Marco Movie :ప్రముఖ మలయాళ హీరో ఉన్ని ముకుందన్ (Unni Mukundhan)!ప్రధాన పాత్రలో గత ఏడాది చివర్లో రిలీజ్ చేసిన చిత్రం మార్కో(Marco ). రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా హింసా ప్రభావం కారణంగా కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొంటుంది. ముఖ్యంగా థియేటర్లో సక్సెస్ అయిన ఈ సినిమా ఇప్పుడు టీవీ ప్రసారం నిలిచిపోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం శృతి మించిన హింస, క్రూరత్వం ఉండడమే అని చెప్పవచ్చు. అందుకే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ఈ సినిమాని టీవీలో ప్రసారం చేయకూడదని కఠిన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులకు, చిన్న పిల్లలకు ఈ సినిమా అసలు అనుకూలంగా లేదని కూడా స్పష్టం చేసింది. అంతేకాదు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ రీజనల్ ఆఫీసర్ నదీమ్ తుఫైల్ స్వయంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తూ ఓటీటీ స్ట్రీమింగ్ ను అడ్డుకోవాలని సూచించారు. దీనికి తోడు విడుదలకు ముందే మలయాళం లో ఈ సినిమాను మేకర్స్..”మోస్ట్ వైలెంట్ మలయాళం మూవీ” గా మార్కెట్ చేయడం కూడా ఈ చిత్రానికి వివాదాస్పదంగా మారింది.
థియేటర్ నుండి మార్కో మూవీ మధ్యలోనే లేచొచ్చిన హీరో..
అయితే ఇప్పుడు ఇలాంటి సినిమాపై తాజాగా తెలుగు హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) కూడా స్పందిస్తూ చేసిన కామెంట్లు ఆశ్చర్యంగా మారాయి. కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. “నేను నా భార్యతో కలిసి మార్కో సినిమా చూడడానికి వెళ్లాను. కానీ సినిమా సెకండ్ హాఫ్ లో హింస దాటికి తట్టుకోలేక మధ్యలోనే బయటకు వచ్చేసాము. అంత రక్తపాతం మేము సినిమా నుండి ఊహించలేదు. నా భార్య గర్భవతి కావడంతో ఈ సినిమా అసహజంగా అనిపించింది” అంటూ కామెంట్లు చేశారు. ఇక ప్రస్తుతం నాని చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. సినిమా ఎంత హింసాత్మకంగా ఉందో కిరణ్ మాటల్లోనే అర్థమవుతుంది అని నెటిజెన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.
స్పందించిన హీరో ఉన్ని ముకుందన్..
ఇకపోతే కిరణ్ అబ్బవరం అలా వ్యాఖ్యానించారో లేదో వెంటనే హీరో ఉన్ని ముకుందన్ కూడా స్పందించారు. “సమాజంలో ఉన్న హింసతో పోల్చుకుంటే మార్కో సినిమాలో పది శాతం కూడా మేము చూపించలేదు” అంటూ ఆయన సమర్థించుకున్నారు. కానీ ఈ సినిమా చూసిన చాలా మంది ప్రేక్షకులపై దీని ప్రభావం మరింత తీవ్రంగా పడిందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కొన్ని వర్గాలు ఇది ప్రేక్షకులకు రఫ్ యాక్షన్ మూవీ గా ప్రమోట్ చేయగా.. మరికొంతమంది హింసాత్మక మోతాదును దాటిపోయింది అంటూ నెగిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే అత్యంత క్రూరంగా ఈ సినిమాను చిత్రీకరించారని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే..ఒక వ్యక్తి తన కుటుంబాన్ని నాశనం చేసిన వారి మీద ప్రతీకారం తీర్చుకునే యాక్షన్ థ్రిల్లర్ మూవీ. అటు సెన్సార్ వాళ్లు ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను కట్ చేసినా.. టీవీలో చూడదగిన చిత్రం కాదని స్పష్టం చేయడంతో అటు చానల్స్ కూడా ఈ సినిమాను ప్రసారం చేయడానికి వెనుకంజ వేస్తున్నాయి.