత (Madhavi Latha) స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఆశించేవాళ్లు అభిమానులు ఎలా అవుతారు..
ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని అయిన కౌశిక్ క్యాన్సర్ తో పోరాడుతూ ఉండగా.. అతడి కోరిక మేరకు గతంలో ఎన్టీఆర్ వీడియో కాల్ మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన సహాయం చేస్తానని మాట ఇచ్చి ఇప్పుడు స్పందించడం లేదని కౌశిక్ తల్లి సరస్వతి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో హీరోయిన్ మాధవి లత తీవ్రంగా మండిపడ్డారు.” ఈ రకంగా అభిమానులకు హీరోలు డబ్బులు ఇచ్చుకుంటూ పోతే అడుక్కు తినాలి.. ఆశించే వాళ్ళు అభిమానులు ఎలా అవుతారు?” అంటూ ఆమె ప్రశ్నించింది.. దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొంతమంది మాధవి లతకు సపోర్టుగా నిలుస్తూ.. మీరు చెప్పింది నిజమే.. హీరోలందరూ అభిమానులకు లక్షల రూపాయలను దానం చేస్తూపోతే చివరికి వాళ్ళు అడుక్కుతినాల్సిందే అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
క్యాన్సర్ పేషెంట్తో వీడియో కాల్ లో మాట్లాడిన ఎన్టీఆర్.
ఇకపోతే కౌశిక్ అనే ఒక క్యాన్సర్ పేషెంట్ తన అభిమాన హీరో ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా విడుదల అయ్యే వరకైనా తనను బ్రతికించండి అంటూ వేడుకున్నారు. దీంతో ఈ విషయం కాస్త ఎన్టీఆర్ అభిమాన సంఘానికి తెలియడంతో వారు ఆయనను సంప్రదించి నేరుగా వీడియో కాల్ మాట్లాడించారు. ఇక అప్పుడు సహాయం చేస్తానని మాట ఇచ్చారట. కానీ ఇప్పుడు ఆ మాట తప్పారని కౌశిక్ తల్లి సరస్వతి ఆరోపణలు చేసింది. దీనికి తోడు ప్రస్తుతం కౌశిక్ చెన్నై లోని అపోలో హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. 12 లక్షల రూపాయలు చికిత్స నిమిత్తం ఫీజు చెల్లించాల్సి ఉంది. అయితే ఎన్టీఆర్ సహాయం చేస్తానని చెప్పి ఇప్పటివరకు ఎలాంటి సహాయం చేయలేదు.. ఆ డబ్బు తాము కట్టలేమని సరస్వతి కామెంట్లు చేసింది.