BigTV English

TTD Darshnam: శ్రీవారి దర్శనం కేవలం రెండు గంటల్లో, అదెలా సాధ్యం?

TTD Darshnam: శ్రీవారి దర్శనం కేవలం రెండు గంటల్లో, అదెలా సాధ్యం?

TTD Darshnam: తిరుమల శ్రీవారి దర్శనమంటే మహాభాగ్యమంటారు భక్తులు. ఆయన్ని దర్శించుకుంటే పాపాలు తొలగిపోతాయనేది వారి ప్రగాఢ నమ్మకం.. విశ్వాసం కూడా. అందుకే గంటల తరబడి క్యూ లైన్‌లో వేచి చూస్తారు. ఇకపై గంటల తరబడి లైన్‌లో నిలబడాల్సిన పనిలేదు. కేవలం గంట లేదా రెండు గంటల్లో శ్రీవారి దర్శన భాగ్యం కలగనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు చకచకా చేస్తోంది టీటీడీ.


భక్తుల దర్శనం కోసం కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆర్ఠిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఈ ప్రక్రియ పూర్తికానుంది. అదెలా సాధ్యమనుకుంటున్నారా ?  అక్కడికే వచ్చేద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దర్శన టోకెన్ పొందడమన్నమాట.

ఏఐ ఆధారంగా రూపొందిన ఫేస్ రిగక్నైజేషన్ మిషన్ లేదా కియోస్కి వద్ద ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే, మన ఫేస్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఆ మిషన్ దర్శనం స్లిప్‌ను జనరేట్ చేస్తోంది. దాన్ని తీసుకుని వైకుంఠం క్యూ క్లాంపెక్స్‌లో ఫేస్ రికగ్నిషేన్ ఎంట్రీ పద్దతి ద్వారా ప్రవేశించవచ్చు.


దీనికి సంబంధించిన డెమోని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యులు, ఈవో కలిసి తిలకించారు. డెమో పూర్తి అయినట్టు టీటీడీ ఛైర్మన్ ఎక్స్ ద్వారా పేర్కొన్నారు. అందుకు  సంబంధించిన డీటేల్స్ వెల్లడించారు. టీటీడీలో భక్తుల దర్శనం కోసం టెక్నాలజీ వినియోగిస్తారన్న విషయం తెలియగానే రెండుమూడు కంపెనీలు ఆసక్తి చూపాయని తెలిపారు.

ALSO READ: మూడేళ్లలో ఏపీ రాజధాని రెడీ.. రాజధాని వాసులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

వారు రెడీ చేసిన ఏఐ మిషన్‌ పని చేసిన విధానాన్ని ఛైర్మన్‌తోపాటు బోర్డు సభ్యులు తిలకించారు. ప్రస్తుతం డెమో ఇచ్చిన రెండు కంపెనీలు 14 దేశాల్లో సేవలందిస్తున్నారు. వీళ్లతోపాటు పలు సంస్థలు ముందుకొస్తున్న నేపథ్యంలో భక్తులకు అనుకూలమైన విధానాన్ని ఓకే చేసి, శ్రీవారి దర్శనాన్ని సులభతరం చేయనున్నట్లు చెప్పుకొచ్చారు.

టీటీడీ కొత్త టెక్నాలజీని వినియోగించడానికి కారణాలు చాలానే ఉన్నాయి. దర్శనం పేరిట గంటల తరబడి భక్తులను క్యూ కాంప్లెక్స్‌లో బంధించడం మంచిది కాదన్నది ఛైర్మన్ మాట. ఆ సమయంలో సమీపంలోని ప్రాంతాలను భక్తులు చూడటానికి అనుకూలంగా ఉంటుందని గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.

తిరుమలలో మిగతా ప్రాంతాలను చూశామన్న ఆనందం భక్తులకు కలుగుతుందన్నారు. తిరుమలకు వచ్చి అన్ని చూశామన్న భావనతో భక్తులు ఇంటికి హ్యాపీగా వెళ్లాలన్నదే తమ కోరికగా చెప్పుకొచ్చారు. టెక్నాలజీ ఉపయోగించడం వల్ల భక్తుల దర్శనాలు పెరుగుతాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో తొలిసారి జరిగిన బోర్డు సమావేశంలో దీనిపై చర్చించి తీర్మానం చేశారు.

వివిధ కంపెనీలకు సంబంధించి డెమోను తిలకిస్తున్నారు. అందులో సరైన దానిని ఎంపిక చేసి అప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. అంతా ఓకే అయిన తర్వాత కొద్దిరోజులపాటు పరిశీలిస్తారు. ఎలాంటి సమస్య లేకుండా ఉంటే ఆ తరహా విధానాన్ని అమల్లోకి తీసుకురావచ్చు. ఎలాగ లేదన్నా శివరాత్రి నాటికి  టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావచ్చని భావిస్తున్నారు.

 

 

Related News

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

AP Rains: ఏపీ వాసులకు అలర్ట్.. రాగల 3 గంటల్లో పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

GST Official Suspended: సోషల్ మీడియా పోస్ట్ తో ఉద్యోగం ఊడింది.. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు

Prakasam District: గిద్దలూరులో విషాదం.. బాత్రూంలో డెలివరీ.. బకెట్లో శిశువును పడేసి.. పరారైన తల్లి

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

Big Stories

×