BigTV English

Pregnancy Tea: ఈ టీ మీరు గర్భం దాల్చే అవకాశాలను పెంచేస్తుంది, ప్రతిరోజూ తాగేందుకు ప్రయత్నించండి

Pregnancy Tea: ఈ టీ మీరు గర్భం దాల్చే అవకాశాలను పెంచేస్తుంది, ప్రతిరోజూ తాగేందుకు ప్రయత్నించండి
ప్రపంచవ్యాప్తంగా భార్యాభర్తలకు సంతానోత్పత్తి సమస్యలు ఎక్కువైపోతున్నాయి. ఎంతోమంది గర్భం దాల్చలేక ఆసుపత్రులు చుట్టూ తిరుగుతున్నారు. మగవారిలో స్పెర్మ్ నాణ్యత తగ్గడం, స్పెర్మ్ కౌంట్ తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే, మహిళల్లో ఎండోమెట్రియోసిస్, పిసిఒఎస్ వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. మీరు సహజంగా గర్భం దాల్చలేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటేజ… గర్భం దాల్చే అవకాశాలను పెంచుకోవడానికి సహజమైన పద్ధతులను ఆశ్రయించడమే మంచిది. అలాంటి వాటిల్లో ఒక ఆరోగ్యకరమైన టీ కూడా ఉంది. ఇది మీ పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి గర్బం దాల్చే అవకాశాలను పెంచుతుంది.


సంతానోత్పత్తి పోషకాహార నిపుణుడైన కార్మెన్ మెయిర్ చెబుతున్న ప్రకారం గర్భం దాల్చడానికి, ఆ గర్భాన్ని 9 నెలల పాటు ఆరోగ్యంగా నిర్వహించడానికి కొన్ని రకాల ఆహారాలను మెనూలో చేర్చుకోవాలని చెబుతున్నారు. అలాంటి వాటిల్లో రేగుట ఆకు ఒకటి. దీన్ని Nettele Leaf అని పిలుస్తారు. ఇది మీరు గర్భవతి కావడానికి అవసరమైన పోషకాలను తనలోనే దాచుకొని ఉంది. ఈ ఆకుల్లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలు కూడా లభిస్తాయి. ఇవి మీ పునరుత్పత్తి అవయవాలకు తక్షణగా నిలుస్తుంది. శక్తిని అందిస్తుంది. మీ గర్భాశయ కండరాలను బలోపేతం చేస్తుంది. అలాగే శరీరంలోని వ్యర్ధాలను బయటికి తొలగిస్తుంది.

రేగుట ఆకులు టీ
ఈ రేగుట ఆకులను వెతికి వాటితో టీ కాచుకొని తాగడం అలవాటు చేసుకోండి. ఈ ఆకులను నీళ్లలో వేసి బాగా మరిగించి వడకట్టి ఆ నీటిని తాగుతూ ఉండాలి. దీనివల్ల మీలో గర్భం ధరించే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. ఈ ఆకుల వల్ల ఇంకెన్నో ఉపయోగాలు ఉన్నాయి.


రేగుట ఆకులు ఉపయోగాలు
రేగుట ఆకులు సహజమైన యాంటీ హిస్టామైన్‌గా పనిచేస్తుంది. కాబట్టి తుమ్ము, దురదలు, జలుబు, జ్వరం వంటి లక్షణాలతో భయపడేవారు. ఈ రేగుట ఆకుల రసాన్ని తాగితే ఎంతో మంచిది. రేగుట ఆకుల్లో ఇనుము, మెగ్నీషియం, కాల్షియం వంటివి ఉంటాయి. కాబట్టి ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతాయి. రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తాయి. ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు వంటి వాటిని తగ్గించడంలో ఈ రేగుట ఆకుల్లోని సమ్మేళనాలు ఎంతో ఉపయోగపడతాయి. ప్రతిరోజు రేగుట ఆకులతో టీ చేసుకుని తాగడం అలవాటు చేసుకోండి. కొన్నాళ్లకే కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ నొప్పులు తగ్గడం మీరు గమనిస్తారు.

రేగుట మొక్కలు ఎక్కడ దొరుకుతాయి?
మూత్ర విసర్జన పనితీరు మెరుగుపరుచుకోవడానికి కూడా ఈ రేగుట ఆకులు ఉపయోగపడతాయి. ముఖ్యంగా మగవారు ఈ రేగుటూ ఆకుల టీని తాగడం వల్ల ప్రోస్ట్రేట్ గ్రంధి ఆరోగ్యంగా ఉంటుంది. దీని వల్ల వారికి ఎలాంటి మూత్ర విసర్జన సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే మధుమేహం ఉన్నవారికి కూడా ఈ రేగుట ఆకులు ఎంతో మేలు చేస్తాయి. ఇవి ఇన్సులిన్ సెన్సిటివ్ ని మెరుగుపరుస్తాయి. గ్లూకోజ్ శోషణను తగ్గించి రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడతాయి. కాబట్టి మధుమేహం ఉన్నవారికి ఈ రేగుట ఆకులు ఎంతో మేలు చేస్తాయి. ఫోటోలో చూపించిన ఆకుల ద్వారా బయట ఈ మొక్కలను గుర్తించండి. వీలైతే ఇంట్లోని పెంచుకోవడం ఎంతో ఉత్తమం. వీటిని ఔషధ గుణాలు గల మొక్కల జాబితాలోకి పరిగణిస్తారు. కాబట్టి ఆయుర్వేద నిపుణులకు ఈ మొక్కలు ఎక్కడ దొరుకుతాయో తెలిసే అవకాశం ఉంటుంది.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×