BigTV English

Xiaomi 14 Civi Limited Edition: షియోమీ నుంచి కొత్త ఫోన్.. 29 న లాంచ్.. లుక్ సూపర్!

Xiaomi 14 Civi Limited Edition: షియోమీ నుంచి కొత్త ఫోన్.. 29 న లాంచ్.. లుక్ సూపర్!

Xiaomi 14 Civi Limited Edition: డ్యూయల్ టోన్ డిజైన్‌తో షియోమీ కొత్త స్మార్ట్‌ఫోన్ దేశీయ మార్కెట్‌లో సందడి చేయడానికి వస్తోంది. కంపెనీ తన బ్రాండ్ నుంచి Xiaomi 14 Civi లిమిటెడ్ ఎడిషన్ విడుదల చేయనుంది. ఈ ఫోన్ వచ్చే వారం భారతదేశంలో లాంచ్ కానుంది. షియోమీ ఫోన్ మైక్రోసైట్‌ ఇప్పటికే కంపెనీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో లైవ్ అవుతుంది. దీనిలో దాని లాంచ్ తేదీ, డిజైన్‌ను చూడొచ్చు. కొత్త పాండా డిజైన్‌తో స్మార్ట్‌ఫోన్ మైక్రోసైట్‌లో టీజ్ చేశారు.


ఇది జూన్‌లో మార్కెట్‌లోకి వచ్చిన Xiaomi 14 Civi వెర్షన్‌కు సమానమైన ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ Xiaomi Civi 4 ప్రో రీబ్రాండెడ్ వెర్షన్. దీన్ని ఇప్పటికే చైనాలో విడుదల చేశారు. స్మార్ట్‌ఫోన్ డ్యూయల్-టోన్ ఫినిషింగ్‌తో వస్తుంది. Xiaomi ఇండియా తన X పోస్ట్‌లో Xiaomi 14 Civi లిమిటెడ్ ఎడిషన్ ఫోన్‌ను జూలై 29 న భారతదేశంలో ప్రారంభించనున్నట్లు తెలిపింది.

Also Read: Jio Bharat J1 4G: జియో సంచలనం.. స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు చుక్కలే.. ధర మరీ ఇంత తక్కువా!


కంపెనీ పోస్ట్‌లో మైక్రోసైట్ లింక్‌ను కూడా అందించింది. రాబోయే వెర్షన్‌లో పాండా డిజైన్ ఉంటుందని మైక్రోసైట్‌లో క్లెయిమ్ చేస్తుంది. ఇది డ్యూయల్-టోన్ ఫినిషింగ్‌ను కలిగి ఉంటుంది. సగం మిర్రర్ గ్లాస్, సగం వేగన్ లెదర్. ఈ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్ బ్లూ, పింక్, వైట్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది.

Xiaomi 14 Civi లిమిటెడ్ ఎడిషన్‌లో 50-మెగాపిక్సెల్ ప్రొఫెషనల్ కెమెరా ఉంటుంది. ఇందులో మాస్టర్ సినిమా, మాస్టర్ పోర్ట్రెయిట్ వంటి మోడ్‌లు ఉంటాయి. ఫోన్‌లో డ్యూయల్ సెల్ఫీ AI కెమెరాలు ఉంటాయి. ఇందులో 32 మెగాపిక్సెల్‌ల రెండు ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి. ఫోన్ అన్ని కెమెరాలు 4K రికార్డింగ్ కెపాసిటీ కలిగి ఉంటాయి.

ఫోన్ 1.5K రిజల్యూషన్, 120 Hz రిఫ్రెష్ రేట్‌తో క్వాడ్-కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది HDR10+, Dolby Vision Atmosకి సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ నెక్స్ట్ జనరేషన్ Qualcomm  స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్‌తో వస్తుంది. 12GB RAM+ 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. షియోమీ 14 సివీ లిమిటెడ్ ఎడిషన్ 4700mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

ఇది 67W వరకు వైర్డ్ టర్బో ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ కేవలం 7.4 మిమీ సన్నగా ఉంటుంది. కేవలం 177 గ్రాముల బరువు ఉంటుంది. ఈ సెగ్మెంట్‌లో ఇది మొదటి ఫోన్. ఇది ఫ్లోటింగ్ క్వాడ్ కర్వ్‌తో వస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది దేశంలో స్టాండర్డ్ వెర్షన్  ధర 8GB + 256GB వేరియంట్‌కు రూ. 42,999, 12GB + 512GB వేరియంట్‌కు రూ. 47,999.

Related News

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls| స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Realme 15 Pro vs OnePlus Nord 5 vs Galaxy A55: రూ.40000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Amazon 75 Percent Sale: ఇల్లు తుడవడమా? రోబోతో చేయించండి.. Amazon Sale లో 75% తగ్గింపు!

Big Stories

×