Sai Pallavi.. డాన్సర్ గా కెరియర్ ఆరంభించిన సాయి పల్లవి (Sai Pallavi).. ప్రముఖ ఛానల్లో ప్రసారమైన ‘ఢీ డాన్స్’ షో ద్వారా తన ప్రతిభను చాటుకొని విజేతగా నిలిచింది. ఆ తర్వాత సినిమాలలోకి అడుగుపెట్టిన ఈమె, ‘ప్రేమమ్’ సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. తెలుగులో శేఖర్ కమ్ముల(Sekhar kammula)దర్శకత్వంలో మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్(Varun Tej) హీరోగా వచ్చిన ‘ఫిదా’ సినిమా ద్వారా అడుగుపెట్టి, అచ్చమైన తెలంగాణ అమ్మాయిలా.. తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ఇక ఇటీవల ‘అమరన్’, ‘తండేల్’ చిత్రాలతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈమె.. అటు బాలీవుడ్ లో హిందీ ‘రామాయణ్’ సినిమాలో సీత పాత్ర పోషిస్తోంది. ఇక అలా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న సాయి పల్లవి.. మరొకవైపు రెమ్యూనరేషన్ కూడా పెంచేసి అందరిని ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే.
సోదరుడి పెళ్లి వేడుకల్లో పాల్గొన్న సాయి పల్లవి..
ఇదిలా ఉండగా సాయి పల్లవికి సంబంధించిన ఒక విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయంలోకి వెళ్తే.. సాయి పల్లవి తన సినిమా షూటింగ్ లతో ఎంత బిజీగా ఉన్నా.. ఫ్యామిలీలో జరిగే వివాహ వేడుకలకు మాత్రం డుమ్మా కొట్టడం లేదు అని తెలుస్తోంది. అందులో భాగంగానే గత ఏడాది తన చెల్లెలు పూజా కన్నన్ వివాహం జరిపించిన ఈమె.. ఆమెను దగ్గరుండి మరీసాగనంపింది. ఇప్పుడు ఈమె ఇంత మరోసారి పెళ్లి భాజాలు మోగాయి. ఈ పెళ్లి వేడుకల్లో సాయి పల్లవి తన అద్భుతమైన డాన్స్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. సాయి పల్లవి కజిన్ బ్రదర్ జిత్తు పెళ్లి పీటలు ఎక్కారు. మార్చి 10వ తేదీన రూపా రాణి కుమార్ అనే యువతి తో గ్రాండ్గా ఆయన వివాహం జరిగింది. ఈ వేడుకలో సాయి పల్లవి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
కజిన్ బ్రదర్ పెళ్లి వేడుకల్లో డాన్స్ స్టెప్పులతో ఇరగదీసిన సాయి పల్లవి..
సోదరుడి పెళ్లి గురించి తన సోషల్ మీడియాలో సాయి పల్లవి ఎక్కడ పోస్ట్ పెట్టలేదు కానీ ఆమె ఫ్యాన్ పేజీలలో మాత్రం ఎప్పటికప్పుడు ఈ మ్యారేజ్ కి సంబంధించిన వివరాలు పోస్ట్ అవుతూనే వచ్చాయి. జిత్తూ నిశ్చితార్థ సమయంలో సాయి పల్లవి ఫోటోలను షేర్ చేయగా .. లేటెస్ట్గా పెళ్లి వీడియోలు ఫోటోలు కూడా పంచుకున్నారు. ముఖ్యంగా ఈ పెళ్లి వేడుకల్లో సాయి పల్లవి చాలా సంతోషంగా కనిపించింది. హల్దీ, సంగీత్, పెళ్లి, రిసెప్షన్ ఇలా ప్రతి మూమెంట్ ని కూడా ఆమె దగ్గరుండి మరీ ఆస్వాదించినట్లు తెలుస్తోంది. సోదరుడి వివాహంలో సాంప్రదాయంగా కనిపించిన ఈమె, ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి స్టెప్పులేసింది. ఇక అప్పుడు చెల్లి పెళ్లి వేడుకలలో డాన్స్ తో అదరగొట్టిన ఈమె, ఇప్పుడు కజిన్ బ్రదర్ పెళ్లి వేడుకల్లో కూడా అంతే ఉత్సాహంగా కనిపించింది. ఇక అంతేకాదు వధూవరుల వెనకే కూర్చొని అక్షింతలు వేసి ఆశీర్వదించిన వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఇది చూసిన నెటిజన్స్ మాత్రం అప్పుడేమో చెల్లి పెళ్లి, ఇప్పుడేమో సోదరుడి పెళ్లి.. మరి మీరు ఎప్పుడు చేసుకుంటారు పెళ్లి అంటూ కామెంట్లు చేస్తున్నారు . మరి సాయి పల్లవి ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతుందో చూడాలి.
?utm_source=ig_web_copy_link