E-Paper
Advertisement

Actor Bala: మూడో పెళ్లి చేసుకున్న నటుడు.. ఇకనైనా బాగుండాలి అంటూ కామెంట్స్

Actor Bala: మూడో పెళ్లి చేసుకున్న నటుడు.. ఇకనైనా బాగుండాలి అంటూ కామెంట్స్
Advertisement

Actor Bala Marriage: సినీ పరిశ్రమలో ఒకరిని ఇష్టపడి పెళ్లి చేసుకోవడం, అది వర్కవుట్ అవ్వకపోతే విడాకులు ఇచ్చి వేరే పెళ్లి చేసుకోవడం.. ఇదంతా చాలా కామన్‌గా జరిగేదే. అలాగే తాజాగా రెండో పెళ్లి నుండి విడాకులు తీసుకున్న ఒక నటుడు.. మూడో పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చాడు. అతడే బాలా. తమిళ, మలయాళ ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు సాధించుకున్నాడు ఈ నటుడు. అయితే ఇప్పటికీ ఈ నటుడికి మూడు పెళ్లిళ్లు అయ్యాయని, ఇది మూడో పెళ్లి అని తెలుస్తోంది. ముందుగా అమృత సురేశ్ అనే సింగర్‌ను పెళ్లి చేసుకున్న బాలా.. తర్వాత తనకు విడాకులు ఇచ్చి ఎలిజెబెత్ ఉదయన్ అనే డాక్టర్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు తనకు కూడా విడాకులు ఇచ్చేసి కోకిలను వివాహం చేసుకున్నాడు.

అన్నీ వార్తలే

Advertisement

బాలా (Bala).. తన బంధువు అయిన కోకిలను పెళ్లి చేసుకున్నాడు. కేరళలోని ఎర్నాకూలంలో ఉన్న పావకులం గుడిలో అక్టోబర్ 23 ఉదయం 8.30 గంటలకు ఈ వివాహం జరిగింది. కేవలం బంధువులు, కుటుంబ సభ్యుల సమక్షంలో బాలా.. కోకిలను వివాహం చేసుకున్నారు. అయితే ఈ పెళ్లిని రహస్యంగా చేసుకోవాలని ప్రయత్నించినా కూడా సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. కోకిల.. బాలా బంధువు అని వార్తలు వినిపిస్తున్నా దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. కోకిల (Kokila)కు మలయాళ భాష రాకపోవడమే ప్రేక్షకుల్లో అనుమానం కలిగేలా చేస్తుంది. తను తమిళ అమ్మాయి అని వార్తలు వస్తున్నాయి.

Also Read: ఈ విలన్ వెంకీ సొంత బావ అని మీకు తెలుసా.. ఎన్ని సినిమాల్లో నటించారంటే..?

Advertisement

దగ్గరుండి చూసుకుంది

కోకిలతో పెళ్లి తర్వాత మీడియాతో ముచ్చటించారు బాలా. ‘‘ఈ వైవాహిక జీవితం బాగుంటుందని ఆశిస్తున్నాను. ఈ విషయంలో నేను నమ్మకంగానే ఉన్నాను ఎందుకంటే తను నా బంధువే. ఈ సందర్భాన్ని మా అమ్మతో కలిసి సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నందుకు బాధపడుతున్నాను. మా అమ్మకు 74 ఏళ్లు. తన ఆరోగ్యం అంతగా బాలేదు. తనకు రావాలని ఉన్నా రాలేకపోయింది. నన్ను పెళ్లి చేసుకోవాలని కోకిల ఎన్నో ఏళ్ల నుండి కోరుకుంటుంది. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన వారందరికీ స్వాగతం. కోకిలకు మలయాళం రాకపోయినా కూడా గత ఏడాదిగా నా ఆరోగ్యం బాలేనప్పుడు తనే తోడుగా ఉండి నన్ను చూసుకుంది’’ అని బయటపెట్టాడు.

జైలుకు వెళ్లొచ్చాడు

కొన్నాళ్ల క్రితమే బాలాకు లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగింది. ఆ సమయంలో తన ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్స్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అదే సందర్భంలో తనకు తోడుగా ఉండడం కోసం ఎవరైనా ఉంటే బాగుండేది అని పలుమార్లు బాధపడ్డాడు. అంతే కాకుండా కోకిలతో పెళ్లి జరిగే కొన్నాళ్ల క్రితమే బాలాపై ఒక కేసు ఫైల్ అయ్యింది. తన మొదటి భార్య, సింగర్ అయిన అమృత సురేశ్.. బాలాపై ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియా ద్వారా తనను, తన కూతురిని ఇబ్బందులకు గురిచేస్తున్నాడని బాలాపై పోలిసులకు ఫిర్యాదు చేసింది అమృత సురేశ్. దీంతో కొన్నాళ్ల పాటు జైలు జీవితాన్ని కూడా గడిపాడు బాలా. రూ.50,000 జరిమానా విధించిన తర్వాత తనను పోలీసులు విడుదల చేశారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×