E-Paper
Advertisement

Geethu Royal: నాపై చర్యలు తీసుకుంటారట… జీవితమే నాశనమైంది.. గీతూ రాయల్ ఎమోషనల్!

Geethu Royal: నాపై చర్యలు తీసుకుంటారట… జీవితమే నాశనమైంది.. గీతూ రాయల్ ఎమోషనల్!
Advertisement

Geethu Royal: బిగ్ బాస్ ఫేమ్ గీతు రాయల్ (Geethu Royal)వివాదంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈమె సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు .ఈ తరుణంలోనే వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఈమె తిరుమల వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల తన టీంతో కలిసి గీతూ తిరుమల వెళ్ళిన సంగతి తెలిసిందే .అయితే వారిలో ఒక్కరికి టోకెన్ లభించకపోవడంతో వీరు తిరుమల ఆలయ పరిసర ప్రాంతాలలో రీల్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. తిరుమలలో రీల్స్ నిషేధం అయినప్పటికీ ఇటీవల యూట్యూబర్స్ వ్యూస్ కోసం నిషేధిత ప్రాంతాలలో కూడా రీల్స్ చేస్తూ వివాదంలో చిక్కుకుంటున్నారు. ఇక గీతూ రాయల్స్ సైతం తిరుమలలో రీల్స్ నిషేధం అని తెలిసినప్పటికీ నిబంధనలను ఉల్లంఘిస్తూ తన టీంతో కలిసి వీడియోలు చేశారు.

చర్యలు తీసుకుంటారట.. సంతోషంగా ఉండండి..

ఇలా ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈమెపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో గీతు వెంటనే ఆ వీడియోలను డిలీట్ చేస్తూ తనదైన శైలిలోనే వివరణ ఇచ్చుకున్నారు. అయితే ఈమెపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో గీత రాయల్ మరొక వీడియోని విడుదల చేశారు. ఇందులో భాగంగా ఈమె మాట్లాడుతూ అందరికీ గుడ్ న్యూస్.. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండండి నాపై చర్యలు తీసుకుంటారట. ఇక అందరూ సంతోషమే కదా జీవితమే నాశనం అయిపోయింది అంటూ ఎమోషనల్ అయ్యారు.

ఆల్రెడీ జీవితం నాశనమైంది..

Advertisement

ఇంత చిన్న విషయాన్ని ఇంత పెద్దది చేసి ఎన్నో వీడియోలు చేసినందుకు థాంక్యూ సో మచ్.ఆల్రెడీ సగం జీవితం పోయింది. ఇక పోవడానికి కూడా ఏమీ లేదు. నా జీవితంలో ఏదో కొద్దో గొప్ప మిగిలి ఉంటే దాన్ని కూడా మీరు పోగొట్టేసేయండి. తర్వాత అందరూ ప్రశాంతంగా ఉండండి హ్యాపీగా బతికేయండి అంటూ ఈమె వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్ లు స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ వివాదంపై ఇదివరకు కూడా ఒక వీడియోని షేర్ చేసారు. తాను గతంలో దేవుడిని నమ్మేదాన్ని కాదు కానీ నా విషయంలో జరిగిన ఒక సంఘటన కారణంగా సనాతన ధర్మాన్ని నా రక్తంలోకి ఎక్కించుకున్నాను.

?igsh=MXB2cnR5Y29pOTZzYQ%3D%3D

Advertisement

నేను తిరుమలలో ఒక వీడియో చేసినంత మత్రాన దేవుడిపై నమ్మకం లేనట్టు కాదు అంటూ తన జీవితంలో జరిగిన సంఘటన గురించి ఈమె చెబుతూ ఎమోషనల్ అయ్యారు. తాజాగా మరొక వీడియోని షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. మరి గీతూ షేర్ చేసిన ఈ వీడియోతో ఈ వివాదానికి పులిస్టాప్ పడుతుందా లేదంటే టీటీడీ ఈమెపై చర్యలు తీసుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది. ఇటీవల కాలంలో ఎంతో మంది సెలెబ్రెటీలు, యూట్యూబర్స్ తిరుమలలో రీల్స్ చేస్తూ వివాదాలలో నిలిచారు. మరి ఇలాంటి విషయాలపై టీటీడీ ఇప్పటికైనా పటిష్టమైన భద్రత చర్యలను తీసుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Actress Hari Teja: అల్లు అర్జున్ కోసం 15 రోజులు భోజనం మానేసిన నటి.. ఎందుకంటే?
 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×