E-Paper
Advertisement

Akash Puri: పేరు మార్చుకున్నా.. ఫేట్ మారుతోందా.. ?

Akash Puri: పేరు మార్చుకున్నా.. ఫేట్ మారుతోందా.. ?
Advertisement

Akash Puri: డేరింగ్ అండ్ డ్యాషింగ్ పూరి జగన్నాథ్ నట వారసుడుగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు ఆకాష్ పూరి. ఆంధ్రాపోరి అనే సినిమాతో టాలీవుడ్ కు హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆకాష్ కు ఆశించిన ఫలితం దక్కలేదు. ఆ తరువాత వరుసగా.. మెహబూబా, రొమాంటిక్, చోర్ బజార్ లాంటి సినిమాల్లో నటించినా ఆకాష్ కు మాత్రం హీరోగా గుర్తింపు రాలేదు.

ఇంకోపక్క పూరికి సైతం కొడుకును హీరోగా నిలబెట్టలేకపోతున్నానే అనే బాధకూడా ఉంది. ఇక ఈ మధ్యకాలంలోనే కాదు.. మొదటినుంచి కూడా ఇండస్ట్రీలో పేరు కలిసి రాకపోతే కొత్త పేరు పెట్టుకోవడమో.. లేక పేరులో అక్షరాలను మార్చుకోవడమో, లేక కలుపుకోవడమో చేస్తుంటారు.తాజాగా ఆకాష్ పూరి కూడా పేరు మార్చుకున్నట్లు అధికారికంగా తెలిపాడు.

Advertisement

నేడు అతని పుట్టినరోజు కావడంతో తన పేరును మార్చుకోవడంతో పాటు.. ఇకనుంచి తన స్క్రీన్ నేమ్ కూడా అదే అని చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకు ఆకాష్ ఇంటి పేరు అయిన పూరిని యాడ్ చేసి ఆకాష్ పూరి అని ఉండేది. ఇక ఇప్పుడు ఇంటిపేరును పక్కనపెట్టి తండ్రిపేరు అయిన జగన్నాథ్ ను యాడ్ చేసుకొని ఆకాష్ జగన్నాథ్ గా మార్చుకున్నట్లు తెలిపాడు.

ఇకనుంచి తన ప్రతి సినిమాలో ఆకాష్ జగన్నాథ్ అనే ఉండబోతుంది. ఇక దీంతో నెటిజన్స్.. పేరు మార్చుకున్నా.. ఫేట్ మారుతోందా అని అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆకాష్ కొన్ని సినిమా కథలను వింటున్నాడట. త్వరలోనే ఒక కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. మరి పేరు మార్చుకున్నాక ఆకాష్ ఫేట్ ఎలా ఉండబోతుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×