BigTV English

Aarti Ravi : పక్కా ప్రూఫ్ లతో మాట్లాడుతున్న.. ఆర్తి మరో పోస్ట్..

Aarti Ravi : పక్కా ప్రూఫ్ లతో మాట్లాడుతున్న.. ఆర్తి మరో పోస్ట్..

Aarti Ravi : తమిళ స్టార్ హీరో జయం రవి ఆయన భార్యతో విడాకులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తన భార్య మాత్రం తనకి ఏ విషయం చెప్పకుండానే విడాకులు ప్రకటించారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. జయం రవి కావాలనే విడాకులు ప్రకటించేసాడు ఆ తర్వాత పిల్లల్ని కూడా పట్టించుకోవట్లేదని ఆమె ఇటీవల పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. ఆ పోస్టు సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అయింది. ఆ తర్వాత ఆమె తల్లి కూడా జయం రవి పై ఆరోపణలు చేసింది. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో ఆమె ఏమి రాసిందో ఒకసారి చూసేద్దాం..


మరో పోస్ట్ తో క్లారిటీ ఇచ్చిన ఆర్తి.. 

జయం రవి ఆయన భార్య పార్టీకి విడాకులు ఇవ్వబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇంకా విడాకులు తీసుకున్నారో లేదో క్లారిటీగా తెలియదు.. కానీ జయం రవి మాత్రం మరో అమ్మాయితో ఫంక్షన్లకు, ఫ్యామిలీ ఈవెంట్లకు హాజరవుతూ వస్తున్నారు.  ప్రముఖ కోలీవుడ్ సింగర్ కెనిషా తో ఆయన రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య వీరిద్దరూ కలిసి బయట తిరుగుతుండడంతో రిలేషన్ కన్ఫామ్ అని తెలిసిపోతుంది. జయం రవి భార్య ఆర్తి తన పిల్లలకి అన్యాయం చేస్తున్నాడంటూ మొన్న ఒక పోస్ట్ రిలీజ్ చేసింది. తాజాగా సోషల్ మీడియాలో మరో పోస్ట్ చేసింది. అందులో మేము విడిపోవడానికి కారణం మనీ, పవర్‌లాంటివి కాదు. మూడో వ్యక్తే కారణం. అయితే ఈ విషయాన్ని ఊహించి చెప్పడం లేదు. నా వద్ద ఆధారాలున్నాయి” అని అన్నారు. అయితే ఈ పోస్ట్ పై జయం రవి ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి..


జయం రవి ఆర్తి ఆరోపణల పై ఏం అన్నారంటే..? 

మొన్న ఆర్తి పెట్టిన పోస్టు పై ఇప్పుడు హీరో రవి స్పందించి దాదాపు నాలుగు పేజీల లేఖ రిలీజ్ చేశాడు. భార్య తనపై చేసిన ఆరోపణలను ఖండించారు. అంతేకాకుండా నా వృత్తి రిత్యా బాహ్య ప్రపంచానికి దూరంగా, మౌనంగా ఉంటున్నానని తెలిపారు. ఇంకా ఆయన తన లెటర్‌లో నా గత వివాహ బంధాన్ని వ్యక్తిగత లాభం కోసం, సానుభూతిగా మార్చుకోవడాన్ని నేను అంగీకరించను, చట్ట ప్రకారం చనడుచుకుంటాను, సత్యం ఎప్పటికైనా గెలుస్తుందని అన్నారు.. నాకు కన్న తల్లిదండ్రులను కూడా కలవలేక పోతున్నాను నేను ఎంత బాధ అనుభవించానో మీరే అర్థం చేసుకోండి అంటూ జయం రవి నాలుగు పేజీల పోస్టులో రాసుకొచ్చారు. మరి ఇప్పుడు ఆర్తి రాసిన మరో పోస్ట్ పై ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి… అందుతున్న సమాచారం ప్రకారం.. సింగర్ కెనీషా తో జయం రవి త్వరలోనే పెళ్లి పీటలు లేకపోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×